
బెంగళూరు: మానవ వెంట్రుకల వ్యాపారం చేస్తూ రాబడిని తక్కువగా చూపించి పన్ను ఎగ్గొడుతున్న ఓ వ్యాపారి గుట్టును ఆదాయపు పన్ను విభాగం అధికారులు రట్టు చేశారు. ఉత్తర కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి మనుషుల వెంట్రుకలను సేకరించి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.
ఆలయాల్లో భక్తులు సమర్పించే తలనీలాలు, బ్యూటీపార్లర్లు తదితర ఇతర మార్గాల్లో వెంట్రుకలను సేకరిస్తున్నాడు. హాస్టళ్లలో ఉండే అమ్మాయిలూ డబ్బుకోసం తమ జుట్టును కత్తిరించి ఇస్తున్నారని తెలుసుకుని అధికారులు విస్తుపోయారు. వ్యాపారి కార్యాలయం, ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.65 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా పన్ను ఎగ్గొట్టాడని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment