
వేణు తొట్టంపూడి.. హీరోగా, కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తన సినిమాల్లో ఫిలాసఫి డైలాగ్‌లు చెబుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వేణు 1999లో వచ్చిన స్వయంవరం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే స్పెషల్ జ్యూరీ క్యాటగిరి కింద నంది అవార్డు గెలుచుకున్నాడు. ఆ తరువాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి మూవీల్లో లీడ్ రోల్ పోషించిన ఆయన.. హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా సినిమాల్లో నటించి తన గ్రాఫ్‌ను పెంచుకున్నాడు.
ఇక ఆయన నటించిన సినిమాలన్ని మంచి సక్సెస్ సాధించాయి. ఎందుకంటే తన సినిమాల్లో కాస్తా కొత్తదనం కోరుకుంటారు వేణు. అంతేగాక ప్రతి సినిమాల్లో తనలోని ప్రత్యేకతను చూపిస్తుంటాడు. అలా తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని దాదాపు 26 సినిమాల్లో నటించాడు. అలా 2009లో ‘గోపి గోపిక గోదారి’ మూవీలో నటించి కాస్తా బ్రేక్ తీసుకున్నాడు. కాగా ఇందులో హీరోయిన్‌గా కమలిని ముఖర్జీ నటించింది. ఈ సినిమా కూడా వేణు కేరీర్‌కు మంచి హిట్ అందించింది. అయితే ఈ మూవీ తర్వాత ఆయన బ్రేక్ ఇవ్వడంతో తన సినీ కేరీర్ కాస్తా వెనకపడింది. ఈ నేపథ్యంలో మంచి అవకాశం కోసం ఎదురు చూసిన ఆయనకు బోయపాటి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 2012లో వచ్చిన దమ్ము చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
ఈ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత రామాచారి సినిమా చేసినా అది కూడా పరాజయం పాలైంది. దీంతో వ్యాపారంపై దృష్టి పెట్టిన ఆయన ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యాపారవేత్తగా మారిపోయాడు. పూర్తిగా సినిమాలను, నటనను పక్కన పెట్టిన వేణు 2013లో లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బావ నామా నాగేశ్వరరావు కోసం టీఆర్ఎస్ తరఫున ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించాడు. ఈ క్రమంలో గతేడాది లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన పేదలకు వేణు తనకు తోచిన సాయం అందించి ఉదారత చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ కూడా అయ్యాయి. అయితే ఇప్పటికి మంచి అవకాశం వస్తే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు.
చదవండి:
హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment