తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో సాగునీటిపై కొత్త పథకం ప్రకటిస్తారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో సాగునీటిపై కొత్త పథకం ప్రకటిస్తారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. జూన్ 2లోగా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై రాజకీయ చేయడం సరికాదని, టీడీపీ నేతలకు మురికిపట్టిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా వారిని కూడా శుభ్రం చేస్తామని అన్నారు.