
సాక్షి, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం విడుదల చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో గెలుపొంది.. మేయర్ పదవిని చేపడితే.. మొదట నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, పట్టణంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని, కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపింది. బీజేపీ గెలుపొందితే నిజామాబాద్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment