సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై ఆ పార్టీ చీఫ్ విప్, మిగతా విప్‌లు సోమవారం మండలి చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, రాములు నాయక్, కొండా మురళి, భూపతిరెడ్డిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయనుంది. అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నాగర్‌కర్నూల్‌కు చెందిన దామోదర్‌రెడ్డి ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే చర్యలు తీసుకోవాల్సి వస్తే దామోదర్‌రెడ్డిపై ముందు తీసుకుంటారా? లేకా ఈ నలుగురిపై తీసుకుంటారా అన్న దానిపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment