వామ్మో.. ఎలా దూకాడో చూడండి! | idiot leaps across train tracks | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఎలా దూకాడో చూడండి!

Published Wed, Dec 20 2017 6:14 PM | Last Updated on Wed, Dec 20 2017 6:42 PM

idiot leaps across train tracks - Sakshi

కొంతమంది సరదా కోసం చేసే సాహస విన్యాసాలు.. చూసేవాళ్లకు ఒళ్లు జలదరించేలా ఉంటాయి. ప్రాణాలు పణంగా పెట్టి చేసే సాహసకృత్యాలు ఒక్కోసారి అత్యంత భయానకంగా ఉంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా  ప్రాణం క్షణాల్లో గాల్లో కలిసిపోతుంది. ఇదిగో సరిగ్గా ఇలాంటి విన్యాసాన్ని లండన్‌ అడర్‌ గ్రౌండ్‌ రైల్వే స్టేషన్‌లో ఒక యువకుడు చేశాడు.

అది ఈస్ట్‌ లండన్‌లోని స్ట్రాఫోర్డ్‌ అండర్‌ గ్రౌండ్‌ రైల్వే స్టేషన్‌. ఇంతలో ఒక రైలు అత్యంత వేగంగా స్టేషన్‌ దాటుకుని వెళుతోంది. స్టేషన్‌లో పెద్దగా జనాలు ఎవరూ లేరు. ఇంతలో ఒక కుర్రాడు.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా.. ఒక​ గెంతుగెంతాడు. ఉన్న కొద్దిపాటి జనం ఆ దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయారు. ఆత్మహత్యా ప్రయత్నం అని కూడా సందేహించారు. అయితే ఇదేమి జరక్కుండా.. ఆ యువకుడు.. రైలును దాటుకుని ఇవతలి ఫ్లాట్‌మీదకు పడ్డాడు.. రైలు క్షణకాలం ఆలస్యం చేయకుండా వెళ్లిపోయింది.

యువకుడు సాహసంతో చేసిన ఈ విన్యాసం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తే.. 21 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరైతే.. దూకే ముందు మీ అమ్మ గుర్తుకు రాలేదా అని అడిగారు. మరొకరైతే.. ఇడియట్‌.. నీకు ఏమన్నా అయితే నీ తల్లిదండ్రుల మాటేమటి అని తిట్టారు. కొందరైతే ఇలాంటి సాహసాలు మళ్లీ చేయొద్దని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement