
సాక్షి, నిజామాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభ విషయమై బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్‌ఎస్ సభ విఫలమైందని, కాబట్టి ఆ పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన అన్నారు.
టీఆర్‌ఎస్ సభకు వచ్చింది కేవలం రెండున్నర లక్షల మందేనని, రేపు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కు 20 సీట్ల కంటే ఎక్కువ రావని ఆయన జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో కారు అడ్డంగా బోర్లా పడుతుందన్నారు. ప్రధాని మోదీని జోనల్ వ్యవస్థపై చేస్తావా, లేక చస్తావా అనేంత సీన్ కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు.
