
అబద్ధాలు శృతిమించుతున్నాయి
కాంగ్రెస్ నింపిన చీకట్లను తొలగిస్తూ మూడేళ్లలోనే విద్యుత్ కొరత లేకుండా చేసి టీఆర్‌ఎస్ వెలుగులు నింపుతోందని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
ఉత్తమ్‌పై పల్లా ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నింపిన చీకట్లను తొలగిస్తూ మూడేళ్లలోనే విద్యుత్ కొరత లేకుండా చేసి టీఆర్‌ఎస్ వెలుగులు నింపుతోందని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అబద్ధాలు శృతి మించుతు న్నాయన్నారు. పులిచింతలపై ఉత్తమ్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు. 2006లో పులిచింతల హైడల్ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు వచ్చినా కాం గ్రెస్ హయాంలో తట్టెడు మన్ను కూడా తీయలేదన్నారు.
కేసీఆర్ సీఎం అయిన తర్వాతే 2015లో పులిచింతలకు రూ.563 కోట్లతో పనులు మొదలయ్యాయన్నారు. కేసీఆర్ కృషితోనే విద్యుత్ ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయన్నారు. భూపా లపల్లి, కడప థర్మల్‌ప్లాంట్లకు ఒకేసారి శంకుస్థాపన జరిగినా కడపలో ఉత్పత్తి ప్రారంభమవలేదని, భూపాలపల్లిలో 600 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 60 ఏళ్లలో 6వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి జరిగితే... టీఆర్‌ఎస్ హయాంలో మూడేళ్లలోనే 12 వేల మెగావాట్లు విద్యుత్ వస్తుందన్నారు.