బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అక్బరుద్దీన్‌ ప్రశంసలు.. కేసీఆర్‌ మళ్లీ సీఎం! | MIM Akbaruddin Owaisi Comments On BRS Government In Assembly | Sakshi
Sakshi News home page

మా ప్రయాణం బీఆర్‌ఎస్‌తోనే.. కేసీఆర్‌ మళ్లీ సీఎం: అక్బరుద్దీన్‌ ప్రశంసలు

Published Sun, Aug 6 2023 1:20 PM | Last Updated on Sun, Aug 6 2023 1:21 PM

MIM Akbaruddin Owaisi Comments On BRS Government In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కేసీఆర్‌ పాలనపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ప్రశంసలు కురిపించారు. తమ ప్రయాణం బీఆర్‌ఎస్‌తోనేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. తమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు.

శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు-స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై అక్బరుద్దీన్‌ ఒవైసీ లఘుచర్చను ప్రారంభించారు. జైపూర్‌ రైలు ఘటనలో చనిపోయిన హైదరాబాద్‌ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇందుకు రాష్ట్ర సర్కారుకు, కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అక్బరుద్దీన్‌ చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉండటం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.

రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లీం మైనార్టీలు ఉన్నారని వారి ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించిందన్నారు. మైనార్టీలకు షాదీముబారక్‌, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ వంటి పథకాలు చేపట్టారని వెల్లడించారు. రెండో హజ్‌ హౌస్‌కు ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిందని చెప్పారు. 58, 59 జీవో కింద పట్టాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంన్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సక్షేమాభివృద్ధికి కృషిచేస్తుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement