vehicle attack
-
ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి...
మోర్తాడ్(బాల్కొండ)/జగిత్యాల రూరల్: ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై కోడిగుడ్లతో కొట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ సహకార సంఘం ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నాలో పాల్గొనడానికి అర్వింద్ సోమవారం గ్రామానికి చేరుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ఎప్పుడం టూ కొందరు రైతులు, టీఆర్ఎస్కు చెందిన నాయకులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. బీజేపీ శ్రేణులు కూడా రంగంలోకి దిగడంతో స్వల్పంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో టీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ కోడిగుడ్డును ఎంపీ వాహనంపైకి విసిరాడు. ఇది ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. కమ్మర్పల్లి బీజేపీ నాయకుడు రంజిత్‌కు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ నా చెప్పుతో సమానం... టీఆర్ఎస్ తన చెప్పుతో సమానమని అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో తిరిగితే బీజేపీ శ్రేణులు అడ్డుకోవాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కచిరె... సీఎం కేసీఆర్ రాష్ట్రానికి పెద్ద కచిరెగాడని, బైం సాలో ముస్లింలతోపాటు హిందువులపై కూడా అక్రమంగా కేసులు నమోదు చేయించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా పొరండ్ల గ్రామంలో సోమవారం ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ అర్వింద్ మాట్లాడారు. చదవండి: తమాషా చేస్తున్నారా.. నన్ను ఆపడానికి మీరెవరు? -
బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరిన పోలీసులు
విజయనగరం: రామతీర్థంలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి కేసులో అరెస్ట్ అయిన ఏడుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితులకు బెయిల్ లభిస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వారికి బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొందరిని విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కాగా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రామతీర్ధం సందర్శన సందర్భంగా టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆయన వాహనంపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసిన ఘటనలో నెలిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరైన టీడీపీ నేత కళా వెంకటరావును అరెస్ట్ చేసి ఆతర్వాత విడుదల చేశారు. ఇదే కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా కళా వెంకటరావు ఉన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై దాడి
అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. తలుపుల ఉరుసు ఉత్సవాల్లో దుండగులు బీభత్సం సృష్టించి, ఎమ్మెల్యే కారు అద్దాలను ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. చాంద్ బాషా తలుపుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఫిర్యాదు చేసి 12 గంటలు అయినా పోలీసులు స్పందించలేదు. చాంద్ బాషా మాట్లాడుతూ.. తన వాహనంపై దాడి చేయడం పిరికిపందల చర్య అని అన్నారు. తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కారు అద్దాలను ధ్వంసం చేశారని విమర్శించారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తానని హెచ్చరించారు.