జీవో 123 రద్దుతో ప్రతిపక్షాల రాక్షసానందం
పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: భూసేకరణకు ఉద్దేశించిన జీవో 123ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ రాక్షసానందం పొందుతున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... జీవో 123కు వ్యతిరేకంగా 70 పిటిషన్ల వరకు వేశారని, 2013 చట్టానికి లోబడే ప్రభుత్వం భూ సేకరణ జరుపుతోందని, ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు. వాటర్ గ్రిడ్ తమదే అంటున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేసవి కాలంలో తాగునీటి కష్టాలు ఎందుకొచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.