History Of Income Tax: 'ఇన్‌కమ్ ట్యాక్స్' (Income Tax).. ఈ పదం గురించి పరిచయమే అవసరం లేదు. లెక్కకు మించిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. అయితే ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ ఎప్పుడు ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇన్‌కమ్ ట్యాక్స్ చరిత్ర..
నివేదికల ప్రకారం, మొదటి సారి 1860 జులై 24న సర్ జేమ్స్ విల్సన్ అనే బ్రిటీష్ అధికారి మనదేశంలో 'ఇన్‌కమ్ ట్యాక్స్' విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. దీనికి ఒక ప్రధాన కారణం ఉన్నట్లు కూడా చెబుతారు. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ పాలనకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ పథకం అమలులోకి వచ్చింది. ఆ తరువాత 1922లో భారతీయులు సంపాదించే ఆదాయానికి పన్ను చెలించడం మొదలుపెట్టారు. ఇది క్రమంగా 1939 నాటికి ఇందులో కొంత మార్పు చేశారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ దినోత్సవం..
2010లో దేశ ఆర్థిక శాఖ జులై 24ని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక దినోత్సవంగా ప్రకటించి ఈ ఉత్సవాలను అప్పటి ఆర్థిక మంత్రి ప్రారంభించారు. తరువాత ప్రతి ఏటా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇందులో భాగంగానే దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
(ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!)
మన దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ విధానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు స్పష్టమైంది. కాగా ఈ ఆదాయ పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాక్స్ చెల్లింపులను ప్రోత్సహించడం, భవిష్యత్తులో ట్యాక్స్ సక్రమంగా చెల్లించేలా చేయడం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. పౌరులందరూ సకాలంలో ట్యాక్స్ కట్టినట్లయితే దేశం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు మసలుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment