
సాక్షి, నిజామాబాద్ : పసుపు రైతులకు తీపి కబురు అందనుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తెలిపారు. సోమవారం నిజామాబాద్‌లో జరగబోయే బహిరంగ సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి పాల్గొంటారని, వారు పసుపు రైతులకు పెద్ద శుభవార్త మోసుకొస్తున్నారని ఆయన చెప్పారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేయనున్నారు.