podduturi sudarshan reddy
-
‘ప్రాణహిత’ డిజైన్ మారిస్తే ఊర్కోం!
♦ అది అంబేద్కర్ పేరిట పెట్టిన తెలంగాణ కలల ప్రాజెక్టు ♦ పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానా, భట్టి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ హయాంలో మేధావులైన ఇంజనీర్లతో డిజైన్ చేయించి.. సాంకేతిక లోపాలు లేకుండా రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్‌ను మారిస్తే ఊర్కోమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును విరమించుకోవడంతో పాటు నిజామాబాద్ జిల్లాలో 70 శాతం వరకు పూర్తయిన 20, 21, 22 ప్యాకేజీ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా బినోల నుంచి నవీపేట వరకు 14 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నవీపేటలో నిర్వహించిన సభలో ఉత్తమ్ మాట్లాడారు. రాష్ర్టంలో జరిగిన రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ సర్కారే బాధ్యత వహించాలని, ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్లే ఆత్మహత్యలు జరిగాయని జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక సైతం తప్పుబట్టిం దని గుర్తు చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసే వరకు ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. నాడు జాతీయ హోదా కావాలని పట్టుబడినవారు నేడు ఆ డిజైన్ బాగాలేదనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. రుణమాఫీ.. నవ్వులపాలు: భట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని నవ్వులపాలు చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. 25 శాతం చొప్పున ఐదేళ్లపాటు ఇలా రుణమాఫీని సాగదీస్తే కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయి.. అసలు అలాగే మిగులుతుందని అంకెలతో సహా వివరించారు. రుణమాఫీ పత్రాలను రైతులకు ఇస్తున్నామని సంబంధిత శాఖమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమ న్నారు. పత్రాలను అందిస్తామని బ్యాంకర్లతో చెప్పించాలని డిమాండ్ చేశారు. కొత్త హామీలతో సర్కార్ మోసం: జానా అమాయక ఓటర్లను మోస పూరిత హామీలతో ఆకట్టుకుని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిం దని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి విమర్శించారు.బోధన్‌లోని ఎన్‌ఎస్‌ఎఫ్‌ని ప్రభుత్వపరం చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, చెరకు రైతుల రూ.28 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియా, శాసనసభ కాంగ్రెస్ పక్ష ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్, మాజీ ఎంపీ మధుయాష్కీ, రాష్ట్ర యువజన కాంగ్రస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ సత్తా చాటింది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం స్థానాలను కైవసం చేసుకుంది. పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (పీఎస్ఆర్) ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాలలో జడ్పీ టీసీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పదిలమయ్యాయి. ఎంపీటీసీ స్థానాలలోనూ వారికి ఆధిక్యం లభించింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం పరిధి లోని మొత్తం నాలుగింటిలో రెండు జడ్పీటీసీ స్థానాలు, మెజార్టీగా 33 ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధ న్కు మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ‘స్థానిక’ంలో ఎదురుదెబ్బ తగిలింది. కాగా బాల్కొండ నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీ స్థానాలకు గాను నాలిగింట టీఆర్ఎస్ గెలవగా ఒక్కటే కాంగ్రెస్‌కు దక్కింది. ఆర్మూరు నియోజకవర్గంలో మూ డు జడ్పీటీసీ స్థానాల్లో రెండు టీఆర్ఎస్ కు దక్కాయి. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మా జీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిలకు జడ్పీటీసీల్లో ఆధిక్యం ద క్కలేదు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఖాతా తెరవకుం డా పూర్తిగా పతనమై పోయిన తెలుగుదేశం పా ర్టీ ఎంపీటీసీ సభ్యుల విషయంలోను బీజేపీ కం టె వెనుకబడి పోయింది. మున్సిపల్, ‘పరిషత్’ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికిని కోల్పోయింది. క్షణక్షణం టెన్షన్ రెండు విడతలలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు మంగళవారం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. 36 జడ్పీటీసీ, 570 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీలలో రెండు విడతలలో ఎన్నికలు జరిగాయి. 36 జడ్పీటీసీలకు 195 మంది, 570 ఎంపీటీసీ స్థానాలకు 2,819 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, గ్రామీణ ప్రాంతాలలోని మొత్తం 14,15,153 మంది ఓటర్లకు గాను 10,87,821 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ధర్పల్లి మండలం మై లార ం, పిట్లం మండలం బండపల్లి ఎంపీటీసీలకు 18న రీ-పోలింగ్ జరగనుంది. కాగా నిజామాబాద్, బోధన్, కామారెడ్డి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. 24 జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్, 12 జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్నాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు 20, టీఆర్ఎస్కు 4, టీడీపీకి 12 జడ్పీటీసీ స్థానాలు దక్కగా, ఈ సారి టీడీపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలా ఉన్న ఇందూరు జిల్లాలో బీటలు బారాయి. కాగా 581 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్ఎస్ 240, కాంగ్రెస్ 225 దక్కించుకున్నాయి. బీజేపీ 34, టీడీపీ 31, ఎంఐఎంకు రెండురాగా, 49 స్థానాల్లో స్వతంత్రులు, ఇతరులు గెలుపొందారు. ఎంపీటీసీ ఎన్నికల్లోను టీడీపీకి బీజేపీ కంటే మూడు స్థానాలు తక్కువ వచ్చాయి. -
జోరుగా బెట్టింగ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అయితే నిజామాబాద్ లోక్‌సభతోపాటు నిజామాబాద్ రూరల్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత, బీజేపీ మాజీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి తదితరులు బరిలో ఉండడంతో పోరు రసవత్తరంగా సాగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు ఆయా అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం కావడంతో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. హోరాహోరీగా సాగిన పోరులో గెలుపుపై అందరూ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశంగా కాగా.. నాలుగు స్థానాల్లో మా నేతలే గెలుస్తారంటూ వారి అనుచరులు భారీస్థాయిలో పందాలు కాస్తుండడం గమనార్హం. స్థాయిని బట్టి రూ. 5 వేల నుంచి రూ. 5 లక్షల వరకు పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కారు జోరు కొనసాగినట్లు తెలుస్తుండగా లోక్‌సభకు వచ్చేసరికి భిన్నంగా పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీల నుంచి కల్వకుంట్ల కవిత, మధుయాష్కీ గౌడ్, యెండల లక్ష్మీనారాయణ, సింగిరెడ్డి రవిందర్‌రెడ్డి పోటీ చేశారు. అయితే పోలింగ్ నాటికి కవిత, లక్ష్మీనారాయణల మధ్య నువ్వా, నేనా అన్న చందంగా పోటీ మారింది. నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కారు కొంత పైచేయిగా ఉందని, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీజేపీ హవా కొనసాగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో టీఆర్ఎస్ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణలో బీజేపీ గెలిచే లోక్‌సభ స్థానాల్లో నిజామాబాద్ ఒకటని ఆ పార్టీ వర్గాలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. ఇలా ఫలితాలపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమాగా ఉండడంతో వారి అనుచరులూ అంతే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు జోరుగా పందాలు కాస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసిన డి.శ్రీనివాస్ 1999, 2004లలో వరుసగా నిజామాబాద్ నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత 2009, 2010 ఉప ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆయన ఈసారి విజయమే లక్ష్యంగా నిజామాబాద్ రూరల్ నుంచి బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇదేస్థానం నుంచి బరిలో ఉండడంతో పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ కూటమి అభ్యర్థి గడ్డం ఆనందరెడ్డి సైతం చాపకింద నీరులా గట్టిపోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2009లో ఈ నియోజకవర్గంలో 77.79 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 6.70 శాతం తగ్గింది. అయితే తగ్గిన ఓట్ల శాతం ఎవరికి నష్టం చేస్తుందన్న చర్చ జరుగుతోంది. దాని ఆధారంగానే పందాలు కాస్తున్నారు. 2009లో కామారెడ్డిలో, 2010 ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో అపజయం పొందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈసారి మళ్లీ కామారెడ్డిలో బరిలో నిలిచారు. ఆయన గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీలో కీలక బాధ్యతల్లో ఉన్న ఈయనకు తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(టీఆర్ఎస్)కు మధ్య నువ్వా? నేనా? అన్న రీతిలో పోరుసాగినట్లు తెలుస్తోంది. 1999 నుంచి ఓటమెరుగని మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి మాత్రం ఎదురీదారంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు విజయావకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం బోధన్ కాగా.. ఈసారి కూడ అక్కడ కాంగ్రెస్‌కే అవకాశం ఉంది అన్న చర్చలూ సాగుతున్నాయి. వీరిద్దరే కాకుండా బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డి సైతం తనకూ విజయావకాశాలున్నాయని పేర్కొంటుండడం గమనార్హం. దీంతో ఇక్కడా అభ్యర్థుల గెలుపోటములపై భారీగానే పందాలు కాస్తున్నారు. ఈసారీ ఆర్మూరునుంచే బరిలో నిలిచిన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి ఎన్నికల్లో సర్వశక్తులొడ్డారు. ఆయన 1989 నుంచి 2004 వరకు బాల్కొండ నుంచి వరుసగా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆర్మూరుకు మారిన ఆయన 2009లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి సైతం దీటుగా ప్రచారంలో ముందుకెళ్లారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లలో టీఆర్ఎస్దే పైచేయిగా నిలిచిందన్న ప్రచారం పోలింగ్ రోజు జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఎవరికి వారే గెలుపు ధీమాతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. -
ముచ్చెమటలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈ నెల 30న జరిగే ఎన్నికలకు నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలకు 10 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కా నుంది. కార్పొరేషన్లో 13న, మూడు మున్సిపాలి టీల్లో 14న నామినేషన్ల ఘట్టం ముగియనుండగా.. డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పా ర్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీ పీ, వైఎస్ఆర్ సీపీ, బీజేపీ, ఎంఐఎంలతో పాటు సీపీ ఐ, సీపీఎంలు మున్సిపల్ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. కాగా నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరుండగా... ఆయా పార్టీ ల్లో ఉన్న ముఖ్య నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మ కం కానున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ ఈసారి కూడా నిజామాబాద్ కార్పొరేషన్‌ను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఓటమి చెందిన ఆయన మున్సిపాలిటీ నుంచి నగర పాలక సంస్థగా మారిన నేపథ్యంలో తొలి మేయర్‌గా ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్‌ను ఆ పీ ఠంపై కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. అయితే ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు చేయడంతో ఎవరిని బరిలో నిలపాలనేది డీఎస్ కోటరీలో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపికకు వేసిన కమిటీ ఏం తేల్చనుందో రెండు, మూడు రోజుల్లో తేలనుంది. కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీకి కూడ ప్రతిష్టాత్మకమే. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చవిచూడనున్నారోనన్న చర్చ ఇప్పటికే మొదలైంది. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి (ప్రస్తుతం టీఆర్ఎస్) గంప గోవర్ధన్‌పై 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన షబ్బీర్ ఏడాది క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీకి దిగే ఈయనకు 63,657 ఓట్లున్న కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు కీలకమే. అర్మూరు నియోజకవర్గంలో ఓటమి పాలైన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డికి ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికలు కీలకమే. గత ఎన్నికల్లో కాంగ్రె స్ నుంచి గెలిచిన కంచెట్టి గంగాధర్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ వెంట పార్టీలో ఉన్నారు. ఈసారి సైతం ఆయన భార్యను బరిలో దింపే యోచనలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులకు గడ్డుకాలమేనన్న చర్చ ఉంది. కాంగ్రెస్, బీజేపీలతో టీఆర్ఎస్, టీడీపీలు పొత్తు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని చర్చలు సాగుతున్న తరుణంలో ఆయా పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో దీటైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాల సమాచారం. అన్నపూర్ణమ్మ, గంప, యెండలలకు.. నిజామాబాద్ అర్బన్ నియోకవర్గం నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ కు నగరపాలక సంస్థ ఎన్నికలు కీలకం కానున్నాయి. పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌పై వరుస విజ యాలు పొందిన లక్ష్మీనారాయణ నగరపాలక సంస్థపై పట్టు సాధించలేకపోయారు. వచ్చే నెల లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ని జామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు తీవ్ర ప్ర భావం చూపే అవకాశం ఉండగా లక్ష్మీనారాయ ణ వ్యూహం ఏమిటనే చర్చ ఉంది. కామారెడ్డి లో 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన గం ప గోవర్ధన్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉ న్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఇంతకు ముందు చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన కైలాస్ శ్రీనివాస్‌రావు వ్యవహరించారు. అయితే అసెం బ్లీ ఎన్నికలకు ముందుగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఈ మున్సిపాలిటీలో గెలుపు ఓట ములు ఎమ్మెల్యే ఎన్నికలపై ప్రభావం చూపనుండగా... టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు సైతం మున్సిపల్ ఎన్నికల దడ మొదలైంది. ఆర్మూరు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత ఏలేటి అన్నపూర్ణమ్మకు ఆర్మూరు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సుమారుగా ఈ నియోజకవర్గంలో 1.42 లక్షల ఓట్లుంటే... ఆర్మూరు మున్సిపాలిటీలోనే 34,666 ఓట్లున్నాయి. శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై గెలుపొందిన అన్నపూర్ణమ్మ.. ఈసారి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నా, ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికలు ఆమెకే కీలకం కానున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో ఒక నెల ముందుగానే కార్పొరేషన్, మున్సిపాలిటీలకు పోరు జరగడం రాజకీయ పార్టీల్లో సర్వత్రా చర్చనీయాంగా మారింది. ముఖ్యనేతల్లో మున్సిపల్ ఎన్నికల దడ మొదలైంది.