కేసీఆర్‌కి ధైర్యముంటే అక్బర్‌ వ్యాఖ్యలను ఖండించాలి | Dharmapuri Aravind Criticises KCR over Akberuddin Comment | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 28 2018 7:52 PM | Last Updated on Wed, Nov 28 2018 7:59 PM

Dharmapuri Aravind Criticises KCR over Akberuddin Comment - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ‘ఎవరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నా ముందు మోకరిల్లాల్సిందే’ నంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి అహంకారపూరితంగా మాట్లాడారని, సీఎం కేసీఆర్‌కు ధైర్యముంటే అక్బర్‌ వ్యాఖ్యలను ఖండించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ అన్నారు. ఆత్మగౌరవం, స్వపరిపాలన లక్ష్యంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అక్బర్‌ కాళ్ళ ముందు తాకట్టు పెట్టే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అక్బరుద్దీన్‌ ఈ వ్యాఖ్యలు చేసి.. నాలుగైదు రోజులైనా కేసీఆర్ స్పందించలేదు కాబట్టి.. అక్బర్‌ మాటలే నిజమని నమ్మాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.  కేసీఆర్‌ స్పందించకపోయినా.. కనీసం కేటీఆర్‌ కూడా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement