nizamabad corporation
-
రసవత్తరం.. అక్కడ కమలం, కారు ఢీ..!
సాక్షి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ స్పష్టమైన గెలుపునందుకుని పరుగులు పెడుతుండగా.. నిజామాబాద్‌లో మరోసారి కమలం వికసించింది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు గాను బీజేపీ అభ్యర్థులు 28 చోట్ల విజయం సాధించారు. అయితే, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ తప్పలేదు. ఎంఐఎం 16, టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ రెండు, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. కాంగ్రెస్, స్వతంత్రులతో కలిసి బీజేపీ, ఎంఐఎం, ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి టీఆర్ఎస్ మేయర్ పదవిని సొంతం చేసుకుంటామని ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. రాజకీయం రసవత్తరంగా మారడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించాయి. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందిన సంగతి తెలిసిందే. మేయర్ స్థానాన్ని ఆశించారు.. కానీ, కౌటింగ్ ప్రక్రియ మొదలవగానే ముందంజలో ఉన్న టీఆర్ఎస్ క్రమంగా వెనుకబడింది. టీఆర్ఎస్ గెలుస్తుందనుకున్న చివరి నాలుగు స్థానాలను అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ నుంచి మేయర్ స్థానాన్ని ఆశించిన అభ్యర్థులు భంగపడ్డారు. టీఆర్ఎస్ నేత, తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత కూడా ఓటమిపాలయ్యారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయీం ఓడిపోయారు. -
బీజేపీ గెలుపొందితే.. పేరు మార్చేస్తాం!
సాక్షి, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం విడుదల చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్లో గెలుపొంది.. మేయర్ పదవిని చేపడితే.. మొదట నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, పట్టణంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని, కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపింది. బీజేపీ గెలుపొందితే నిజామాబాద్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. -
డివిజన్ల పునర్విభజనపై ఆగ్రహం
చంద్రశేఖర్‌కాలనీ: నిజామాబాద్ నగర పాలక సంస్థ(మున్సిపల్ కార్పొరేషన్)లో డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులతోపాటు అఖిలపక్ష నాయకులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం నగర పాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ డి. జాన్ సాంసన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. డివిజన్ల పునర్విభజన శాస్త్రీయ పద్ధతిలో జరపలేదని, కార్యాలయాల్లో కూర్చొని, పాత బ్లాక్ లిస్టులు, పాత డివిజన్లు, పాత ఓటరు లిస్టుల ఆధారంగా గజిబిజిగా, గందరగోళంగా, ఓటర్లంతా అయోమయానికి గురయ్యేవిధంగా డివిజన్ల పునర్విభజన జరిగిందని వారు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరెక్ట్‌గా డివిజన్ల పునర్విభజన చేసి ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచాలని, పోలింగ్ స్టేషన్ల వద్ద ల్యాబ్‌ట్యాప్‌లు, పోలింగ్ సరళిని లైవ్ కాస్ట్ చేయాలని బీజేపీ నాయకుడు స్వామి సూచించారు. ఓట్లు గల్లంతయ్యాని పలువురు ఆరోపించారు. సలహాలివ్వండి డివిజన్ల పనర్విభజన శాస్త్రీయ పద్ధతిలోనే చేశామని కమిషనర్ డి. జాన్ సాంసన్ ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులకు స్పష్టం చేశారు. కొన్ని డివిజన్లలో ఏరియాలు తారుమారు కావడం, ఓటరు లిస్టులలో పేర్లు మరో డివిజన్లలో నమోదు కావడం, ఇతరత్రా అభ్యంతరాలను నేడు, రేపు(12)న కార్పొరేషన్లో ఫిర్యాదులు చేస్తే సరిచేస్తామని సమాధానం ఇచ్చారు. గతంలో బూత్ లెవల్ ఏజెంట్లు ఇవ్వాలని అన్ని పార్టీల అధ్యక్షులను కోరినా ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఫర్ఫెక్ట్ ఓటరు లిస్టు కావాలంటే సహకరించాలని ఆయన కోరారు. 75 శాతం వరకు అభ్యంతరాలను పరిష్కరించామని, మిగితా 25 శాతం కూడా దరఖాస్తులు ఉదయమే ఇస్తే సరిచేస్తామని కమిషనర్ నచ్చజెప్పారు. -
ఎవరి జెండా ఎగురునో!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక సంస్థల్లో సారథులు కొలువుదీరే వేళ ఆసన్నమైంది. పురపాలకులకు నేడే పట్టాభిషేకం జరగనుంది. ము న్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు వరుసగా గురు, శుక్ర, శనివారాల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇటు నాయకులు, అటు అధికారు లు బిజీబిజీగా ఉన్నారు. జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూరు, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో గురువారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల క్యాంపు రాజకీయాలకు తెరపడనుంది. 4న మండల పరిష త్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 5న జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఇంకా క్యాంపుల్లోనే కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెల కొనడంతో ఆయా పార్టీల నాయకులు బుధవారం రాత్రే నిజామాబాద్‌కు చేరుకున్నారు. గురువారం జరిగే కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల ఎన్నికలపై వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. మూడు రోజుల పాటు జరిగే వరుస ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖ జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వ్యూహప్రతివ్యూహాలు పరోక్ష ఎన్నికల్లో తమదే విజయం కావాలని ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. చివరి నిమిషం వరకు సర్వశక్తులొడ్డేందుకు.. తమ అస్త్రశస్త్రాలన్నీ సంధించేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు గురువారంతో ఎన్నికలు ముగియనుండగా.. శుక్ర, శనివారాల్లో జరిగే ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికలను టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. జడ్పీ చైర్మన్ పీఠం ఇప్పటికే టీఆర్ఎస్ కైవసం కాగా.. అత్యధిక ఎంపీపీ స్థానాలను సాధించుకునేందుకు ఇరుపార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో జిల్లాలో పరోక్ష పోరు రసవత్తరంగా మారనుంది. ఇంతకాలం బుజ్జగింపులు, సమీకరణలు, వ్యూహప్రతివ్యూహాలు, చేరికలపై దృష్టి సారించిన ఈ పార్టీల నేతలు బుధవారం నుంచి మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మకాం వేసి రాజకీయాలు నడిపిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌కు చేరుకున్నారు. ‘గీత’ దాటొద్దు మున్సిపల్, పరిషత్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు విప్ జారీ చేశాయి. నిజామాబాద్ మేయర్‌తో పాటు ఆర్మూరు, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీ పీఠాలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయా పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ, ఎంఐఎంల మద్దతు లేకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీల్లో గట్టెక్కే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ, ఎంఐఎంలు సైతం తమ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు బుధవారం సాయంత్రం విప్ జారీ చేశాయి. నిజామాబాద్‌లో అందుబాటులో లేని కొందరు కార్పోరేటర్ల ఇళ్లకు ‘విప్’ పత్రాలను అంటించారు. పరోక్ష ఎన్నికల షెడ్యూల్ ఇలా మున్సిపల్, పరిషత్ పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 3, 4, 5 తేదీలలో వరుసగా జరిగే ఈ ఎన్నికల కోసం ప్రత్యేక అధికారులను కూడా నియమించనున్నారు. గురువారం నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఆర్మూరు, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. అన్నిచోట్లా ఉదయం 11గంటలకు ఆయా పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు హాజరై ఎన్నుకోవాల్సి ఉంటుంది. పాలకవర్గం ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం అదేరోజు మొదటి కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తారు. శుక్రవారం జిల్లాలోని 36 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుంది. అంతకంటే ముందు మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణల అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ప్రకటిస్తారు. 3 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. అనంతరం మొదటి సర్వసభ్య సమావేశం ఉంటుంది. శనివారం జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది. ఒక్కరోజు ముందుగా ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రకటన, సమావేశం ఉంటుంది. 5న ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం మూడుగంటల తర్వాత జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరుగుతుంది. అనంతరం జిల్లా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. -
వేడెక్కిన బల్దియా
కార్పొరేషన్, మున్సిపాలిటీల పరోక్ష ఎన్నికలకు రెండురోజులే గడువు ఉంది. బల్దియాల్లో బలప్రదర్శన చాటుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే క్యాంపులకు తెరదీశాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సిపాలి టీల కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఐదురోజుల నుంచి క్యాంపుల్లోనే ఉంటున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలి చిన వారిలో సైతం కొందరు టీఆర్ఎస్.. మరికొందరు కాంగ్రెస్ శిబిరాల్లో కొనసాగుతున్నారు. కాస్తోకూస్తో బలమున్న ఇతర పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు టీ ఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతున్నా యి. నిజామాబాద్ కార్పొరేషన్లో కీలకంగా మారిన ఎంఐఎం కార్పొరేటర్ల మద్దతు కోసం ఇరు పార్టీలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. వీరిలో ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తుందనే విషయమై తేలడం లేదు. కార్పొరేషన్లో ఎక్స్అఫీషియోలుగా ఓటింగ్‌లో పాల్గొనేందుకు కాం గ్రెస్ ఎమ్మెల్సీలు డి.శ్రీనివాస్, డి.రాజేశ్వర్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా తమ ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌గౌడ్, అరికెల నర్సారెడ్డి మాత్రం తమ ఓటుహక్కును నమోదు చేసుకోలేదు. మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్ నిజామాబాద్ కార్పొరేషన్లో పాగా వేసేందుకు ఎం ఐఎం ఎవరితో కలిసి నడుస్తుందనే సస్పెన్స్‌కు ఇంకా తెరపడలేదు. ఇక్కడ కాంగ్రెస్‌కు 16, ఎంఐఎంకు 16, టీఆర్ఎస్కు 10, బీజేపీ 6డివిజన్లు దక్కగా, రెండుచోట్ల స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతిస్తే ఆ రెండు పార్టీల కార్పొరేటర్ల సంఖ్య 26కు చేరనుంది. టీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఓటుతో మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. ఈ దిశగానే టీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక 16 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ ఇద్దరు స్వతంత్రులను కలుపుకుని 18 మందితో క్యాంపు వేసింది. బీజేపీకి చెందిన ఆరుగురి మద్దతునూ కూడగడితే.. ఎమ్మెల్సీలు డి.శ్రీనివాస్, రాజేశ్వర్ ఓట్లను కలిపితే కాంగ్రెస్ బలం 26కు చేరుతుంది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్-టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. పెద్దమొత్తంలో డబ్బులు ఎర వేసి కార్పొరేటర్లను లాగేందుకు పోటీపడుతుండటంతో మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ నుంచి 47వ డివిజన్ కార్పొరేటర్ కాపర్తి సుజాత పేరు ఖరారు కాగా, టీఆర్ఎస్ నుంచి 49వ డివిజన్‌కు చెందిన వైశాలినిరెడ్డి, 7వ డివిజన్‌కు చెందిన సూదంలక్ష్మీల పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయి. కామారెడ్డి కాంగ్రెస్‌కే కామారెడ్డ్డి మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 17, టీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఎంఐఎం, సీపీఎం, ఇండిపెండెంట్ ఒక్కొక్క స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఉండటంతో మున్సిపల్ చైర్మన్‌గా చాట్ల లక్ష్మి ఎన్నికయ్యే అవకాశం ఉంది. వైస్‌చైర్మన్ పదవికి కాంగ్రెస్‌కే చెందిన నిమ్మ దామోదర్‌రెడ్డి, కైలాస్ లక్ష్మణ్‌రావు పోటీ పడుతున్నారు. కిడ్నాప్లతో ఆర్మూర్‌లో ఉద్రిక్తత కౌన్సిలర్ల కిడ్నాప్లతో ఆర్మూరు మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. టీఆర్ ఎస్‌కు చెందిన కౌన్సిలర్ సుంకరి రంగన్నను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీఆర్ఎస్ నాయకులు శంకర్‌ను వెదికే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్(చిన్నా)తో పాటు పలువురు మాజీ నక్సల్స్‌పై కేసులు పెట్టారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 11 స్థానాలను కాంగ్రెస్, పది స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి. బీజేపీ, టీడీపీలు చెరొక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. చైర్మన్ పీఠం మహిళకు రిజర్వు అయింది. టీఆర్ఎస్ నుంచి కశ్యప్ స్వాతిసింగ్ బబ్లు, కాంగ్రెస్ నుంచి శ్రీదేవిశ్రీనివాస్ పోటీ పడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఎక్స్ అఫిషియో మెంబర్లుగా సమ్మతం తెలుపడంతో టీఆర్ఎస్ బలం పెరిగింది. కీలకంగా మారిన బీజేపీ, టీడీపీ కౌన్సిలర్ల మద్దతుతో పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఇరు పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. 20వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సుంకరి రంగన్నను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేయడం వివాదాస్పదమైంది. బోధన్‌లో ఎంఐఎం కీలకం బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 35వార్డులున్నాయి. చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ లేదు. కాంగ్రెస్ 15, టీఆర్ఎస్ 9, ఎంఐఎం 7, బీజేపీ 3, టీడీపీ 1 వార్డులో గెలుపొందాయి. చైర్మన్ పదవికి 18మంది కౌన్సిలర్ల సంఖ్య అవసరం. ఇక్కడ ఎంఐఎం కీలకంగా మారింది. మున్సిపాలిటీలపై తమ జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్లు హోరాహోరీగా పోటీ పడుతుండటం జిల్లాలో బల్దియా రాజకీయం రసవత్తరంగా మారింది. -
నిరాశే మిగిలింది
