సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈ నెల 30న జరిగే ఎన్నికలకు నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలకు 10 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కా నుంది. కార్పొరేషన్‌లో 13న, మూడు మున్సిపాలి టీల్లో 14న నామినేషన్ల ఘట్టం ముగియనుండగా.. డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పా ర్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీ పీ, వైఎస్‌ఆర్ సీపీ, బీజేపీ, ఎంఐఎంలతో పాటు సీపీ ఐ, సీపీఎంలు మున్సిపల్ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. కాగా నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరుండగా... ఆయా పార్టీ ల్లో ఉన్న ముఖ్య నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మ కం కానున్నాయి.
నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ ఈసారి కూడా నిజామాబాద్ కార్పొరేషన్‌ను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఓటమి చెందిన ఆయన మున్సిపాలిటీ నుంచి నగర పాలక సంస్థగా మారిన నేపథ్యంలో తొలి మేయర్‌గా ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్‌ను ఆ పీ ఠంపై కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. అయితే ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు చేయడంతో ఎవరిని బరిలో నిలపాలనేది డీఎస్ కోటరీలో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపికకు వేసిన కమిటీ ఏం తేల్చనుందో రెండు, మూడు రోజుల్లో తేలనుంది.
కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీకి కూడ ప్రతిష్టాత్మకమే. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చవిచూడనున్నారోనన్న చర్చ ఇప్పటికే మొదలైంది. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి (ప్రస్తుతం టీఆర్‌ఎస్) గంప గోవర్ధన్‌పై 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన షబ్బీర్ ఏడాది క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీకి దిగే ఈయనకు 63,657 ఓట్లున్న కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు కీలకమే. అర్మూరు నియోజకవర్గంలో ఓటమి పాలైన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డికి ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికలు కీలకమే.
గత ఎన్నికల్లో కాంగ్రె స్ నుంచి గెలిచిన కంచెట్టి గంగాధర్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ వెంట పార్టీలో ఉన్నారు. ఈసారి సైతం ఆయన భార్యను బరిలో దింపే యోచనలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులకు గడ్డుకాలమేనన్న చర్చ ఉంది. కాంగ్రెస్, బీజేపీలతో టీఆర్‌ఎస్, టీడీపీలు పొత్తు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని చర్చలు సాగుతున్న తరుణంలో ఆయా పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో దీటైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాల సమాచారం.
అన్నపూర్ణమ్మ, గంప, యెండలలకు..
నిజామాబాద్ అర్బన్ నియోకవర్గం నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ కు నగరపాలక సంస్థ ఎన్నికలు కీలకం కానున్నాయి. పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌పై వరుస విజ యాలు పొందిన లక్ష్మీనారాయణ నగరపాలక సంస్థపై పట్టు సాధించలేకపోయారు. వచ్చే నెల లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ని జామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు తీవ్ర ప్ర భావం చూపే అవకాశం ఉండగా లక్ష్మీనారాయ ణ వ్యూహం ఏమిటనే చర్చ ఉంది. కామారెడ్డి లో 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన గం ప గోవర్ధన్ ప్రస్తుతం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉ న్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో ఇంతకు ముందు చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన కైలాస్ శ్రీనివాస్‌రావు వ్యవహరించారు. అయితే అసెం బ్లీ ఎన్నికలకు ముందుగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఈ మున్సిపాలిటీలో గెలుపు ఓట ములు ఎమ్మెల్యే ఎన్నికలపై ప్రభావం చూపనుండగా... టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు సైతం మున్సిపల్ ఎన్నికల దడ మొదలైంది. ఆర్మూరు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత ఏలేటి అన్నపూర్ణమ్మకు ఆర్మూరు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సుమారుగా ఈ నియోజకవర్గంలో 1.42 లక్షల ఓట్లుంటే... ఆర్మూరు మున్సిపాలిటీలోనే 34,666 ఓట్లున్నాయి.
శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై గెలుపొందిన అన్నపూర్ణమ్మ.. ఈసారి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నా, ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికలు ఆమెకే కీలకం కానున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో ఒక నెల ముందుగానే కార్పొరేషన్, మున్సిపాలిటీలకు పోరు జరగడం రాజకీయ పార్టీల్లో సర్వత్రా చర్చనీయాంగా మారింది. ముఖ్యనేతల్లో మున్సిపల్ ఎన్నికల దడ మొదలైంది.
ముచ్చెమటలు
Published Sat, Mar 8 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement