BJP MP Arvind Strong Countered To Minister KTR Over Drug Comments - Sakshi
Sakshi News home page

లవంగాకు తంబాకుకు తేడా తెలియని మంత్రి కేటీఆర్: ఎంపీ అరవింద్‌

Published Tue, Dec 20 2022 8:28 PM | Last Updated on Tue, Dec 20 2022 9:07 PM

BJP MP Arvind Strong Countered Minister KTR On Drug Comments - Sakshi

న్యూఢిల్లీ: డ్రగ్స్‌ టెస్ట్‌ కోసం తాను రెడీ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు వెంట్రుకలు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి సవాల్‌ను ఇంత వరకు నెరవెర్చలేదని గుర్తు చేశారు. ఒక బాధ్యతగల మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాట నిలబెట్టుకోవాలని సూచించారు. నీ వెంట్రులు, నీ గోర్లు ఎవరికి కావాలంటూ మంత్రిపై విమర్శలు గుప్పించారు. 

‘నీ బొచ్చు, నీ గోర్లు ఎవరికి కావాలి. నీకు డయాబెటిస్ ఉంది, నీ కిడ్నీలు ఎవడికి కావాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపు తర్వాత హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తానని చెప్పావు. విచిత్రమైన హామీలు ఇచ్చావు. వరదల్లో మునిగిపోయిన వారికి రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగలు పెన్షన్, ఉద్యోగాలు , ఉచిత ఎరువులు ఏ హామీ నెరవేర్చలేదు. లవంగాకు తంబాకుకు తేడా తెలియని మంత్రి కేటీఆర్. దర్యాప్తు సంస్థలు, కోర్టులు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో దోషి అని తేలితే జైలుకు పోతారు.’అని తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌.

ఇదీ చదవండి: చెప్పుతో కొట్టుకుంటావా? బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement