ముంబై/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. ముంబైలో మోదీకి చెందిన సముద్ర మహల్ లగ్జరీ రెసిడెన్షియల్ ఫ్లాట్లలో ఇప్పటివరకూ రూ.26.4 కోట్ల విలువైన ఆభరణాలు, చేతి గడియారాలు, పెయింటింగ్‌లను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎంఎఫ్ హుస్సేన్, కె.కె.హెబ్బర్ తదితరుల పెయింటింగ్స్ ఉన్నాయి. ఆభరణాల్లో ఓ ఉంగరం విలువే రూ.10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment