సాక్షి, నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మపురి సంజయ్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని డీయస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఆయనది వేరే పార్టీ అని, తనది వేరే పార్టీ అంటూ చెప్పుకొచ్చాడు. శుక్రవారం ‘సాక్షి’తో ముచ్చటిస్తూ.. సంజయ్‌పై లైంగిక వేధింపుల కేసు నిరూపణ అయితే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. తాను టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నానని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ రైతుల వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. గజ్వేల్, సిద్ధిపేట రైతులు బాగుంటే సరిపోతుందా.. మిగతా రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. నిజామాబాద్ రైతుల సంక్షేమం కోసం ఒత్తిడి తెస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాటలు చెబుతుందని దుయ్యబట్టారు. భవిష్యత్తులో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బుద్ది చెబుతారంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment