
రైతు సమితిలపై అవగాహన లేదు
రైతు సమన్వయ సమితిలపై విపక్షాలకు అవగాహన లేదని, సమితిల ఏర్పాటు ను అడ్డగిస్తామంటూ అర్థం లేకుండా మాట్లాడుతు న్నారని
విపక్షాలపై పల్లా ఫైర్
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితిలపై విపక్షాలకు అవగాహన లేదని, సమితిల ఏర్పాటు ను అడ్డగిస్తామంటూ అర్థం లేకుండా మాట్లాడుతు న్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. అందరితో మాట్లాడి సుదీర్ఘ కసరత్తు తర్వాతే సమితిల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని శనివారం ఇక్కడ చెప్పారు. టీఆర్‌ఎస్‌లో కోవర్టులు న్నారని భట్టి అర్థంలేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు తప్ప అందరూ తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు.