
సాక్షి, నల్గొండ : అసమ్మతి నేతకు టీఆర్‌ఎస్ పార్టీ షాకిచ్చింది. అసమ్మతి నేత వెంకటేశ్వర్ రావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మునుగోడు సీటును ఆశించిన వెంకటేశ్వర్ రావు పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డారని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనను పలుమార్లు పిలిచి బుజ్జగించినా మాట వినకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక నల్గొండ, సాగర్, మిర్యాలగూడ, తుంతుర్తిలోనూ అసమ్మతి నేతలు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారని చెప్పారు. దీంతో వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment