
సాక్షి, విజయవాడః ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ రామకృష్ణ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కేసులో రామకృష్ణ ఇంటిలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏలూరు, హైదరాబాద్, చెన్నైలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. ఏలూరులోని రామకృష్ణ ఇంటిలో రెండు లాకర్లను గుర్తించారు. 8.67 లక్షల నగదు, విలువైన ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రామకృష్ణ సస్పెన్షన్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment