
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్ష నాయకుడు ఎడపాడి పళనిస్వామికి సన్నిహితుడైన కాంట్రాక్టరు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారుల తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. ఎడపాడికి.. మదురైకి చెందిన మురుగవేల్, ఆయన కుమారులు అత్యంత సన్నిహితులు. ఎడపాడి ద్వారా 2016 నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు పొంది భారీస్థాయిలో ఆర్జించారు.
అయితే ఆదాయపు పన్ను ఎగవేసినట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులకు దిగారు. తవ్వేకొద్దీ అవినీతి బయటపడటంతో రెండోరోజైన గురువారం కూడా తనిఖీలు కొనసాగించారు. మదురై, దిండుగల్లు జిల్లాల్లో 15కు పైగా భవన నిర్మాణ కంపెనీల నుంచి రూ.27 కోట్ల నగదు, 3 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి!
Comments
Please login to add a commentAdd a comment