మాల్యా అప్పగింత కేసు; నేడు విచారణ
లండన్: కింగ్‌ఫిషర్ సంస్థల మాజీ అధినేత, రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసును లండన్ వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం విచారించనుంది. ఈ మేరకు నిందితుడు మాల్యా, భారత్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు.
బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను ఎగవేసి, లండన్ పారిపోయిన మాల్యా ఏడాదిన్నర కాలంగా అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. అతనిని రప్పించేందుకు సీబీఐ, ఈడీ నేతృత్వంలోని అధికారుల బృందం.. బ్రిటన్ న్యాయశాఖతో చర్చలుజరిపి అప్పగింత కేసు నమోదుచేయించిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) వాదనలు వినిపిస్తున్నది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను భారత అధికారులు సీసీఎస్‌కు అందించింది.