మాల్యాకు త్వరలోనే చెక్ పడనుందట!
న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారుడు, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా చాలా తొందరగా చెక్ చెప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు యూకే, భారత్ అధికారుల మధ్య చర్చలు చాలా ఫలితంగా సాగినట్టు తెలుస్తోంది. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాను దేశానికి రప్పించడం ముందుగానే ఊహించిన దాని కంటే జరుగనున్నట్టు తెలుస్తోంది. ఇరుదేశాల అధికారుల మధ్య జరిగిన చర్చలు పాజిటివ్‌గా ముగిసినట్టు తెలుస్తోంది.
పరస్పర న్యాయ సహాయంతో ఇరు దేశాల అధికారుల మధ్య ఒక సమావేశం తరువాత ఆయన్ను భారత్‌కు రప్పించే అంశంలో బ్రిటన్ అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మాల్యా కేసుపై నేరుగా వ్యాఖ్యానించడానికి ప్రభుత్వం ఇష్టపడకపోయినప్పటికీ, రెండు వైపులా వివరణాత్మక మరియు ఫలవంతమైన చర్చలు జరిగినట్టు అధికారిక ప్రతినిధి చెప్పారు. రెండు రోజుల సుదీర్ఘ సమాశాల్లో మాల్యాపై పెండింగ్ లో వివిధ కేసులను చర్చించినట్టు తెలిపారు. రెండు వైపులా న్యాయ సహకారం బలోపేతానికి పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనల పరిష్కారాన్ని వేగవంతం కోసం కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు