సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు జరిగే పోలింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం నిర్ణయమై పోతుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడగా, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించుకునేందుకు శనివారం పడరాని పాట్లు పడ్డారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో 3,91,886 మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల ద్వారా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. మొత్తం 397 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 126 సమస్యాత్మక, 119 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు.ఈ కేంద్రాలలో పోలింగ్‌పై ప్రత్యేక నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,183 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది శనివారం సాయంత్రమే పోలింగు కేంద్రాలకు చేరుకున్నారు.
జోరుగా సాగిన ప్రచారం
పన్నెండు రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం సాగింది. అఖరిరోజు అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరులలో ఆయా పార్టీల సీనియర్లు, ప్రముఖులు మకాం వేసి మెజార్టీ సభ్యుల గెలుపే లక్ష్యంగా మంత్రాంగం నిర్వహించారు. కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలకు మొత్తం 1,056 మంది వివిధ పార్టీల లనుంచి బరిలో నిలి చారు.
నిజామాబాద్‌లో 50 డివిజన్లకు 414 మంది పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో 33 వార్డులకు 184 మంది,ఆర్మూరులో 23 వార్డులకు 141 మంది, బోధన్‌లో 35 వార్డులకు 317 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడ ం కోసం నేతలు భారీగా ప్రచారం చేసినప్పటికీ గెలుపు ఓటములపై ఖచ్చితమైన అంచనాలకు రాలేకపోతున్నారు. బయటకు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకమే
‘మున్సిపల్’ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు మహ్మద్ షబ్బీర్‌అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి తదితర సీని యర్ నేతలు ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ నుంచి నిజామాబాద్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఆర్మూర్‌లో పార్టీ ఇన్‌చార్జి ఎ.జీవన్‌రెడ్డి, అన్ని మున్సిపాలిటీలలో తెలంగాణ జాగృ తి అధ్యక్షురాలు కె.కవితప్రచారం చేశారు.
వైఎస్‌ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకులు నాయుడు ప్రకాశ్, జిల్లా నాయకులు అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సింగిరెడ్డి రవీందర్ రెడ్డితోపాటు పలువురు నాయకులు కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్‌రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ, జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్ తదిరులు ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ కార్పొరేషన్ ప్రచార బాధ్యతలను మీదేసుకున్నారు.
నేడే మున్సిపోల్స్
Published Sun, Mar 30 2014 2:29 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement