ఎంపీ అర్వింద్‌ వాహనంపై దాడి... | Attack On BJP MP Dharmapuri Arvind Vehicle At Jagtial Tallarampur | Sakshi
Sakshi News home page

ఎంపీ అర్వింద్‌ వాహనంపై దాడి...

Published Tue, Jun 29 2021 8:12 AM | Last Updated on Tue, Jun 29 2021 8:24 AM

Attack On BJP MP Dharmapuri Arvind Vehicle At Jagtial Tallarampur - Sakshi

తాళ్లరాంపూర్‌లో ఎంపీ కాన్వాయ్‌ను అడ్డుకుంటున్న రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు

మోర్తాడ్‌(బాల్కొండ)/జగిత్యాల రూరల్‌: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వాహనంపై కోడిగుడ్లతో కొట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ సహకార సంఘం ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నాలో పాల్గొనడానికి అర్వింద్‌ సోమవారం గ్రామానికి చేరుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ఎప్పుడం టూ కొందరు రైతులు, టీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. బీజేపీ శ్రేణులు కూడా రంగంలోకి దిగడంతో స్వల్పంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు గడ్డం శ్రీనివాస్‌ కోడిగుడ్డును ఎంపీ వాహనంపైకి విసిరాడు. ఇది ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి అందరినీ చెదరగొట్టారు. కమ్మర్‌పల్లి బీజేపీ నాయకుడు రంజిత్‌కు గాయాలయ్యాయి.  

టీఆర్‌ఎస్‌ నా చెప్పుతో సమానం... 
టీఆర్‌ఎస్‌ తన చెప్పుతో సమానమని అర్వింద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో తిరిగితే బీజేపీ శ్రేణులు అడ్డుకోవాలని కార్యకర్తలకు సూచించారు. 

రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ కచిరె...
సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి పెద్ద కచిరెగాడని, బైం సాలో ముస్లింలతోపాటు హిందువులపై కూడా అక్రమంగా కేసులు నమోదు చేయించారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా పొరండ్ల గ్రామంలో సోమవారం ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ అర్వింద్‌ మాట్లాడారు.

చదవండి: తమాషా చేస్తున్నారా.. నన్ను ఆపడానికి మీరెవరు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement