
నటుడు వేణు తొట్టెంపూడి గుర్తున్నాడు కదా.. స్వయంవరం సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి మూవీల్లో లీడ్ రోల్ పోషించిన ఆయన.. హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా సినిమాల్లో నటించి తన గ్రాఫ్‌ను పెంచుకున్నాడు.
హీరోగా, కమెడియన్‌గా తన నటనతో నటనతో అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే రవితేజ హీరోగా చేస్తున్న రామారావు ఆన్‌డ్యూటీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా రవితేజ హీరోగా చేస్తున్న ధమాకా సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్ రానుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల నటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment