nominations Start
-
రెండో దశ ఎన్నికలు: 12 రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేష్లన స్వీకరణ
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక 12 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 26న రెండోదశ పోలింగ్ జరుగుతుందని ఈసీ పేర్కొంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. రెండో దశలో అసోం, బీహార్, చత్తీస్‌గఢ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ నాలుగో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ ఐదో తేదీన జరగనుండగా, జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ ఆరో తేదీన జరుగుతుంది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించేందుకు చివరి తేదీ ఏప్రిల్ 8. ఇక, ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక రెండో దశలోనే హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోని ఔటర్ మణిపూర్ స్థానంలో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఎన్నికలు మొదటి దశలోనే పూర్తి కానుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 19న ఇన్నర్ మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. 2024 आम चुनाव के दूसरे चरण का शेड्यूल👇#Elections2024 #ChunavKaParv #DeshKaGarv #IVote4Sure #ECI pic.twitter.com/Ied0YMcgXd — Election Commission of India (@ECISVEEP) March 27, 2024 ఇక, రెండో దశలోనే బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో, అందరి దృష్టి బెంగాల్ రాజకీయాలపైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కేరళలో కూడా త్రిముఖ పోటీ ఉండనుంది. -
గాడిద సవారీతో నామినేషన్‌కు..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. కొందరు అభ్యర్థులను వినూత్న మార్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు. బుర్హాన్పూర్ నియోజకవర్గానికి ప్రియాంక్ ఠాకూర్ అనే స్వతంత్ర అభ్యర్థి గాడిదపై వచ్చి నామినేషన్ సమరి్పంచారు. ‘అన్ని రాజకీయ పార్టీలు తమ ఆశ్రితులకే టికెట్లు ఇస్తున్నాయి. ప్రజలను గాడిదలుగా, అంటే మూర్ఖులుగా తయారు చేస్తున్నాయి. అందుకే గాడిదపై సవారీ చేస్తూ వచ్చి నామినేషన్ వేయాలనుకున్నాను’ అని ఆయన అన్నారు. ఇదే సీటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ సురేంద్ర సింగ్ ఎడ్ల బండిపై మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలిపేందుకే ఇలా చేసినట్లు చెప్పుకున్నారు. సన్వేర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రీనా బొరాసి ట్రాక్టర్‌పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రైతుల సమస్యలను తెలిపేందుకే ఇలా చేశానన్నారు. రాష్ట్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి విశ్వాస్ సారంగ్ స్కూటర్‌పై వచ్చి నరేలా నియోజకవర్గానికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీ. -
హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ
సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్లు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు పోటెత్తుతున్నారు. అయితే.. వారిలో పోటీ చేసేందుకు ఉత్సాహం ఉన్నా.. సరైన విధానంలో పత్రాలు తీసుకురావడంలో విఫలమవుతున్నారు. సోమవారం ఇదే విధంగా నామినేషన్ వేసేందుకు హుజూరాబాద్ వచ్చిన పలువురు అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. నూర్జహాన్ బేగం అనే మహిళ హైదరాబాద్ నుంచి వచ్చారు. సుపరిపాలన ధ్యేయంగా తాముపోటీ చేస్తున్నామని తెలిపారు. కానీ.. ఆమెను సమర్థిస్తూ పది మంది స్థానికుల సంతకాలు కావాలని అధికారులు సూచించడంతో తీసుకువస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. చదవండి: అయ్యయ్యో.. వద్దమ్మా! డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ ►జమ్మికుంటకు చెందిన ప్రజాయుక్త పార్టీ/ఇండిపెండెంట్ సిలివేరు శ్రీకాంత్ సోమవారం రెండుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈయన నామినేషన్‌ను సాంకేతిక కారణాలతో తిప్పిపంపిన విషయం తెలిసిందే. ►మురుగు రామచంద్రు కూడా నామినేషన్ వేసేందుకు లోపలికి వెళ్లారు. కానీ.. సాంకేతిక కారణాలతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. ►ఎంఐఎం (టీఎస్) పార్టీ నుంచి తాహెర్ కమాల్ కుంద్‌మిరీ నామినేషన్ వేయడానికి వచ్చినా.. స రైన పత్రాలు లేవని అధికారులు తిప్పిపంపారు. చదవండి: కేసీఆర్ డిపాజిట్ పోవడం ఖాయం: ఈటల ► హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని అన్నారు. ఇతను దరఖాస్తు కూడా అధికారుల ఆమోదం పొందలేదు. ► నామినేషన్లు దరఖాస్తులు తీసుకుంటున్న ఆర్డీవో కార్యాలయానికి మాస్కులు లేకుండా వచ్చి కొందరు విధులకు ఆటంకం కలిగించారని ఆర్ఐ సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ►సోమవారం ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున (ఒక సెట్), సిలివేరు శ్రీకాంత్ (రెండు సెట్లు), రేకల సైదులు (రెండుసెట్లు) మొత్తం ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చదవండి: హుజూరాబాద్: పోటీకి 1,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పకడ్బందీగా నియమావళి అమలు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాశ్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హుజూరాబాద్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం, హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్‌ను కలెక్టర్ కర్ణన్‌తో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంటుందని, ఓటర్లను ప్రలోభపెట్టేలా డబ్బు, నగదు, బహుమతుల పంపిణీని నివారిస్తామన్నారు. చదవండి: Huzurabad Bypoll: రసవత్తరంగా మారిన హుజూరాబాద్ ఉపఎన్నిక నియోజకవర్గ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాలను చేస్తామన్నారు. అభ్యర్థులు పెట్టే ఖర్చుల వివరాలను ఎక్స్ పెండీచర్ బృందాలు రోజూ నమోదు చేయాలని ఆదేశించారు. ఉపఎన్నిక పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఉల్లంఘనపై ఫిర్యాదులు ఉంటే తనకు 6281552166 నెంబర్‌కు సమాచారం అందించాలని, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు తనను కరీంనగర్‌లోని ఎక్సైజ్ భవన్ అతిథి గృహంలో కలవచ్చనని ఓం ప్రకాశ్ సూచించారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
పెద్దపల్లిఅర్బన్: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులంతా రిటర్నింగ్ ఆఫీసర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు నామినేషన్లు అందిస్తారు. ఈమేరకు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగేందుకు కలెక్టరేట్ కార్యాలయ మైదానంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. నామినేషన్ పత్రాలను స్వీకరించే ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాన్ని సైతం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను అభ్యర్థుల నుంచి స్వీకరించనున్నారు. మార్చి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మూడు వాహనాలకు మాత్రమే.. నామినేషన్ స్వీకరించే కలెక్టరేట్ కార్యాలయం వద్ద అత్యంత పకడ్బందీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారికి కలెక్టరేట్ కార్యాలయం ఆనుకుని ఉంది. అటు వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల ర్యాలీలను దూరంలోనే నిలిపివేసేలా బార్డర్ గీశారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థికి చెందిన మూడు వాహనాలను మాత్రం వంద మీటర్ల దూరం వరకు అనుమతిస్తారు. అలాగే నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితో కలిపి ఐదుగురిని మాత్రమే రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. అభ్యర్థి నుంచి డిక్లరేషన్.. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి నుంచి బ్యాలెట్ పేపరుపై పేరు ఏ విధంగా ముద్రించాలో తెలిపే డిక్లరేషన్ పత్రాన్ని అధికారులు తీసుకోనున్నారు. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థిని నియోజకవర్గంలో ఓటుహక్కు కలిగిన ఒకరు ప్రతిపాదించాల్సి ఉండగా, స్వతంత్య్ర అభ్యర్థులు, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులను పదిమంది ఓటుహక్కు కలిగిన వారు ప్రతిపాదించాల్సి ఉంటుంది. డిపాజిట్ రూ.12,500 నామినేషన్ దాఖలు చేసే గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం రూ.12,500 డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసే సమయంలో ఎస్సీ కుల ధ్రువీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఈనెల 25 వరకు బీ–ఫాంను దాఖలు చేయాలి. అంతేకాకుండా అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో కచ్చితంగా నమోదు చేయాలి. గడిచిన పదేళ్లలో మున్సిపాలిటీ, పంచాయతీ, విద్యుత్ బకాయిలు లేవని సంబంధిత శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2018: ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్: ఏ రంగంలోనైనా ‘అవార్డులు’ ఇవ్వడానికి ప్రధానంగా మూడు లక్ష్యాలుంటాయి. ఒకటి, అప్పటివరకు విశేషంగా కృషి చేస్తున్న, ప్రతిభ చూపిన, సేవలందిస్తున్న వారిని గుర్తించి నలుగురికి తెలిసేలా సత్కరించడం. రెండు, సదరు అవార్డుతో బాధ్యతాయుతంగా వారా కృషి–ప్రతిభ–సేవను మరింత కొనసాగించేట్టు చేయడం. మూడు, సమాజానికి మేలయ్యేలా ఇతరులలో ఆ స్ఫూర్తి రగిలించడం! అక్షరాలా ఇది సాధించే లక్ష్యంతో గత నాలుగేళ్లుగా సాక్షి ఈ కృషిని యజ్ఞంలా నిర్వహిస్తోంది. వేర్వేరు రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న, అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న, నిస్వార్థమైన నిరతితో సేవలందిస్తున్న వారిని గుర్తిస్తోంది. ‘‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’’లతో వారిని ఘనంగా సత్కరిస్తోంది. ఏటా నగరంలో ఓ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రముఖుల సమక్షంలో వారికా అవార్డుల్ని అందజేస్తోంది. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ, సేవ, దయ.... ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికి తీస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులు న్యాయనిపుణులుగా ఏర్పాటైన ‘జ్యూరీ’ సాక్షికి లభించిన ఎంట్రీల నుంచి విజేతల్ని నిర్ణయించి ప్రకటిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో కృషి చేస్తున్న పలువురు 2014 నుంచి 2017 వరకు ఏటా ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అన్ని వయసుల వారూ ఈ విజేతల్లో ఉన్నారు. 2018కి సంబంధించిన సాక్షి అవార్డుల ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలయింది. 28 ఫిబ్రవరి, 2019 సాయంత్రం 6 గం.ల వరకు గడువు ఉండటంతో ఎంట్రీలు అందుతున్నాయి. ఎంపిక ప్రక్రియలోనూ ప్రత్యేకత! ఏమంటే..... ఎవరికి వారు సొంతంగా ఎంట్రీలు పంపుకునే పద్ధతి లేదు. విశేష ప్రతిభ, అసాధారణ నైపుణ్యం, విశిష్ట కళ, నిష్కళంక సేవ చేస్తున్న వ్యక్తులు, సంస్థల్ని గుర్తెరిగిన ఇతరులెవరైనా ఆయా వ్యక్తులు, సంస్థల తరపున సాక్షికి ఈ ఎంట్రీలు పంపవచ్చు. ఆయా ఎంట్రీలను పరిశీలించిన మీదట, అర్హమైన వాటిని నిపుణుల జ్యూరీకి సిఫారసు చేస్తారు. జ్యూరీ తుది విజేతల్ని ఎంపిక చేస్తుంది. విద్య, వైద్య, వ్యవసాయ, వాణిజ్య, సామాజిక సేవ, క్రీడా, సినిమా తదితర రంగాల్లో అసాధారణంగా రాణించే, ప్రతిభ చూపే, సేవ చేసే వ్యక్తులు, సంస్థలను ఈ అవార్డుల కోసం గుర్తిస్తారు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ కూడా లభించవచ్చు! ఇంకా, సినిమా రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన, ప్రతిభ చూపిన వారికి ‘ప్రజాదరణ’ ఆధారంగా ఎంపిక చేసి, అవార్డులిచ్చే పద్ధతీ ఉంది. ఉత్తమ ప్రజాదరణ చిత్రం, ఉత్తమ నటీనటులు, దర్శకుడు, సంగీతం – నేపథ్యగానం విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. ప్రతిభకు పట్టం కట్టడం, నైపుణ్యాల్ని ప్రశంసించడం, సేవల్ని కొనియాడటం, లక్ష్య సాధనను అభినందించడం... ఎవరమైనా చేయదగినదే! ఈ భావన కలిగిన వారంతా తమ ఎరుకలో ఉండే ఇటువంటి ప్రతిభా మూర్తుల్ని గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ ఈ అవార్డుల కోసం ఎంట్రీలు పంపుతారని సాక్షి అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీ దరఖాస్తుల కోసం www.sakshiexcellenceawards.com లాగిన్ కాగలరు. వివరాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–2332 2330 నంబరుపై సంప్రదించవచ్చు. ఈ–మెయిల్: sakshiexcellenceawards@sakshi.com. -
నామినేషన్ల హోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పల్లె పోరులో నామినేషన్లు వెల్లువెత్తాయి. ఈనెల 21న జరిగే గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలకు బుధవారం అర్ధరాత్రి వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సాగింది. సాయంత్రం 5 గంటలకే గడువు ముగిసినా ఆలోపే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి చేరుకున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణకు సమయం పట్టింది. జిల్లావ్యాప్తంగా తొలిదశలో 179 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. గ్రామ సర్పంచ్ పదవులకు 673 మంది 982 నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. అలాగే 1,580 వార్డు స్థానాలకు 3,684 మంది 4,735 నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణే కాదు.. పరిశీలనలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాత్రి పొద్దుపోయే వరకు స్క్రూట్నీ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో ఎన్ని నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఎనిమిది ఏకగ్రీవం! మొదటి దశలో ఎనిమిది గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పదవులకు సింగిల్ నామినేషనే దాఖలు కావడంతో గెలుపు లాంఛనప్రాయంగా మారింది. ఈనెల 13న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు. కొందుర్గు మండలం లక్ష్మీదేవునిపల్లి (నర్సింలు), జిల్లేడ్ చౌదరిగూడ మండలం ముష్టిపల్లి (యాదమ్మ), ఫరూఖ్‌నగర్ మండలంలోని ఉప్పరిగడ్డ తండా (రేఖాచందానాయక్), కొత్తూరు మండలం పరిధిలోని మల్లాపూర్ తండా (సభావట్ రవినాయక్), నందిగామ మండల పరిధిలోని బండోనిగూడ (జెట్ట కుమార్), కాన్హా (సరిత)సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట సర్పంచ్ స్థానానికే కవిత ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆమె విజయం ఖాయమైంది. చింతకొండపల్లి గ్రామ సర్పంచ్‌గా పార్వతమ్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెండో దశకు నేటినుంచి నామినేషన్లు ఈ నెల 25న పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీలకు శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. రెండో దశలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, మంచాల, యాచారం. కడ్తాల, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయతీలు, 1656 వార్డు స్థానాలకు శుక్రవారం నుంచి ఆదివారం వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. -
ముహూర్తానికే నామినేషన్లు వేయాలి..
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకే రోజు 30 మంది నామినేషన్లు వేశారు. బుధవారం బాగుందని అన్ని ప్రధాన పార్టీలకు చెందిన మెజార్టీ అభ్యర్థులు, స్వతంత్రులు, తిరుగుబాటుదారులు నామినేషన్లు సమర్పించారు. కొంతమంది ముహూర్తం చూసుకొని మరీ వేయడం విశేషం. నర్సంపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి ఓటరు దేవుళ్లనే నమ్ముకుని కార్యకర్తలతో కలిసివెళ్లి నామినేషన్లు వేశారు. భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ వేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 9 నామినేషన్లు.. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజక వర్గాల నుంచి మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్ పశ్చిమలో టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి నాయిని నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు వేయగా, అదే పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా రావు పద్మ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇండిపెండెంట్‌గా తిరునహరి శేషు నామినేషన్లు వేశారు. తూర్పు నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థిగా సిద్ధం రాంబాబు, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అలకాపల్లి కిశోర్, ఇండిపెండెంట్‌గా నీలం రాజ్‌కిశోర్, సండ్ర జాన్సన్, వర్ధన్నపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్‌లు తమ నామినేషన్లు దాఖలు చేశారు. పశ్చిమలోనే ఎక్కువగా నామినేషన్లు సమర్పించారు. భూపాలపల్లిలో.. భూపాలపల్లి, ములుగు రెండు నియోజకవర్గాలు కలిపి ఏడు నామినేషన్లు వచ్చాయి. భూపాలపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి, ముందుగా నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం నామినేషన్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి తరుపున మాజీ పీఏసీఎస్ చైర్మన్ గులాం అప్జల్ నామినేషన్ వేశారు. బీజేపీ తరఫున చందుపట్ల కీర్తిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆల్ ఇండియా పార్వర్డ్ పార్టీ తరఫున గండ్ర సత్యనారాయణరావు నామినేషన్ వేశారు. కొండ దేవరగట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ములుగు టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీర చందూలాల్ నామినేషన్ వేశారు. సీతక్క తరఫున ఆమె బందువులు గట్టమ్మ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి అందించారు. టీఆర్ఎస్ అసమ్మతి వర్గ నేత పొరిక గోవింద్‌నాయక్ ములుగులో తన నామినేషన్‌ను సమర్పించారు. మహబూబాబాద్ జిల్లాలో.. మానుకోట జిల్లాలో 5 నామినేషన్లు పడ్డాయి. తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తొలు త జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో, మానుకోట మండలంలోని ఈదులపూసపల్లి దర్గాలో జిల్లా కేంద్రంలోని ఏసుశక్తి చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం నామినేషన్ వేశారు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయ క్ కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మూలగుండ్ల వెంకన్న, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు బానోత్ ప్రసాద్ బలరాంనాయక్‌కు సంబంధించిన నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. స్వంతత్ర అభ్యర్థి ధర్మసోత్ నారాయణసింగ్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రలోని అంబేడ్కర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముత్యాలమ్మగుడిలో పూజలు చేసి నామినేషన్ వేశారు. డోర్నకల్ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి జాటోత్ రాంచంద్రునాయక్ కురవి దేవస్థానంలో పూజలు చేసి ఆ తర్వాత మరిపెడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వో ఈశ్వరయ్యకు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ తొలుత కురవి దేవస్థానంలో పూజలు చేసి ఆ తర్వాత ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చారు. వరంగల్ రూరల్ జిల్లాలో.. జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మూడో రోజు ఆరుగురు నామినేషన్లు వేశారు. ఈ నెల 12 నుంచి ఇప్పటివరకు మూడు నియోజకవర్గాల్లో 8 మంది నామినేషన్లు వేశారు. బుధవారం నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి, బీజేపీ నుంచి బుర్రి ఉమాశంకర్, శివసేన నుంచి పూర్ణచందర్ తోట, పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి రెండు సెట్లు, ఇండిపెండెంట్‌గా బుచ్చిరెడ్డి, వర్ధన్నపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ రెండు సెట్లు నామినేషన్లు వేశారు. చల్లా ధర్మారెడ్డి తొలుత వరంగల్‌లోని భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సంగెం మండలంలోని కుంటపల్లిలోని సంగమేశ్వరాలయం, కొమ్మల లక్ష్మీ నరసింహాస్వామి, ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లోని సమ్మక్క సారలమ్మ, పరకాలలోని కుంకుమేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి పరకాల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహేందర్‌జీకి నామినేషన్ పత్రాలను అందించారు. నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి సాదా సీదాగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.రవికి నామినేషన్ పత్రాలను అందించారు. వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ తొలుత ఐనవోలు మల్లిఖార్జున దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత రెడ్డిపాలంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నారం షరీఫ్‌లోని దర్గాలో పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ పత్రాలను అందించారు. జనగామలో.. జనగామ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉదయం తన సోదరీమణులు రూపురెడ్డి యశోదాదేవి, తవిటిరెడ్డి మనోహర పాదాలకు నమస్కారం చేసుకొని నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. యశ్వంతాపూర్‌లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పూజలు చేశారు. సీఎం కేసీఆర్, జయశంకర్ చిత్రపటాలకు దండం పెట్టుకొని నామినేçషన్ వేయడానికి బయలుదేరారు. శుభ ముహూర్తం చూసుకొని సరిగ్గా 2:30 గంటలకు ఆర్వో మధుమోహన్‌కు తన నామినేషన్ పత్రాలను అందించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ తాటికొండ రాజయ్య నామినేషన్‌కు ముందు, ఆ తర్వాత ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. కాజీపేటలోని బిష‹ప్ ఉడుముల బాల ఆశిస్సులను తీసుకున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు. తర్వాత ఘన్‌పూర్‌లో ఉన్న తల్లికి పాదాభివందనం చేశారు. ఆర్సీఎం చర్చిలో ప్రార్థనలు, ఘన్‌పూర్‌లోని బొడ్రాయి, మసీదు, శివునిపల్లిలోని బొడ్రాయి వద్ద పూజలు చేశారు. -
ముహూర్తం చూసుకొని అభ్యర్థుల నామినేషన్లు
సాక్షి, వరంగల్: అభ్యర్థుల నామినేషన్ల ముహూర్తం ఖరారైంది. వేద శాస్త్రాల ప్రకారం నేడు తిథి నక్షత్రాలు బాగున్నాయని వేద పండితులు తేల్చిచెప్పటంతో అధికార, ప్రతిపక్ష అభ్యర్థులతో పాటు స్వతంత్రులు మెజార్టీ నామినేషన్లు సమర్పించటానికి సిద్ధమయ్యారు. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 20 మంది నామినేషన్లు వేయనున్నారు. జన సమీకరణ కుదరకపోతే ముందు ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించి, తరువాత రోజుల్లో భారీ ఊరేగింపులో వెళ్లి రెండోసెట్ పత్రాలు సమర్పించేందుకు నిర్ణయించుకున్నారు. ఎవరి సెంటిమెంటు ప్రకారం వాళ్లు ముందుగా ఇష్టదైవాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేస్తుండగా మరికొంత మంది నేతలు మాత్రం కార్యకర్తలను మించిన దేవుళ్లు లేరంటూ వారి సమక్షంలోనే నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధయ్యారు. భద్రకాళి మీద భరోసా..... వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థులు అంతా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన తరువాతే నామినేషన్లు వేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్, బీజేపీ అభ్యర్థి మార్తినేని ధర్మారావు, బీజేపీ వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి నామినేషన్లు సమర్పిస్తున్న వారిలో ఉన్నారు. వీళ్లంతా స్వతహాగానే మహాశక్తి భక్తులు కావటంతో అందరూ ముందుగా భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు సమర్పించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి నామినేషన్ వేయనున్నారు. అంతకు ముందు వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఇతర ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం నామినేషన్ దాఖలు చేస్తార.బీజేపీ అభ్యర్థి మార్తినేని ధర్మారావు హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. 19న మరో సెట్ నామినేషన్ ర్యాలీగా వెళ్లి దాఖలు చేయనున్నారు. బీజేపీ నుంచి ఆశావహా అభ్యర్థి, పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ భద్రకాళి దేవస్థానానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పార్టీ నాయకులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. కార్యకర్తలే దేవుళ్లు.... కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహా అభ్యర్థి, ఆ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అందరినీ నమ్మాడు. చివరకు ఎవరూ సాయం కాలేదు. దీంతో కాస్త నిర్వేదం, ఆగ్రహంతో ఉన్న ఆయన కార్యకర్త దేవుళ్లను నమ్ముకొని నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇంటి నుంచి నేరుగా పార్టీ నాయకులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముందుగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఈ నెల 15న ర్యాలీగా వెళ్లి మరోసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గట్టమ్మ తల్లికి, లక్ష్మీనరసింహస్వామికి మొక్కి.. భూపాలపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ నుంచి సీటు, బీ పారం రాకున్నా గండ్ర వెంకటరమణారెడ్డి నామినేషన్ వేయనున్నారు. మధుసూదనాచారి రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేయనున్నారు. గండ్ర సత్యనారాయణరావు కూడా ఇక్కడే పూజలు చేసిన అనంతరం నామినేషన్ సమర్పించనున్నారు. బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత నామినేషన్ వేయనున్నారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున సీతక్క, టీఆర్ఎస్ తరుపున చందూలాల్ గట్టమ్మ దేవాలయంలో దర్శించుకున్న అనంతరం నామినేషన్ వేయనున్నారు. చందూలాల్ 1:45 గంటలకు వేయనున్నారు. కురవి వీరన్న అనుగ్రహంతో... టీఆర్ఎస్ మహబూబాబాద్ అభ్యర్థి శంకర్‌నాయక్ , డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రునాయక్ కురవి వీరభద్రున్ని దర్శించుకొని నామినేషన్లు సమర్పించనున్నారు. ఇక డోర్నకల్ టీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్ తన నియోజకవర్గంలోని ప్రతి మండల పార్టీ అధ్యక్షులను వెంటబెట్టుకొని వెళ్లి నామినేషన్ వేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందని రెడ్యానాయక్ అనుచరులు చెప్తున్నారు. అన్నిటికీ రేణుకఎల్లమ్మ తల్లే.... జనగామ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆనవాయితీగా రేణుకా ఎల్లమ్మకు దండం పెట్టుకొని నామినేషన్ వేస్తున్నారు. యశ్వంతాపూర్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆయన నేడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేణుక ఎల్లమ్మ ఆలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు చేయించిన తరువాతే సమర్పించారు. ఇంట్లో నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి 1.45 గంటలకు ఆలయానికి వెళతారు. అక్కడ నుంచి రెవెన్యూ డివిజనల్(ఆర్వో) కార్యాలయానికి చేరుకుంటారు. తనతో పాటు మరో నలుగురు నాయకులను వెంట తీసుకెళ్లి మధ్యాహ్నం 2.30 గంటలకు రెండు నామినేషన్ సెట్లను ఆర్ఓకు అందజేయనున్నారు. 17వ తేదీన జనసమీకరణతో మరో సెట్టు వేయనున్నట్లు ముత్తిరెడ్డి తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య సెంటిమెంట్ ప్రకారం మొదట స్థానిక చర్చిలో, అనంతరం ఘన్పూర్, శివునిపల్లి బొడ్రాయిల వద్ద, అనంతరం స్థానిక మజీద్‌లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ర్యాలీగా ఆర్వో కార్యాలయం(తహసీల్దార్ కార్యాలయం) వరకు వెళ్లి మధ్యాహ్నం 1.45 నుంచి 2గంటల 30 నిమిషాల మధ్యలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రాముఖ్యత ఈ రోజునే ఎందుకు? వారాధిపతి బుధుడు, సప్తమి తిథి , శ్రవణానక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు (కార్తీకమాసం) అన్నీ కలిసి వచ్చిన శుభదినం ఇది. శ్రావణ నక్షత్రం అనగా శుభకారకుడైన చంద్రుడు. చంద్రుని ఆశీర్వాదాన్ని కోరుకొని పనులు ప్రారంభించిన వారి మాటలను ఎదుటివారు అంగీకరిస్తారు. ఎదుటివారి నుంచి వచ్చే కోపావేశాలు తగ్గిపోతాయి. ఉదయం 10.43 వరకు వర్జ్యం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 12:40 గంటల వరకు ఉన్న మకరలగ్నానికి ఏకాదశస్థానంలో గురు, బుధ గ్రహాలు శుభదృష్టితో ఉంటాయి కాబట్టి ఇవి శుభ ఘడియలుగా భావిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3.30గంటల వరకు మీన లగ్నంలో గురు, బుధ గ్రహాలు తొమ్మిదో స్థానంలో ఉండడంతో పాటు మకరలగ్నంలో చంద్రుడు, కేతువు, 11వ స్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో తలపెట్టిన కార్యాలు అనుకూల విజయానికి దారితీస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఎక్కువమంది ఇవే ఘడియల్లో నామినేషన్లు వేయటానికి సిద్ధమయ్యారు. నర్సంపేటలో పెద్ది... నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి దేవుళ్ల కంటే కార్యకర్తలపట్లనే ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత నామినేషన్ వేస్తారు. వర్ధన్నపేట నుంచి అరూరి రమేష్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ వేస్తారు. -
ఆట మొదలైంది..
సాక్షి, వరంగల్ రూరల్: ఆట మొదలైంది.. నియోజకవర్గాల్లో సరికొత్త సమరం ఆరంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ముందస్తు సమరంలో అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రచారం దిశగా సిద్ధపడడం.. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి వ్యూహాలు రచించడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అభ్యర్థుల సందడి, పార్టీల హడావుడి, నేతల ప్రసంగాలు, సమావేశాలతో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. నామినేషన్ల స్వీకరణ షురూ.. ఈ నెల 12 నుంచి ఈ నెల 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఉంటుంది. డిసెంబర్ 7న ఎన్నికలు, 11న ఫలితాలు ప్రకటించనున్నారు. తొలిరోజు పరకాల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గంలో ఇండిపెండెంటెంట్‌గా వీరమల్ల రాజేష్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ముుహూర్తాలు చూసుకుంటున్న అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అయ్యగార్లను సంప్రదించి నామినేషన్ వేసే తేదీలను ఖరారు చేసుకుంటున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులకు బీ ఫాంలు అందించారు. ఈ నెల 14న పరకాల టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, వర్దన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్, భూపాలపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి, ఈ నెల 17న పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ నెల 18న నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇంకా ప్రకటించని ప్రజాకూటమి.. ఓ పక్క నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా మహాకూటమి అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. దీంతో మహాకూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. బీఎల్ఎఫ్ నర్సంపేట అభ్యర్థిగా మద్దికాయల అశోక్‌ను ఇదివరకే ప్రకటించారు. నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజా సేవకుడిగా ఉంటా.. పరకాల: 30 ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న తనపై ప్రజల్లో ఉన్న గౌరవం, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తన గెలుపునకు దోహదపడుతాయని బీజేపీ పరకాల నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్ మహేందర్‌జీకి మధ్యాహ్నం 2.16 గంటలకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. పరకాల నియోజకవర్గంలో మొదటి నామినేషన్ డాక్టర్ విజయచందర్రెడ్డితో మొదలైంది. మరో నామినేషన్ పత్రాన్ని ఆయన సతీమణి సుదేష్ణారెడ్డి దాఖలు చేసేందుకు వెళ్లగా సమయం దాటిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిరాకరించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, జిల్లా నాయకులు దేవేందర్‌రెడ్డి, ముత్యాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కానుగుల గోపీనాథ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆర్పీ జయంత్‌లాల్, మేకల రాజవీర్ పాల్గొన్నారు.ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరమల్ల రాజేశ్రెడ్డినర్సంపేట: నియోజకవర్గ మొదటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహేశ్వరం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్‌రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. -
నామినేషన్ వేసేముందు.. ఒక్కక్షణం
కామారెడ్డిటౌన్, న్యూస్‌లైన్ : బల్దియా పోరులో మరో అంకానికి తెరలేసిం ది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఆశావహులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ల సమయంలో ప్రజలు అధికంగా గుమికూడడాన్ని నిరోధించడానికి, తగిన నియంత్ర ణ ఉండడానికి ఎన్నికల కమిషన్ 2011 జూలై 01న జీఓ నెంబర్ 528/ఎస్ఈసీ-ఎఫ్1/2011-5 ను జారీ చేసింది. దాని ప్రకారం.. ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధి లోపలకు గరిష్టంగా రెండు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ల సమయంలో ఎన్నికల అధికారి, సహాయ అధికారి కార్యాలయంలోనికి అభ్యర్థితోపాటు నామినేషన్ ప్రతిపాదించేందుకు గరిష్టంగా మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. చట్ట ప్రకారం నామినేషన్ పత్రాన్ని అభ్యర్థి స్వయంగా గాని, లేక అతని ప్రతిపాదకుడు గాని ఎన్నికల అధికారి లేదా సహాయ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి హాజరు కాలేని పక్షంలో ఎన్నికల అధికారి కార్యాలయంలోనికి ప్రతిపాదకుడితోపాటు మరో ఇద్దరిని అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అభ్యర్థి వెంట ఉండే వాహనాల వ్యయాన్ని అభ్యర్థి ఎన్నికల వ్యయంలో లెక్కిస్తారు. నామినేషన్లో అందించిన వివరాలు సక్రమంగా లేకపోయినా తిరస్కరించే అధికారం అధికారులకు ఉంటుంది. ఇతర అంశాలు.. బల్దియాలో ఓటు హక్కు ఉంటే చాలు. ఆ బల్దియాలో ఏ వార్డునుంచైనా పోటీ చేయవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే నామినేషన్ పత్రాన్ని ఉచితంగా అందిస్తారు. ఒక అభ్యర్థి తరపున ఒక వార్డుకు నాలుగింటికి మించకుండా నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. {పతి నామినేషన్ పత్రంపై అభ్యర్థి, లేక ప్రతిపాదకుడి సంతకం తప్పనిసరి. పోటీకి సంసిద్ధతను తెలియజేస్తూ డిక్లరేషన్‌పై అభ్యర్థి సంతకం చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరపున లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిష్టరైన రాజకీయ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి పార్టీ పేరును నామినేషన్ పత్రంలో సూచించాల్సి ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీన మధ్యాహ్నం 3 గంటలలోపు బీఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 1,250, ఇతరులు రూ. 2,500 నామినేషన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 2,500, ఇతరులు రూ. 5 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రెవెన్యూ శాఖ డిప్యూటీ తహశీల్దార్ హోదాకు తక్కువ గాని అధికారి నుంచి డిక్లరేషన్ పత్రాన్ని నామినేషన్‌కు జతచేయాల్సి ఉంటుంది. -
ముచ్చెమటలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈ నెల 30న జరిగే ఎన్నికలకు నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలకు 10 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కా నుంది. కార్పొరేషన్లో 13న, మూడు మున్సిపాలి టీల్లో 14న నామినేషన్ల ఘట్టం ముగియనుండగా.. డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పా ర్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీ పీ, వైఎస్ఆర్ సీపీ, బీజేపీ, ఎంఐఎంలతో పాటు సీపీ ఐ, సీపీఎంలు మున్సిపల్ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. కాగా నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరుండగా... ఆయా పార్టీ ల్లో ఉన్న ముఖ్య నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మ కం కానున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ ఈసారి కూడా నిజామాబాద్ కార్పొరేషన్‌ను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఓటమి చెందిన ఆయన మున్సిపాలిటీ నుంచి నగర పాలక సంస్థగా మారిన నేపథ్యంలో తొలి మేయర్‌గా ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్‌ను ఆ పీ ఠంపై కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. అయితే ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు చేయడంతో ఎవరిని బరిలో నిలపాలనేది డీఎస్ కోటరీలో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపికకు వేసిన కమిటీ ఏం తేల్చనుందో రెండు, మూడు రోజుల్లో తేలనుంది. కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీకి కూడ ప్రతిష్టాత్మకమే. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చవిచూడనున్నారోనన్న చర్చ ఇప్పటికే మొదలైంది. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి (ప్రస్తుతం టీఆర్ఎస్) గంప గోవర్ధన్‌పై 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన షబ్బీర్ ఏడాది క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీకి దిగే ఈయనకు 63,657 ఓట్లున్న కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు కీలకమే. అర్మూరు నియోజకవర్గంలో ఓటమి పాలైన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డికి ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికలు కీలకమే. గత ఎన్నికల్లో కాంగ్రె స్ నుంచి గెలిచిన కంచెట్టి గంగాధర్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ వెంట పార్టీలో ఉన్నారు. ఈసారి సైతం ఆయన భార్యను బరిలో దింపే యోచనలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులకు గడ్డుకాలమేనన్న చర్చ ఉంది. కాంగ్రెస్, బీజేపీలతో టీఆర్ఎస్, టీడీపీలు పొత్తు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని చర్చలు సాగుతున్న తరుణంలో ఆయా పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో దీటైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాల సమాచారం. అన్నపూర్ణమ్మ, గంప, యెండలలకు.. నిజామాబాద్ అర్బన్ నియోకవర్గం నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ కు నగరపాలక సంస్థ ఎన్నికలు కీలకం కానున్నాయి. పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌పై వరుస విజ యాలు పొందిన లక్ష్మీనారాయణ నగరపాలక సంస్థపై పట్టు సాధించలేకపోయారు. వచ్చే నెల లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ని జామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు తీవ్ర ప్ర భావం చూపే అవకాశం ఉండగా లక్ష్మీనారాయ ణ వ్యూహం ఏమిటనే చర్చ ఉంది. కామారెడ్డి లో 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన గం ప గోవర్ధన్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉ న్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఇంతకు ముందు చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన కైలాస్ శ్రీనివాస్‌రావు వ్యవహరించారు. అయితే అసెం బ్లీ ఎన్నికలకు ముందుగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఈ మున్సిపాలిటీలో గెలుపు ఓట ములు ఎమ్మెల్యే ఎన్నికలపై ప్రభావం చూపనుండగా... టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు సైతం మున్సిపల్ ఎన్నికల దడ మొదలైంది. ఆర్మూరు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత ఏలేటి అన్నపూర్ణమ్మకు ఆర్మూరు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సుమారుగా ఈ నియోజకవర్గంలో 1.42 లక్షల ఓట్లుంటే... ఆర్మూరు మున్సిపాలిటీలోనే 34,666 ఓట్లున్నాయి. శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై గెలుపొందిన అన్నపూర్ణమ్మ.. ఈసారి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నా, ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికలు ఆమెకే కీలకం కానున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో ఒక నెల ముందుగానే కార్పొరేషన్, మున్సిపాలిటీలకు పోరు జరగడం రాజకీయ పార్టీల్లో సర్వత్రా చర్చనీయాంగా మారింది. ముఖ్యనేతల్లో మున్సిపల్ ఎన్నికల దడ మొదలైంది.