raids home
-
HYD: ఇరిగేషన్లో 300 కోట్ల అవినీతి తిమింగలం.. మూడు ఫామ్ హౌస్‌లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.వివరాల ప్రకారం.. నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆయనతో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గతంలోనూ లంచం తీసుకుంటూ నికేష్ కుమార్ పట్టుబడ్డారు. ఇక, సోదాల్లో భాగంగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. గండిపేట బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో నిబంధనకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్రనగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇక, నికేష్ పేరిట మూడు ఇల్లులు ఉండగా.. ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఫామ్ హౌస్‌ల విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక, కొల్లూరులో ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొయినాబాద్‌లో మూడు ఫామ్‌హౌస్‌లు ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. నికేష్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ నికేష్ ఏసీబీకి దొరికారు. -
ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్ కమిషనర్.. రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు
పశ్చిమ గోదావరి : కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టిన భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తింపు - చెత్త సేకరణ మొదలు, కారుణ్య నియామకాల వరకు అంతా అవినీతే - వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకున్న శివరామకృష్ణ - అక్రమ సంపాదనతో విదేశీ పర్యటనలు చేసినట్లు ఏసీబీ గుర్తింపు - శివరామకృష్ణ ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు - ఇవాళ కూడా కొనసాగనున్న సోదాలు -
తవ్వేకొద్దీ అవినీతి.. కట్టలు కట్టలుగా డబ్బులు,కళ్లు తిరిగేలా బంగారం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్ష నాయకుడు ఎడపాడి పళనిస్వామికి సన్నిహితుడైన కాంట్రాక్టరు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారుల తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. ఎడపాడికి.. మదురైకి చెందిన మురుగవేల్, ఆయన కుమారులు అత్యంత సన్నిహితులు. ఎడపాడి ద్వారా 2016 నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు పొంది భారీస్థాయిలో ఆర్జించారు. అయితే ఆదాయపు పన్ను ఎగవేసినట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులకు దిగారు. తవ్వేకొద్దీ అవినీతి బయటపడటంతో రెండోరోజైన గురువారం కూడా తనిఖీలు కొనసాగించారు. మదురై, దిండుగల్లు జిల్లాల్లో 15కు పైగా భవన నిర్మాణ కంపెనీల నుంచి రూ.27 కోట్ల నగదు, 3 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి! -
నటి కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు..
Child Welfare Officials Raid In Actress Karate Kalyani Home: నటి కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి శ్రీకాంత్‌రెడ్డి పరస్పర దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదిరి ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్ఆర్ నగర్ సీఐ సైదులుపై కల్యాణి ఫైర్ అయింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి ఉన్న విషయం తెలిసిందే. చదవండి: కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4451453475.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వ్యభిచార దందా.. ఒక మహిళ.. ఇద్దరు యువతులను రప్పించి..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ ఇద్దరు యువతులను తీసుకొని వచ్చి తిమ్మాపూర్ శివారులోని ఇల్లు అద్దెకు తీసుకొని, వ్యభిచారం నిర్వహిస్తోంది. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి, జగిత్యాలకు చెందిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు, నిర్వాహకురాలు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఆయన వెంట జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
అంగన్వాడీ కార్యకర్త.. వామ్మో అవినీతి సొమ్ము అంత వెనకేసిందా?
భువనేశ్వర్: అంగన్వాడీ కార్యకర్త అక్రమాస్తుల సంపాదన వ్యవహారాన్ని విజిలెన్స్ సిబ్బంది మంగళవారం బట్టబయలు చేశారు. పలుచోట్ల ఒకేసారి నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఈ విషయం తేటతెల్లమైంది. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని కొరొడొకొంటా అంగన్వాడీ కేంద్రం కార్యకర్త కబితా మఠాన్ రూ.4 కోట్లు పైబడి విలువైన ఆస్తులను ఆర్జించినట్లు విజిలెన్స్ అధికారులు లెక్క తేల్చారు. ఖుర్దా, కేంద్రాపడా, జగత్సింఘ్పూర్ జిల్లాల్లో ఒకేసారి ఉదయం సోదాలు చేపట్టిన అధికారులు అక్రమాస్తుల చిట్టాని వెలుగులోకి తీసుకువచ్చారు. సదరు అంగన్వాడీ కార్యకర్త ఆస్తుల గుట్టు రట్టు చేయడంలో 6 బృందాలు పాల్గొనగా, వీరిలో 10 మంది డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 4 భవనాలు, 10 ఇళ్ల స్థలాలు, విలాసవంతమైన కారు, విలువైన బంగారు ఆభరణాలను కబితా మఠాన్ ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. భవనాల్లో భువనేశ్వర్‌లో 4 అంతస్తుల భవనం ఒకటి, 3 అంతస్తుల భవనం మరొకటి, 2 రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. అలాగే జగత్సింఘ్పూర్ జిల్లాలోని తొలొకుసుమ ప్రాంతంలో 3 ఇళ్ల స్థలాలు, ఖుర్దా జిల్లాలోని బలియంత ప్రాంతంలో ఒక ఇంటి స్థలం, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు ఉండగా, రూ.2.20 లక్షల విలువైన బీమా పొదుపు ఖాతాలు, రూ.6.36 లక్షలు విలువ చేసే 212 గ్రాముల బంగారం ఆభరణాలు, పలు స్థిర చరాస్తులు ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల దాడిలో గుర్తించారు. వీటి సమగ్ర విలువ రూ.4 కోట్లు పైబడి ఉంటుందని అధికార వర్గాల సమాచారం. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. -
మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ఐసిస్‌తో లింక్?
సాక్షి, బనశంకరి: సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే బీఎం ఇదినబ్బ కుమారుడి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళూరులోని మస్తికట్టెలో ఉన్న బీఎం బాషా నివాసంపై బుధవారం ఎన్ఐఏ ఐజీపీ ఉమా నేతృత్వంలో 25 మంది బృందం దాడి చేసింది. స్థానిక పోలీసులతో కలిసి సోదాలతో పాటు విచారణ ప్రారంభించారు. బాషా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, అతని ఇద్దరు కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. అతడి కుమార్తె కొన్నేళ్ల క్రితం కేరళ నుంచి అదృశ్యమైంది. ఆమె సిరియాలో ఐసిస్‌లో చేరినట్లు అనుమానాలున్నాయి. బాషా కుటుంబసభ్యులు ఐసిస్ నిర్వహించే యుట్యూట్ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసినట్లు తెలి సింది. దీంతో ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమైంది. అంతేగాక జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న యువకులతో బాషా కుటుంబీకులు ఫోన్లో సంభా షించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఉళ్లాల నియోజకవర్గంలో మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న బీఎం.ఇదినబ్బ పాత్రికేయుడు, స్వాతం త్య్ర సమరయోధుడు, కన్నడ సాహితీవేత్త, కన్నడ ఉద్యమకారునిగా పేరుగాంచారు. ఆయన 2009లో కన్నుమూశారు. ఆయన కుమారుడు బాషా ఉగ్రవాద ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. -
అర్జంట్ అని బాత్రూమ్కు వెళ్లాడు, కిటికీలో నుంచి దూకే క్రమంలో..
నొయిడా: పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ క్రిమినల్ రెండో అంతస్థులో ఉన్న బాత్రూమ్ కిటికీలో నుంచి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. ఇటీవల పోలీసులపైకి కాల్పులకు తెగబడిన మహ్మద్ ఇమ్రాన్ కోసం పోలీసు శాఖ తీవ్రంగా గాలిస్తోంది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఇమ్రాన్ గ్రేటర్ నోయిడాలోని ఒమైక్రాన్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో నేరస్థుడి ఉన్న ఇంటిపై పోలీసులు దాడి చేయగా ఇమ్రాన్ ఇద్దరు బామ్మర్దులు లక్మాన్, చాంద్ మహమ్మద్‌లు పట్టుబడ్డారు. వారిని ఇమ్రాన్ ఆచూకీ కోసం విచారణ చేస్తుండగా.. చాంద్ మహమ్మద్ బాత్రూమ్కు వెళ్లాలని పోలీసులకు చెప్పి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బాత్రూమ్ కిటికీలో నుంచి కిందికి దూకాడు. అయితే చాండ్ ఉన్నది రెండో అంతస్థు కావడంతో కిందపడి తీవ్రం గాయాల పాలయ్యాడు. పోలీసులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడని గ్రేటర్ నోయిడా డీసీపీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. చాంద్ పై డజనుకు పైగా దొమ్మి, హత్య కేసులు ఉన్నాయని, ఇన్స్పెక్టర్ అక్తర్ ఖాన్ హత్య కేసులో కూడా అతడు ప్రధాన నిందితుడని వెల్లడించారు. ( చదవండి: జువైనల్ హోం నుంచి యువతి పరార్.. ) -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు!
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పౌర హక్కుల సంఘాల నేతలు, పలువురు న్యాయవాదులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించి సెల్ఫోన్లు, పలు పుస్తకాలు, విప్లవ గీతాల సీడీలు, డీవీడీలు, హార్ట్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, కేరళ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, జవహర్‌నగర్‌లో నివసించే పలువురు పౌరహక్కుల సంఘం న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలపై ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని కోదండరాం నగర్లో నివసించే రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు, న్యాయవాది వి.రఘునాథ్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపి ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి పొద్దుపోయేదాకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్‌నగర్‌లో ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక గుడిమల్కాపూర్ తాళ్లగడ్డ బస్టాప్ సమీపంలోని ఒక ఇంటి వద్దకు వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. ఆ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఇరుగుపొరుగు వారిని విచారించారు. ఎక్కడా కూడా మీడియాను అనుమతించలేదు. అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం అధికారులు ఈ సోదాలు చేసినట్టు తెలుస్తోంది. ఏపీలోనూ సోదాలు.. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది చిలుకా చంద్రశేఖర్ ఇంట్లో ఎన్ఐఏ బృందం తనిఖీలు జరిపింది. అదేవిధంగా గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రభునగర్‌లో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాజేశ్వరి నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.రాజేశ్వరితో పాటు లా చదువుతున్న ఆమె కుమార్తెను, వైజాగ్‌లో చదువుతున్న ఆమె కుమారుడిని సైతం ఎన్ఐఏ బృందం విడివిడిగా ప్రశ్నించింది. కుటుంబ సభ్యుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు, కారు, ద్విచక్ర వాహనాలు, చెప్పుల స్టాండును సైతం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాజమహేంద్రవరంలోని ఉంటున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు ఇంట్లోనూ బుధవారం రాత్రి సోదాలు జరిగాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో విప్లవ రచయితల సంఘం (విరసం) మాజీ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. న్యాయవాదుల ఇళ్లలో సోదాలు విశాఖ నగరంలోని ముగ్గురు న్యాయవాదుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. పిఠాపురం కాలనీ కళా భారతి సమీపంలోని న్యాయవాది, సీఆర్పీపీ ప్రతినిధి కె.పద్మ ఇంట్లో తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను విచారించినట్టు సమాచారం. చినవాల్తేరులో న్యాయవాది కె.శివాచలం, హెచ్‌బీ కాలనీలో న్యాయవాది బాలకృష్ణ ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న విప్లవ రచయితల సంఘం నాయకుడు దివంగత చలసాని ప్రసాద్ ఇంటి వద్ద కూడా ఎన్ఐఏ పోలీసులు భారీగా మోహరించారు. న్యాయవాది బాలకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి ఏ క్షణమైనా ఈ ముగ్గుర్నీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కర్నూలు నగరం శ్రీలక్ష్మీ నగర్లో ఉంటున్న విరసం సభ్యుడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. విశాఖ కేసు ఆధారాలతోనే.. విశాఖ ఏజెన్సీ పరిధిలోని ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 7వ తేదీన విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న పాంగి నాగన్న అనే జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద మావోయిస్ట్ విప్లవ సాహిత్యం, ప్రెస్నోట్లు, వైర్లు, మరికొంత సామగ్రి లభించాయి. అతన్ని విచారించగా మావోయిస్టుల కోసం పనిచేస్తున్నట్టు అంగీకరించాడని ఎన్ఐఏ తెలిపింది. జర్నలిస్టుగా పని చేస్తూ పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేస్తున్నట్టు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ కోసం వెళ్తున్న పోలీసులను అడ్డుకునేలా గ్రామస్తులను రెచ్చగొట్టాడని పేర్కొన్నారు. అతనిచ్చిన సమాచారంతో దాదాపు 64 మంది అనుమానితుల జాబితాను ఎన్ఐఏ రూపొందించింది. ఇప్పుడు ఆ జాబితాలోని అనుమానితుల ఇళ్లల్లోనే సోదాలు నడుస్తుండటం విశేషం. ప్రజా గొంతుక నొక్కడమే పౌర హక్కుల నేతల ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించడాన్ని ఆ సంఘం తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. తమపై ముందే కేసులు పెట్టి ఇపుడు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల గొంతు నొక్కే ప్రయత్నమని ధ్వజమెత్తారు. పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఈ సోదాలను ఖండించారు. -
వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు
సాక్షి, బెంగళూరు: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముంబై నివాసంపై బెంగళూరు పోలీసులు గురువారం సోదాలు చేశారు. మత్తుమందుల కేసులో నిందితుడిగా ఉన్న వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వా కోసం ఈ దాడులు జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఆదిత్యపై ఓ కేసు నమోదు కాగా అతడు పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ‘ఆదిత్య సమాచారం తెలియడంతో కోర్టు వారెంట్‌తో అతడి బంధువైన వివేక్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు’ అని కమిషనర్ చెప్పారు. తనిఖీల ఫలితం ఏమిటన్నది మాత్రం వివరించలేదు. ఆదిత్య మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆళ్వా కుమారుడు. రేవ్‌పార్టీలు, మత్తుమందు సరఫరాదారులు, అమ్మకం దార్లపై పోలీసులు విరుచుకుపడిన నేపథ్యంలో కన్నడ సినీనటులు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీసహా కొందరు నైజీరియన్లను అరెస్ట్ చేయడం తెల్సిందే. రెండు నెలల క్రితం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులు తాము నటులకు మత్తుమందులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతోనే ఈ అరెస్ట్‌లు జరిగాయని సమాచారం. -
కంచే చేను మేసె!
సాక్షి, తిరుపతి: అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో కుమ్మక్కై దోచుకుంటున్నారు. బోయకొండ సమీపంలోని అటవీ భూముల్లో అక్రమ మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిన కేసులో డీఎఫ్ఓ, ముగ్గురు రేంజర్లు, ఒక సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసింది. ఈ సంఘటన మరువక ముందే.. అటవీశాఖలో పనిచేసే నలుగురు డీఆర్వోల నివాసాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో ఈ సంఘటన కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు స్మగ్లర్లతో కుమ్మ క్కై కోట్లకు పడగలెత్తారని ఆరోపణలున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాకు వీరు సహకరించారనే అనుమానాలున్నాయి. అక్రమార్కుల నుంచి ముడుపులు జిల్లాలో శేషాచలం అడవుల్లో అత్యంత విలువైన ఎర్రచందనం విస్తారంగా ఉన్న విషయం తెలిసిందే. చిత్తూరు అటవీ రేంజ్ పరిధిలో విలువైన మైనింగ్ లభ్యమవుతుంది. అటవీ సంపదను రక్షించేందుకు నియమించిన డీఎఫ్ఓ చక్రపాణి, మరో నలుగురు అటవీ అధికారులు మాధవరావు, మదన్‌మోహన్‌రెడ్డి, ఈశ్వరయ్య, రవిబాబు బోయకొండ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ రవాణాకు అనుమతులు ఇచ్చారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అటవీ సరిహద్దులనే మార్చివేసి అక్రమార్కుల నుంచి భారీ ఎత్తున ముడుపులు పుచ్చుకున్నట్లు విజిలెన్స్ విచారణలో బయటపడడంతో వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సంఘటన మరువక ముందే మరో నలుగురు అటవీ అధికారుల నివాసాల్లో గురువారం ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఎర్రదొంగలతో కుమ్ముక్కు శేషాచలం అటవీ పరిధిలో నిత్యం ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలిసిందే. అక్రమంగా తరలిపోవడానికి కొందరు ఇంటి దొంగల సహకారం ఉందనే విషయం అధికార వర్గాల్లో అనుమానాలు ఉన్నాయి. అటవీ, టాస్క్ ఫోర్స్‌లోని కొందరు అధికారుల సహకారంతో ఎర్రచందనం అక్రమ రవాణా మూడు లోడ్లు, ఆరు కోట్లుగా సాగిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణాలో భాగస్వామ్యులుగా ఉన్న కొందరు అధికారులు కోట్ల రూపాయలకు పడగలెత్తినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. అందులో భాగంగా గురువారం ఏసీబీ అధికారులు అటవీశాఖలో పనిచేసే డీఆర్వోలు వెంకటాచలపతి నాయుడు, బాలకృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, మాధవరావు నివాసాల్లో దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఏడు బృందాలుగా విడిపోయి నలుగురి నివాసాలతో పాటు బెంగుళూరు, చిత్తూరు, చంద్రగిరి, రాయచోటిలో ఉన్న వారి బంధువులు, స్నేహితుల నివాసాల్లో అర్థరాత్రి వరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వెంకటాచలపతి నాయుడుకు రూ.5 కోట్లు విలువచేసే ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. తిరుపతిలోని తీర్థకట్ట వీధిలో ఆరు అంతస్తుల భవనం, అన్నారావు కూడలిలో ఐదు అంతస్తుల భవనం, గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలో షాపింగ్ కాంప్లెక్స్, శ్రీనివాసపురంలో గోదాము ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అదే విధంగా నగదు, బంగారు ఆభరణాలు, మరి కొన్ని డాకుమెంట్లను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. అటవీశాఖలో కలకలం ఏసీబీ దాడులతో అటవీశాఖలో కలకలం రేపుతోంది. అధికారులే స్మగ్లర్లకు సహకారం అందిస్తున్న విషయం వెలుగు చూడడంతో మరి కొందరు ఇంటి దొంగల్లో కలవరం మొదలైంది. ఏసీబీ దాడుల నేపథ్యంలో సీఎఫ్ఓ గురువారం రాత్రి అటవీశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడులకు దారితీసిన కారణాలను గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఎర్రచందనం స్మగ్లర్లతో ఇంకా ఎవరెవరు సంబంధాలు కలిగి ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు
సాక్షి, తిరుపతి: తిరుపతి అటవీశాఖ డిప్యూటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్( డిఎఫ్ఓ) వెంకటా చలపతి నాయుడు అక్రమ ఆస్తులపై రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు సహచర ఉద్యోగులు వెంకటరామిరెడ్డి, బాలకృష్ణరెడ్డి, మాధవరావు ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెంకటా చలపతి నాయుడు 20 కోట్ల రూపాయలు దాకా అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయన నివాసంలో 14 జింక కొమ్ములను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో వెంకటా చలపతి నాయుడు నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన స్వగ్రామం చంద్రగిరి మండలం ముంగిలిపట్టు, అత్తగారి గ్రామం నుండుపల్లిలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. బెంగుళూరులో వెంకటా చలపతి నాయుడు బావమరిది నివాస గృహంలో కూడా మరో బృందం సోదాలు చేపట్టింది. టీకే వీధిలో వెంకటా చలపతి నాయుడుకు చెందిన రూ.10 కోట్లు విలువైన ఆరు అంతస్తుల భవనం, అన్నారావు సర్కిల్లో 8 కోట్ల విలువైన ఆరు అంతస్తుల భవనం, గోవిందరాజా స్వామి నార్త్ మాడ వీధిలో షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు, బెంగుళూరు,చిత్తూరు, కడప జిల్లా రాయచోటిలలో పలు ఆస్తులను గుర్తించారు. మొత్తం ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. వెంకట చలపతి నాయుడు అక్రమ ఆస్తుల బాగోతంపై అటవీశాఖలో విస్తృత చర్చ జరుగుతుంది. -
తిరుపతిలో ఏసీబీ దాడులు
-
అటవీ శాఖలో అవినీతి తిమింగలం
సాక్షి, తిరుపతి: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు.. లంచావతారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అవినీతి అధికారుల భరతం పట్టమని, పారదర్శకంగా పనులు జరగాలని సీఎం వైఎస్ జగన్మోహర్రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తిరుపతి అటవీశాఖ డిప్యూటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్( డిఎఫ్ఓ) వెంకటా చలపతి నాయుడు నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అన్నారావు కూడలి సమీపంలో మోర్ సూపర్ మార్కెట్ వెనుక వైపు ఉన్న ఎం-2 గ్రాండ్ హోటల్ నాలుగో అంతస్తు ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. తిరుపతితో పాటు ఏకకాలంలో కడప జిల్లా రాయచోటి, చిత్తూరు, బెంగుళూరు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఏఎస్పీ ఎం శ్రీనివాస్, డిఎస్పీ అల్లాబక్ష్, ఇన్స్పెక్టర్లు గిరిధర్, రవికుమార్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వెంకటా చలపతి నాయుడుకు చెందిన రూ.50 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. టీకే వీధిలో రూ.10 కోట్లు విలువైన ఆరు అంతస్తుల భవనం, అన్నారావు సర్కిల్లో 8 కోట్ల విలువైన ఆరు అంతస్తుల భవనం, గోవిందరాజా స్వామి నార్త్ మాడ వీధిలో షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు, బెంగుళూరు,చిత్తూరు, కడప జిల్లా రాయచోటిలలో పలు ఆస్తులను గుర్తించారు. మొత్తం ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. -
వణుకుతున్న అక్రమార్కులు..
సాక్షి, విశాఖపట్నం: అవినీతిపరులపై దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతిని ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఇంజినీర్ కందుల తవిటరాజు ఇంటిపై శుక్రవారం ఏబీసీ దాడులు చేపట్టింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నారు. విశాఖ గాజువాకలోని శ్రామికనగర్, శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లా రామభద్రపురం దరి కొట్టక్కిలో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. (బినామీల ఇళ్లలో సిట్ సోదాలు) -
విజయవాడలో ఏసీబీ దాడులు
సాక్షి, విజయవాడః ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ రామకృష్ణ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కేసులో రామకృష్ణ ఇంటిలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏలూరు, హైదరాబాద్, చెన్నైలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. ఏలూరులోని రామకృష్ణ ఇంటిలో రెండు లాకర్లను గుర్తించారు. 8.67 లక్షల నగదు, విలువైన ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రామకృష్ణ సస్పెన్షన్‌లో ఉన్నారు. -
ఏసీబీ దాడులు.. కేజీ బంగారం సీజ్!
-
సంక్షేమంలో అవినీతి సామ్రాట్
నెల్లూరు(అర్బన్): దళిత వర్గాల అభ్యున్నతికి పాటు పడేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ (సోషల్ వెల్ఫేర్) జిల్లాలో అవినీతికి అడ్డాగా మారింది. ఫైళ్ల క్లియరెన్స్ పేరిట భారీగా వసూళ్లు, బ్యాంక్‌ల ఖాతాల్లో నగదు తారుమారు, గురుకుల పాఠశాలల పేరుతో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ చేయడం వంటివి పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన డీడీ మధుసూదన్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి కంపు మరోసారి గుప్పుమంది. జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డీడీగా మధుసూదన్‌రావు 2015 డిసెంబర్లోబాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 81 వరకు సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహ అధికారుల నుంచి ప్రతి నెలా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయనకు ముడుపులు ఇచ్చుకునేందుకు వసతి గృహ అధికారులు విద్యార్థుల మెనూకు కోత వేసి తమ అధికారిని సంతృప్తి పరిచేవారనే ఆరోపణలు లేకపోలేదు. వసూళ్లకు శ్రీకారం ఆ శాఖకు చెందిన బ్యాక్లాగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తున్నారని నమ్మించి పలువురు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాల్లో వసూళ్లు చేశారనే ప్రచారం జరుగుతోంది. నాయుడు పేటలో దళిత వర్గాల కోసం స్ఫూర్తి గురుకుల పాఠశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇక్కడ కళాశాల ప్రారంభించక ముందే ప్రారంభించినట్టు చూపి రూ.కోటి వరకు నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 17 బ్యాంక్‌ల్లో రూ. 86.90 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇందులో ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయానికి రూ.42 లక్షలకే లెక్కలు చూపుతున్నట్టు సమాచారం. డీడీ కార్యాలయ కోటరీపైన ఏసీబీ దృష్టి మధుసూదనరావుకు డిప్యూటీ డైరెక్టర్ కార్యాయలంలో కొందరు ఉద్యోగులు అన్ని తామై చూసుకునే వారు. నెలవారీ మామూళ్లు మొదలుకుని అన్ని అంశాలు వీరే చక్కబెట్టేవారు. గతంలో ఎన్ని బదిలీలు జరిగినా పైరవీలు, కోర్టులకు వెళ్లి మరీ బదిలీలు నిలుపుదల చేయించుకున్నారు. తాజాగా మధుసూదనరావు నివాసంలో ఏసీబీ సోదాల నేపథ్యంలో కొందరు కార్యాలయ సిబ్బందిలో తీవ్ర అలజడి మొదలైంది. ముఖ్యంగా 8 మంది ఉద్యోగులు అన్ని తామై చక్రం తిప్పారని సమాచారంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు వారిపై దృష్టి సారించినట్లు సమాచారం. బదిలీ జరిగినా వారాల తరబడి ఇక్కడే అక్టోబర్ 12వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా మధుసూదన్‌రావు తూర్పుగోదావరి జిల్లాకు డీడీగా బదిలీ అయ్యారు. అయితే ఆయన రెండు వారాలకు పైగా జిల్లా నుంచి రిలీవ్ కాలేదు. తన బదిలీని నిలుపుదల చేయించుకునేందుకు పైస్థాయిలోనే పైరవీలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రిలీవ్ కాకుండానే కార్యాలయానికి వచ్చి ప్రమోషన్ల, ఇన్చార్జీ, బదిలీలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ పేరిట పెద్దఎత్తున అక్రమ వసూళ్లకు తెర లేపారని సమాచారం. అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్ వంటి మహానేతల జయంతులను ప్రభుత్వం రాష్ట్ర పండగలుగా గుర్తించి నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ వారి ఉత్సవాల పేరిట వసతిగృహ అధికారుల నుంచి నిధులు వసూలు చేసి ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని దిగమింగారనే వార్తలు గుప్పుమన్నాయి. భారీగా ఆస్తులు గుర్తింపు ఏసీబీ అధికారులు దాడి చేసి మధుసూదనరావుకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన నివాసంలో బహిరంగ మార్కెట్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. ఒక కిలో బంగారం నగలు, ఒకటిన్నర కిలోల వెండి, రూ.లక్ష వరకు నగదు దొరికింది. ఇవి కాక వివిధ బ్యాంక్ ఖాతాలు.. అందులో ఉన్న నగదు, చెక్కులకు సంబంధించి మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. డీడీ ఉద్యోగ ప్రస్థానాలు దాసరి మధుసూదనరావు నెల్లూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తూ ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. అదే నెల 29వ తేదీన ఆయన నెల్లూరు నుంచి బదిలీ అయ్యారు. ఇంత వరకూ తూర్పుగోదావరి జిల్లాలో బాధ్యతలు స్వీకరించలేదు. గుంటూరు జిల్లాకు చెందిన మధుసూదనరావు 2004 జూలై 20వ తేదీన చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి (సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్)గా విధుల్లో చేరారు. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పని చేశారు. 2010 ఏప్రిల్ 6వ తేదీన డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. డీడీగా వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాలో పని చేసి 2015 డిసెంబర్లో నెల్లూరు సోషల్ వెల్ఫేర్ డీడీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పాటు జిల్లాలో పని చేసి ఇటీవల బదిలీ అయ్యారు. -
పోలీసుల తీరుపై గవర్నర్,ఈసీకి ఫిర్యాదు చేస్తాం
-
నీరవ్‌కు చెందిన రూ.26 కోట్ల ఆస్తుల జప్తు
ముంబై/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. ముంబైలో మోదీకి చెందిన సముద్ర మహల్ లగ్జరీ రెసిడెన్షియల్ ఫ్లాట్లలో ఇప్పటివరకూ రూ.26.4 కోట్ల విలువైన ఆభరణాలు, చేతి గడియారాలు, పెయింటింగ్‌లను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎంఎఫ్ హుస్సేన్, కె.కె.హెబ్బర్ తదితరుల పెయింటింగ్స్ ఉన్నాయి. ఆభరణాల్లో ఓ ఉంగరం విలువే రూ.10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. -
వెంట్రుకల వ్యాపారి @65 కోట్ల అక్రమాదాయం
బెంగళూరు: మానవ వెంట్రుకల వ్యాపారం చేస్తూ రాబడిని తక్కువగా చూపించి పన్ను ఎగ్గొడుతున్న ఓ వ్యాపారి గుట్టును ఆదాయపు పన్ను విభాగం అధికారులు రట్టు చేశారు. ఉత్తర కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి మనుషుల వెంట్రుకలను సేకరించి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఆలయాల్లో భక్తులు సమర్పించే తలనీలాలు, బ్యూటీపార్లర్లు తదితర ఇతర మార్గాల్లో వెంట్రుకలను సేకరిస్తున్నాడు. హాస్టళ్లలో ఉండే అమ్మాయిలూ డబ్బుకోసం తమ జుట్టును కత్తిరించి ఇస్తున్నారని తెలుసుకుని అధికారులు విస్తుపోయారు. వ్యాపారి కార్యాలయం, ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.65 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా పన్ను ఎగ్గొట్టాడని గుర్తించారు. -
విశాఖలో సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
విశాఖలో సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
విశాఖపట్టణం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ మధురపూడి సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లంచాలు తీసుకోవటంతోపాటు టీడీపీ నేతలు, రౌడీ షీటర్లతో దగ్గరి సంబంధాలు నెరపుతున్నట్లు ఆనంద్‌కుమార్‌పై ఆరోపణలున్నాయి. దీంతో లాసన్స్బేలో ఉన్న ఆయన ఇంటికి సోమవారం ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లగా అంతకుమునుపే సమాచారం అందుకున్న సబ్‌రిజిస్ట్రార్ ఆనంద్‌కుమార్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మూడు రోజులపాటు వేచి చూసిన అధికారులు గురువారం ఇంటి తాళం పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో హైదరాబాద్‌తోపాటు పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లోని 10 చోట్ల ఏసీబీ తనిఖీలు చేసింది. ఆయన కుటుంబసభ్యుల, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించి ఇప్పటికే రూ.1.60 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే ఈ సోదాల్లో సుమారు 10 కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్టు సమాచారం. కాగా, డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. వివరాలు తెలియాల్సి ఉంది.