
సాక్షి, నిజామాబాద్: ఏడాదిలోపే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరయిన ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన సీఎం కేసీఆర్ ఎంఐఎంతో చేతులు కలపడం విడ్డూరంగా ఉందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
మరో పదేళ్లు తానే సీఎం అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏడాదిలోపే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ఖాయమని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే నిధులను మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారని.. కాంగ్రెస్ నేత చిదంబరానికి పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు పడుతుందని జోస్యం చెప్పారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment