సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కొలువులపై జేఏసీ చైర్మన్ కోదండరాం అసత్య ప్రచారం చేస్తున్నారని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. కొలువుల కొట్లాటంతా రాజకీయ నిరుద్యోగుల కోసమేనని విమర్శిం చారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యో గాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహం తో ముందుకు వెళుతోందని, లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు.
ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 63 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉందని వివరించారు. ఎన్నికలప్పుడు కోటి ఉద్యోగాలిస్తామని బీజేపీ హామీ ఇచ్చిం దని, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కిందని తెలిపారు. మీ పోరాటం బీజేపీ మీద చేయకుండా ఆ పార్టీ సాయం తీసుకుంటారా అని నిలదీశారు. నిరుద్యోగ సమస్యను పెంచి పోషించిన కాంగ్రెస్‌తో కోదండరాం ఎలా కలిసి పనిచేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై నిరుద్యోగులు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాజకీయ నిరుద్యోగుల కోసమే ‘కొట్లాట’
Published Sun, Dec 3 2017 2:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment