ఇవాళ ఓటీటీలో చాలా వెబ్ సీరిస్ వస్తున్నాయి కానీ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. ఎవరికి వారు గదుల్లో ఉండి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అలాంటి అడల్ట్ సీన్స్ లేకుండా ఓ వెబ్ సిరీస్ చేయాలనుకున్నాను. ఆ టైమ్‌లోనే ‘అతిథి’స్క్రిప్ట్ వచ్చింది. కథ నచ్చి చేశాను. హారర్, కామెడీ ఇవన్నీ పక్కన పెడితే అందరూ కలిసి హాయిగా చూడగలిగే కథ ఇది’ అని హీరో వేణు తొట్టెంపూడి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సీరీస్ ‘అతిథి’.అవంతిక మిశ్రా హీరోయిన్.రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మీడియా కోసం రెండు ఎపిసోడ్స్‌ను ప్రివ్యూ వేశారు. అనంతరం హీరో వేణు మీడియాతో మాట్లాడుతూ..కరోనా టైమ్ లో వెబ్ సిరీస్ లు చాలా చూశాను. అప్పుడే ఒక వెబ్ సిరీస్ చేయాలని అనుకున్నాను. ఆ టైమ్ లో అతిథి స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. కథ చాలా బాగుంది. అయితే దీన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చేయాలని చెప్పాను. భరత్ అలాగే చేశాడు. అతిథి వెబ్ సిరీస్ ఇంత బాగా వచ్చిందంటే ఆ క్రెడిట్ నేను టెక్నీషియన్స్‌కే దక్కుతుంది’ అన్నారు.
‘మన తెలుగులో హారర్ మూవీస్ తక్కువ. ఎప్పుడో ఆర్జీవీ దెయ్యం చూశాం. ఇది అండర్ కరెంట్ గా హారర్ ఉంటూ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్యామిలీతో కలిసి చూస్తే ఎంజాయ్ చేస్తారు’అని దర్శకుడు భరత్ వైజీ అన్నారు. ‘అతిథిలో హారర్ అనేది అండర్ కరెంట్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశంలోని ట్విస్ట్, డెప్త్ ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎం జరుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది. భయపెట్టే దెయ్యాలు, అలాంటివి ఉండవు. మీరు పిల్లల్ని దగ్గర కూర్చో బెట్టుకుని కూడా అతిథి చూడొచ్చు’అని నటుడు రవి వర్మ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment