మహేశ్ బాబు కొత్త మల్టీప్లెక్స్‌.. పూజా కార్యక్రమం ఫోటోలు వైరల్‌ | Mahesh Babu New AMB Multiplex Pooja Ceremony | Sakshi
Sakshi News home page

AMB Multiplex In Bengaluru: మహేశ్ బాబు కొత్త మల్టీప్లెక్స్‌.. పూజా కార్యక్రమం ఫోటోలు వైరల్‌

Published Thu, Apr 25 2024 4:48 PM | Last Updated on Thu, Apr 25 2024 4:48 PM

Mahesh Babu New AMB Multiplex Pooja Ceremony

బెంగళూరులో కొన్ని దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరించిన కపాలి సినిమా థియేటర్‌ 4 సంవత్సరాల క్రితం కూలగొట్టేశారు. గాంధీనగర్‌లో ఉన్న కపాలి థియేటర్ స్థానంలో AMB మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. ఈమేరకు నేడు ఏప్రిల్‌ 24న పూజా కార్యక్రమం నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో అధికారికంగా విడుదల చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఏషియన్‌ సినిమాస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ తన కుటుంబంతో సహా పాల్గొన్నారు.

ప్రిన్స్‌ మహేశ్ బాబు ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో సంయుక్తంగా హైదరాబాద్‌లో AMB పేరుతో మల్టీప్లెక్స్‌ను నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని బెంగళూరుకు విస్తరించారు. ఇప్పుడు ఐదంతస్తుల భవనంలో అత్యంత అధునాతన టెక్నాలజీతో 5 నుంచి 6 మల్టీప్లెక్స్ స్క్రీన్లను అక్కడ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో ఏఎమ్‌బి సినిమాస్ సక్సెస్ కావడంతో మహేశ్ బాబు ఆ చైన్‌ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. మూడేళ్ల క్రితమే బెంగళూరులో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. వాస్తవంగా అక్కడి మల్టీప్లెక్స్‌లలో కన్నడ సినిమాలకు తొలి ప్రాధాన్యం లభించదనే ఆరోపణ ఉంది. కానీ మహేశ్‌ బాబు మాత్రం అక్కడ తొలి ప్రాధాన్యం కన్నడ సినిమాలకు ఇవ్వాలని ఆయన సూచించినట్లు సమచారం. మరో కొద్దిరోజుల్లో బెంగళూరు  AMB మల్టీప్లెక్స్‌లో ఫస్ట్‌ సినిమా పడనుందని యాజమాన్యం ప్రకటించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement