
దమ్ము సినిమా తర్వాత కనిపించకుండా పోయాడు నటుడు వేణు తొట్టెంపూడి. ఈ సినిమా తర్వాత వ్యాపారాలతో బిజీ అయిన అతడు సినిమాలను పట్టించుకోవమే మానేశాడు. కానీ కరోనా టైంలో మళ్లీ సినిమాలపై ఇంట్రస్ట్ రావడం, అదే సమయంలో దర్శకుడు శరత్ మండవ చెప్పిన రామారావు ఆన్ డ్యూటీ కథ నచ్చడంతో సినిమా ఓకే చేశాడు వేణు. అప్పటివరకు తన పాత్రకు డబ్బింగ్ చెప్పని వేణు రామారావు ఆన్ డ్యూటీలో మాత్రం తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు కమెడియన్ సునీల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'చెప్పవే చిరుగాలి సినిమాలో నేను- సునీల్ కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు చించి ఆరేశాం. సునీల్ ఇప్పుడు విలన్‌గా కూడా చేస్తున్నాడు. ఒక ఆర్టిస్ట్‌గా అన్ని అవకాశాలు రావడం గొప్ప విషయం. తను చాలా బాగా చేస్తున్నాడు. కానీ నాకు మాత్రం పాత సునీలే ఇష్టం. సరదాగా భలే ఉండేవాడు. కానీ హీరోగా, విలన్‌గా అయితే నటించాల్సి వస్తుంది. కాబట్టి అతడి పాత సినిమాలే ఇష్టం' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: కమెడియన్ వెంట పరిగెత్తి మరీ కొట్టాను, సినిమాలో కూడా లేకుండా చేశా
సుహాస్ హీరో అనగానే అవసరమా? అంటూ చీప్ లుక్కిచ్చారు
Comments
Please login to add a commentAdd a comment