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : నిజామాబాద్ కార్పొరేషన్ ఈ దఫా కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. మేయ ర్ పీఠాన్ని రెండవ సారి దక్కిం చుకునేందుకు ఆ పార్టీ వుహ్యరచన చేసింది. వారం రోజుల క్రి తం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల అభ్యర్థులను మహారాష్ట్రకు తీసుకువెళ్లారు. కార్పొరేషన్ ఎన్నిక ల్లో ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో జతకడితే మేయరు స్థానాన్ని కైవసం చేసుకుంటుదని అంతా భావించారు. కాని గత సోమవారం హై దరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు ఖరారు కావటంతో మున్సిపల్ కార్పొరేషన్లో పరిస్థితులు చిన్నాభిన్నమైనవి. ఎంఐఎం పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీతో సమానంగా 16 సీట్లు వచ్చాయి. దాంతో ఎంఐ ఎం నిజామాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కి మద్దతు తెలిపి పొ త్తులో భాగంగా బోధన్ చైర్మన్ పదవి ఎంఐఎం తీసుకోనుంది. మారిన ఈ సమీకరణాల తో మొదటినుంచి నిజామాబాద్ మే యర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీయే కైవ సం చేసుకుంటుందనుకు న్న ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. మున్సిపల్ ఎ న్నికల ఫలితాలు వెలువడిన మరుక్ష ణం నుంచే మేయర్ స్థా నాన్ని దక్కిం చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వి దాలుగా ఆలోచన చేసినప్పటికి ఫలి తం లేకుండాపోయింది. టీఆర్ఎస్ త మకే మద్దతు ఇస్తుందనుకున్న ఆ పా ర్టీకి టీఆర్ఎస్ షాక్ ఇ చ్చింది. టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో మహారాష్ట్రలో మేయర్ అభ్యర్థి కాపర్తి సుజాత ఆధ్వర్యంలో విహారయాత్రకు వెళ్లిన వా రిని తక్షణమే నిజామాబాద్‌కు రావాల్సిందిగా పార్టీనుంచి ఆదేశాలు వెళ్లటంతో కార్పొరేటర్లు మంగళవారం తెల్లవారుజామున నిజామాబాద్‌కు చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవిని దక్కించుకునేందు కు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో పార్టీ నాయకు లు, కార్యకర్తలు డీలా పడిపోయారు. నగరంలో 2004లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచింది. అనంత రం 2005లో కార్పొరేషన్ ఎన్నికల్లో 31 స్థానాలు గెలుచుకుని మేయర్ ప దవిని కైవసం చేసుకుంది. ఇలా 200 4 నుంచి 2010 వరకు నగరంలో కాం గ్రెస్ పార్టీ తన అధిపత్యాన్ని కొనసాగించింది. ఇప్పుడు నగరంలో కాంగ్రె స్ పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్తుం దోనని ప్రజలు అసక్తిగా చూస్తున్నారు. -
నేడే మున్సిపోల్స్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు జరిగే పోలింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం నిర్ణయమై పోతుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడగా, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించుకునేందుకు శనివారం పడరాని పాట్లు పడ్డారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో 3,91,886 మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల ద్వారా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. మొత్తం 397 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 126 సమస్యాత్మక, 119 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు.ఈ కేంద్రాలలో పోలింగ్‌పై ప్రత్యేక నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,183 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది శనివారం సాయంత్రమే పోలింగు కేంద్రాలకు చేరుకున్నారు. జోరుగా సాగిన ప్రచారం పన్నెండు రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం సాగింది. అఖరిరోజు అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరులలో ఆయా పార్టీల సీనియర్లు, ప్రముఖులు మకాం వేసి మెజార్టీ సభ్యుల గెలుపే లక్ష్యంగా మంత్రాంగం నిర్వహించారు. కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలకు మొత్తం 1,056 మంది వివిధ పార్టీల లనుంచి బరిలో నిలి చారు. నిజామాబాద్‌లో 50 డివిజన్లకు 414 మంది పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో 33 వార్డులకు 184 మంది,ఆర్మూరులో 23 వార్డులకు 141 మంది, బోధన్‌లో 35 వార్డులకు 317 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడ ం కోసం నేతలు భారీగా ప్రచారం చేసినప్పటికీ గెలుపు ఓటములపై ఖచ్చితమైన అంచనాలకు రాలేకపోతున్నారు. బయటకు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకమే ‘మున్సిపల్’ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు మహ్మద్ షబ్బీర్‌అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి తదితర సీని యర్ నేతలు ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఆర్మూర్‌లో పార్టీ ఇన్చార్జి ఎ.జీవన్‌రెడ్డి, అన్ని మున్సిపాలిటీలలో తెలంగాణ జాగృ తి అధ్యక్షురాలు కె.కవితప్రచారం చేశారు. వైఎస్ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకులు నాయుడు ప్రకాశ్, జిల్లా నాయకులు అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సింగిరెడ్డి రవీందర్ రెడ్డితోపాటు పలువురు నాయకులు కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ, జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్ తదిరులు ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ కార్పొరేషన్ ప్రచార బాధ్యతలను మీదేసుకున్నారు. -
ముచ్చెమటలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈ నెల 30న జరిగే ఎన్నికలకు నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలకు 10 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కా నుంది. కార్పొరేషన్లో 13న, మూడు మున్సిపాలి టీల్లో 14న నామినేషన్ల ఘట్టం ముగియనుండగా.. డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పా ర్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీ పీ, వైఎస్ఆర్ సీపీ, బీజేపీ, ఎంఐఎంలతో పాటు సీపీ ఐ, సీపీఎంలు మున్సిపల్ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. కాగా నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరుండగా... ఆయా పార్టీ ల్లో ఉన్న ముఖ్య నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మ కం కానున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ ఈసారి కూడా నిజామాబాద్ కార్పొరేషన్‌ను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఓటమి చెందిన ఆయన మున్సిపాలిటీ నుంచి నగర పాలక సంస్థగా మారిన నేపథ్యంలో తొలి మేయర్‌గా ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్‌ను ఆ పీ ఠంపై కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. అయితే ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు చేయడంతో ఎవరిని బరిలో నిలపాలనేది డీఎస్ కోటరీలో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపికకు వేసిన కమిటీ ఏం తేల్చనుందో రెండు, మూడు రోజుల్లో తేలనుంది. కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీకి కూడ ప్రతిష్టాత్మకమే. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చవిచూడనున్నారోనన్న చర్చ ఇప్పటికే మొదలైంది. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి (ప్రస్తుతం టీఆర్ఎస్) గంప గోవర్ధన్‌పై 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన షబ్బీర్ ఏడాది క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీకి దిగే ఈయనకు 63,657 ఓట్లున్న కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు కీలకమే. అర్మూరు నియోజకవర్గంలో ఓటమి పాలైన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డికి ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికలు కీలకమే. గత ఎన్నికల్లో కాంగ్రె స్ నుంచి గెలిచిన కంచెట్టి గంగాధర్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ వెంట పార్టీలో ఉన్నారు. ఈసారి సైతం ఆయన భార్యను బరిలో దింపే యోచనలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులకు గడ్డుకాలమేనన్న చర్చ ఉంది. కాంగ్రెస్, బీజేపీలతో టీఆర్ఎస్, టీడీపీలు పొత్తు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని చర్చలు సాగుతున్న తరుణంలో ఆయా పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో దీటైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాల సమాచారం. అన్నపూర్ణమ్మ, గంప, యెండలలకు.. నిజామాబాద్ అర్బన్ నియోకవర్గం నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ కు నగరపాలక సంస్థ ఎన్నికలు కీలకం కానున్నాయి. పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌పై వరుస విజ యాలు పొందిన లక్ష్మీనారాయణ నగరపాలక సంస్థపై పట్టు సాధించలేకపోయారు. వచ్చే నెల లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ని జామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు తీవ్ర ప్ర భావం చూపే అవకాశం ఉండగా లక్ష్మీనారాయ ణ వ్యూహం ఏమిటనే చర్చ ఉంది. కామారెడ్డి లో 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన గం ప గోవర్ధన్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉ న్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఇంతకు ముందు చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన కైలాస్ శ్రీనివాస్‌రావు వ్యవహరించారు. అయితే అసెం బ్లీ ఎన్నికలకు ముందుగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఈ మున్సిపాలిటీలో గెలుపు ఓట ములు ఎమ్మెల్యే ఎన్నికలపై ప్రభావం చూపనుండగా... టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు సైతం మున్సిపల్ ఎన్నికల దడ మొదలైంది. ఆర్మూరు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత ఏలేటి అన్నపూర్ణమ్మకు ఆర్మూరు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సుమారుగా ఈ నియోజకవర్గంలో 1.42 లక్షల ఓట్లుంటే... ఆర్మూరు మున్సిపాలిటీలోనే 34,666 ఓట్లున్నాయి. శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై గెలుపొందిన అన్నపూర్ణమ్మ.. ఈసారి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నా, ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికలు ఆమెకే కీలకం కానున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో ఒక నెల ముందుగానే కార్పొరేషన్, మున్సిపాలిటీలకు పోరు జరగడం రాజకీయ పార్టీల్లో సర్వత్రా చర్చనీయాంగా మారింది. ముఖ్యనేతల్లో మున్సిపల్ ఎన్నికల దడ మొదలైంది.