GO 123
-
ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య
నాలుగు నెలలుగా నిలిచిన ప్రక్రియ ఇంకా కావాల్సిన భూమి 90 వేల ఎకరాల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకింద భూసేకరణ ప్రక్రియ నిలిచిపోవడంతో నిర్మాణ పనులకు తీవ్ర ఆటకం కలుగుతోంది. భూసమస్యకు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 123ని తెరపైకి తెచ్చినా దానికి నిర్వాసితులు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకతకు తోడు హైకోర్టు సైతం స్టే ఇవ్వడంతో నాలుగు నెలలుగా భూసేకరణ ప్రక్రియ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. ఇంకా వివిధ ప్రాజెక్టుల పరిధిలో సుమారు 90వేల ఎకరాల మేర భూసేకరణ అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలుపనున్న భూసేకరణ సవరణ చట్టంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దీనికి సంబంధించిన బిల్లు చట్టంగా మారితేనే మిగిలిన భూసేకరణ సాధ్యంకానుంది. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు మొత్తంగా 3,67,218.03 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు మొత్తంగా 2,77,409.23 ఎకరాలు సేకరించారు. మరో 89,808.80 ఎకరాలు సేకరించాల్సిఉంది. ప్రధాన ప్రాజెక్టులకు ఎంత?... ప్రధాన ప్రాజెక్టుల పరంగా చూస్తే కాళేశ్వరం పరిధిలో 35,729 ఎకరాలు, పాలమూరు కింద 12,445 ఎకరాలు, ప్రాణహిత కింద 4,505 ఎకరాలు, దేవాదుల కింద 5,642 ఎకరాల మేర సేకరించాల్సి ఉంది. అయితే 2013–కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే మార్కెట్ విలువ నిర్ణయించడం, గ్రామసభల ఆమోదం తీసుకోవడం, ప్రభావితం అయ్యే కుటుంబాలకు రూ.5లక్షల వరకు పరిహారం, చేతి వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు ఏకమొత్తంగా పరిహారం ఇవ్వాల్సి రావడం.., ఈ మొత్తం అంశాలను కొలిక్కి తెచ్చేందుకు సుమారు 6 నుంచి 8 నెలల సమయం పట్టనుండటంతో ప్రభుత్వం జీవో 123తో సేకరణ చేస్తూ వచ్చింది. అయితే ఈ ఏడాది జనవరిలో జీవో 123పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్ర భూసేకరణ బిల్లును తెచ్చినా, కేంద్రం మరిన్ని సవరణలు సూచించడంతో అది తిరిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న సవరణలతో కూడిన బిల్లును రాష్ట్ర శాసనభ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారాకే మిగతా భూసేకరణ చేపట్టే అవకాశాలున్నాయి. -
ఇది ప్రజావిజయం
123 జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల పట్ల ఉద్యమకారుల హర్షం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కోసం 123 జీవో కింద జరుగుతున్న భూ సేకరణ చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఉద్యమకారులు హర్షాతిరేకాలు ప్రకటించారు. ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసినా హైకోర్టు తమ గోడు వినిపించుకొని జీవితాలను నిలబెట్టిందని కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్నసాగర్, జహీరాబాద్ మహిళలు, మహబూబ్‌నగర్ రైతులు, కూలీల విజయంగా దీన్ని ఉద్యమకారులు కొనియాడారు. 9 నెలలుగా సాగుతున్న తమ ఉద్యమానికి హైకోర్టు ఉత్తర్వులు నూతనోత్తేజాన్ని ఇచ్చాయన్నారు. ప్రజాపోరాటాలెప్పుడూ వృ«థాకావని హైకోర్టు ఉత్తర్వులు నిరూపించాయని పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టం ఉండగా ఒకే ఒక్క జీవోతో రైతుల బతుకులను బుగ్గిపాలు చేయాలని చూసినా కోర్టు తమకు అండగా నిలిచిందని మల్లన్న సాగర్ ఉద్యమకారులు స్పష్టం చేశారు. వేములగట్టు లో 215 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని, కోర్టు ఆసరాతో రైతాంగం ఆనందంగా ఉన్నదని ఉద్యమకారులు తెలిపారు. ఎందరో రైతులు ఇప్పటికే 123 జీవో కింద భూములు అప్పజెప్పారని, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తెలంగాణ రైతాంగంపట్ల సానుకూల వైఖరిని అవలంబించాలని వారు కోరారు. తక్షణమే 123 జీవో ప్రకారం భూముల సేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతుల దగ్గర తీసుకున్న భూముల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు తదుపరి ఉత్తర్వులపై ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగారు 2013 చట్టం పనికిమాలినదన్నారు. హైకోర్టు 123 జీవో ద్వారా భూసేకరణ చెల్లదని స్పష్టం చేసింది. ఏది కరెక్టో తేల్చుకోవాల్సింది ప్రజలే. మార్కెట్ వాల్యూతో 2013 చట్టం ద్వారానే భూసేకరణ చేయాలి. భూమి నుంచి రైతులను, కూలీలను, చేతి వృత్తులవారిని వేరుచేయొద్దు. ఓట్లు వేయించుకొని గెలిచినవారు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే, కోర్టులు మా మొర ఆలకించాయి. మాకు న్యాయం చేశాయి. చేస్తాయన్న నమ్మకం మాకుంది. – ఎండీ హయత్ ఉద్దీన్, వేములగట్టు, మల్లన్న సాగర్ నిర్వాసిత ఉద్యమకారుడు. ప్రభుత్వం ఇకనైనా బలవంతపు భూసేకరణను ఆపివేయాలి. ప్రభుత్వం రైతుల్ని కాదన్నా కోర్టు ఆదుకుంది. పాత దాని కంటే కొత్తది ఎప్పుడైనా అభివృద్ధికరంగానే ఉండాలి. కానీ మన తెలంగాణలో చట్టం కన్నా జీవోకి బలమెక్కువని భావించారు. అది తప్పని కోర్టు రుజువు చేసింది. – కె.వి. అమరేందర్ రెడ్డి, వేములగట్టు, మల్లన్నసాగర్ నిర్వాసిత ఉద్యమకారుడు. తెలంగాణలో దాదాపు 72 ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణ చేస్తున్నారు. అన్ని చోట్లా ప్రజలు ప్రతిఘటించారు. బలవంతంగా భూములు తీసుకున్న చోటఇస్తామన్న నష్టపరిహారం ఇవ్వలేదు. 123 జీవోకి చట్టబద్ధత లేదు. పార్లమెంటు చేసిన చట్టాన్ని కాలదన్ని లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకుంటోంది. భూముల నుంచి రైతులను, కూలీలను తరిమికొట్టడం అన్యాయం. అదే విషయం కోర్టు స్పష్టం చేసింది. ఇది వివిధ రకాల క్షేత్ర స్థాయి పోరాటాల వల్ల ప్రజలు సాధించిన విజయం. దీనికి న్యాయపోరాటం తోడైంది. 2016 బిల్లు కూడా నిలబడదని స్పష్టం అయింది. 123 జీవోని వ్యతిరేకిస్తున్నారు కనుక కొత్త చట్టం తెచ్చారు. అంతే! – ఆశాలత, రైతు స్వరాజ్య వేదిక ఇప్పటికే 123 జీవో ద్వారా సేకరించిన భూముల రైతులకు న్యాయం చేయాలి. 2013 చట్టాన్ని వారికి అన్వయించాలి. ప్రభుత్వం ప్రజలను మోసగించడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం అసాధ్యం. – కె.వి. లక్ష్మారెడ్డి, వేములగట్టు. -
123 జీవోపై స్టేతో నష్టం లేదు!
దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్న నీటి పారుదల శాఖ 2013 చట్టం ప్రకారమే నోటిఫికేషన్, భూసేకరణ జరుగుతోందని వెల్లడి సవరణ బిల్లు ఆమోదం పొందితే 123 జీవో కింద సేకరణ అధికారికం అవుతుందని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం జీవో 123 కింద భూసేకరణ చేపట్టవద్దంటూ హైకోర్టు ఇచ్చిన స్టేతో ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులు కోరుకున్నట్లుగా భూసేకరణ చేస్తున్నందున.. కోర్టు ఉత్తర్వులపై మళ్లీ అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని భావిస్తోంది. భూసేకరణ చట్టం–2013 ప్రకారమే ప్రస్తుతం నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు, భూసేకరణ జరుగుతోందని... జీవో 123 కింద సేకరించిన భూమి సైతం భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే అధికారికం అవుతుందని పేర్కొంటోంది. భారీగా భూసేకరణ: రాష్ట్రంలో మొత్తంగా 3.2 లక్షల ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, అందులో ఇప్పటికే 2.12 లక్షల ఎకరాల సేకరణ పూర్తయింది. ఇందులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 63 వేల ఎకరాల మేర సేకరించగా.. దీనిలో 47 వేల ఎకరాలు 123 జీవో కింద, 16 వేల ఎకరాలు భూసేకరణ చట్టం ప్రకారం తీసుకున్నారు. ఇంకా ప్రధాన ప్రాజెక్టుల పరంగా చూస్తే కాళేశ్వరం పరిధిలో 45 వేల ఎకరాలు, పాలమూరు కింద 13 వేల ఎకరాలు, దేవాదుల కింద 7 వేల ఎకరాల మేర సేకరించాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ప్రభుత్వం సంబంధిత నిర్వాసితులతో నేరుగా మాట్లాడి, ఒప్పించి 123 జీవో మేరకు భూసేకరణ జరుపుతోంది. ఆయా చోట్ల మార్కెట్ ధరల ప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అందిస్తోంది. అయితే ఆ ధర తమకు సరిపోదని.. చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరిన చోట ఆ విధంగా భూసేకరణ జరుపుతోంది, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో 13 వేల ఎకరాల మేర సేకరించగా.. వేములఘాట్ గ్రామ పరిధిలో 1,300 ఎకరాలు భూసేకరణ చట్ట ప్రకారమే చేస్తోంది. పాలమూరులోని పలు గ్రామాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై ఏమాత్రం ఉండబోదని నీటి పారుదల శాఖ పేర్కొంటోంది. ఇక ఇప్పటికే 123 జీవో కింద సేకరించిన భూమి సైతం సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే.. చట్ట ప్రకారం సేకరించినట్లు అవుతుందని చెబుతోంది. ‘‘కోర్టు తీర్పుతో ప్రాజెక్టుల్లో భూసేకరణ ఎక్కడా ఆగిపోదు. చట్ట ప్రకారం భూసేకరణ జరుగుతుంది. కాబట్టి కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోవాల్సిన అవసరం సైతం లేదు.’’అని ఉన్నత స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు. -
ఏ చట్టంలో ఏముంది?
భూసేకరణ అంశంపై రాష్ట్రంలో జగడాలు కేంద్ర చట్టం.. 123 జీవో..కొత్త సవరణ చట్టం వాటిల్లోని అంశాలేమిటి?.. బాధితులకు దేనితో ప్రయోజనం? 123 జీవోపై హైకోర్టు స్టేతో తెరపైకి వివాదాలు రాష్ట్రంలో భూసేకరణ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 123 జీవో ద్వారా భూముల సేకరణను నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మరోవైపు కేంద్రం అమల్లోకి తెచ్చిన భూసేకరణ చట్టం–2013కు సవరణలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర భూసేకరణ సవరణ బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం పొందాక ఈ చట్టం అమల్లోకి రానుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి వచ్చాకే భూసేకరణ చేపట్టే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 123 జీవోలో ఏముంది? కేంద్ర చట్టం ఏం చెబుతోంది? కొత్తగా రూపొందించిన రాష్ట్ర చట్టంలో ఏయే అంశాలున్నాయి?.. వీటిల్లో నిర్వాసితులకు ఏది ప్రయోజనకరం అనేది ఆసక్తి రేపుతోంది. ఈ అంశాలను పరిశీలిస్తే... – సాక్షి, హైదరాబాద్ జీవో 123 ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలై 30న జీవో 123ను జారీ చేసింది. దీని ప్రకారం... ప్రజోపయోగ పనులకు సేకరించే భూములకు, ఆస్తులకు సంబంధించి సదరు యజమానులతో ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరుపుతుంది. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్వాసితులతో నేరుగా బేరసారాలు జరిపి సహేతుకమైన ధర చెల్లించే ఒప్పందం చేసుకుంటుంది. ♦ తమ భూములు, ఆస్తులు, తన జీవనాధారపు నష్ట పరిహారం, పునరావాసం, పునరాశ్రయానికి కావాల్సిన ఖర్చులన్నీ కలిపి పరిహారం పొందినట్లుగా నిర్వాసితులు సమ్మతి పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ♦ కమిటీ సమక్షంలో జరిగిన తుది నిర్ణయం పై భవిష్యత్తులో తమకెలాంటి అభ్యంతరం లేదని అఫిడవిట్ సమర్పించాలి. దీంతో నిర్వాసితులకు చెందిన భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వానికి ధారాదత్తం అవుతాయి. ♦ అఫిడవిట్లు సమర్పించిన భూముల యజమానుల వివరాలతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యంతరాలకు కేవలం 15 రోజుల గడువిస్తుంది. అయితే మరింత వేగంగా భూసేకరణ ప్రక్రియను చేపట్టేందుకు ఈ వ్యవధిని వారం రోజులకు కుదిస్తూ 2015 అక్టోబర్ 7న మరో జీవో జారీ అయింది. ♦ సహేతుకమైన ధర ఖరారు ప్రక్రియలో పునరావాసం, పునరాశ్రయం అనే పదాలను తొలగిస్తూ అదే ఏడాది నవంబర్ 28న మరో జీవో జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూసేకరణ (సవరణ) బిల్లు–2016 కేంద్ర భూసేకరణ చట్టం–2013లోని కీలక అంశాలకు సవరణలు చేసి.. ఇంచుమించుగా 123 జీవోలోని అంశాలతోనే దీనినీ రూపొందించారు. ప్రభావిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం కంటే ఎక్కువ ఇచ్చేందుకు, దాని కంటే మెరుగైన పునరావాసం, పునః పరిష్కారం చేసేందుకు రాష్ట్రానికి హక్కు ఉంది. 2013 చట్టంలోని 107వ ఆర్టికల్ ఈ అధికారాన్ని కల్పించింది. దాని ప్రకారమే బిల్లును ప్రవేశపెట్టారు. ♦ ప్రజాప్రయోజనం దృష్ట్యా చేపట్టే నీటిపారుదల, విద్యుదీకరణ, గృహ నిర్మాణ ప్రాజెక్టుల భూసేకరణకు నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. ♦ 2013 చట్టంలోని సామాజిక ప్రభావం, ప్రజా ప్రయోజన నిర్ధారణకు చేపట్టే ప్రాథమిక విచారణ అధ్యాయాన్ని తొలగించారు. దీంతో సామాజిక ప్రభావ మదింపు, పరిశోధన లేకుండానే భూసేకరణ చేపట్టే అధికారం రాష్ట్రం సొంతమవుతుంది. ♦ ఆహార భద్రత ప్రయోజనాల పరిరక్షణ కోసం 2013 చట్టంలో నిర్దేశించిన మూడో అధ్యాయాన్ని తొలగించారు. మూడో అధ్యాయం ప్రకారం.. ఏటా రెండు లేదా అంతకు మించి పంటలు సాగు చేసే భూములను సేకరించకూడదు. అసాధారణ పరిస్థితుల్లో సేకరించాల్సి వస్తే అంతే విస్తీర్ణంలో వ్యవసాయ భూములను అభివృద్ధి చేయాలి. కానీ ఈ అధ్యాయాన్ని సవరణలో మొత్తంగా తొలగించారు. ♦ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలకు చేపట్టే భూసేకరణకు ఆ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్ భూ యజమానితో సంప్రదింపులు జరిపి, వారి సమ్మతితో అమ్మకం ధర ఖరారు చేసుకుంటారు. దాని ప్రకారం ఉత్తర్వులిచ్చి గెజిట్ జారీ చేస్తారు. దాంతో నిర్వాసిత భూ యజమానుల హక్కులు ప్రభుత్వానికి ధారాదత్తం అవుతాయి. ఆ భూములు ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ అవుతాయి. ♦ ఖరారు చేసుకున్న ధర ప్రకారం సహాయ పునరావాస, పరిహార మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించాలి. ♦ నిర్వాసితులకు అక్రమంగా డబ్బు చెల్లించినట్లు గుర్తిస్తే భూమి శిస్తు తరహాలో తిరిగి వసూలు చేసుకుంటారు. కేంద్ర భూసేకరణ చట్టం–2013 భూసేకరణకు సంబంధించి ఈ చట్టం ఎన్నో నిబంధనలను ఏర్పరిచింది. దీని ప్రకారం... ముందుగా భూసేకరణ చేపట్టే ప్రాంతాలకు ♦ నోటిఫికేషన్ జారీ చేయాలి. గ్రామ సభలు నిర్వహించి, అక్కడి ప్రజలకు తెలియజెప్పాలి. ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి.. నిర్వాసితుల గుర్తింపు, పునరావాస అంచనా పథకం తయారీ, గ్రామసభల్లో బహిరంగ విచారణ, అభ్యంతరాల స్వీకరణ, డిక్లరేషన్ ప్రచురణ, నోటీసుల జారీ, కలెక్టర్ ఆధ్వర్యంలో తుది అవార్డు ప్రకటన ప్రక్రియలు చేపట్టాలి. అభ్యంతరాలకు 60 రోజుల గడువు ఇవ్వాలి. ♦ పరిహారం చెల్లింపునకు రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాల ధర, లేదా సమీప గ్రామాల్లో ఉన్న భూముల అమ్మకాల సగటు అమ్మకపు విలువను పరిగణనలోకి తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో అదే రేటు ప్రకారం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో రెండింతలు ఇవ్వాలి. ♦ భూమి లేదా భవనానికి అనుబంధంగా ఉన్న ఆస్తుల విలువను లెక్కించాలి. భూమిలో ఉన్న పంటలు, మొక్కలు చెట్లు కోల్పోతే యజమానికి జరిగే నష్టం, ఇతర స్థిర చరాస్తులకు వాటిల్లే నష్టం, వ్యాపారానికి కలిగే నష్టం కూడా జత చేయాలి. ♦ చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని నిర్ధారించాక.. ఆ పరిహారానికి వంద శాతం అదనపు మొత్తం ‘సొలీషియం’గా కలిపి తుది అవార్డును నిర్ణయించాలి. ♦ నిర్వాసితులకు ఇందిరా ఆవాస్ యోజన ప్రమాణాల మేరకు ఇంటిని నిర్మించి ఇవ్వాలి. లేదంటే ఇంటికయ్యే వ్యయం చెల్లించాలి. ♦ భూసేకరణతో భూమి లేకుండా పోయిన కుటుంబాలకు ఆ ప్రాంతంలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టు ఆయకట్టులో కనీసం ఒక్కో ఎకరం సాగు భూమి ఇవ్వాలి. ♦ ప్రాజెక్టుల వల్ల ఉద్యోగాలు కల్పించబడితే బాధితకు టుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశం, లేదా ప్ర తి బాధిత కుటుంబానికి ఒకే దఫా రూ.5 లక్షలు చెల్లిం పు, లేదా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.2 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వార్షిక చెల్లింపులు చేయాలి. ♦ నిర్వాసితులైన ప్రతి కుటుంబానికి అవార్డు ప్రకటించిన తేదీ నుంచి ఏడాది పాటు నెలకు కనీసం రూ.3 వేల లెక్కన నెలసరి జీవన మనుగడ వేతనం చెల్లించాలి. ♦ బాధిత కుటుంబాన్ని, భవన సామగ్రిని, ఇతర వస్తువులను, పశువులను తరలించుకునేందుకు రవాణా ఖర్చులుగా ఒకే దఫాగా రూ.50 వేల ఆర్థిక సాయం. ♦ పశువుల కొట్టాలు, చిన్న చిన్న దుకాణాలను వేరేచోట నిర్మించుకునేందుకు రూ.25 వేలకు తక్కువ కాకుండా నోటిఫికేషన్ జారీ చేసి బాధితులకు చెల్లించాలి. ♦ వృత్తి పనివారు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి కలిగిన వారు నిర్వాసితులైతే ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 వేలకు తక్కువ కాకుండా చెల్లించాలి. ♦ సాగునీటి, జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వాసిత కుటుంబాలకు రిజర్వాయర్లలో చేపలు పట్టుకోవడానికి హక్కులు కల్పించాలి. ♦ ప్రతి బాధిత కుటుంబానికి ఒకే దఫా ‘రీసెటిల్మెంట్ వేతనం‘గా రూ.50 వేలు చెల్లించాలి. ♦ నిర్వాసితులు వేరేచోట పునరావాసం పొందడానికి వీలుగా కనీస మౌలిక సౌకర్యాలను కల్పించే బాధ్యత సదరు సంస్థదే. -
హక్కులను హరిస్తోంది
జీవో 123పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు సాగునీటి ప్రాజెక్టులకు దాన్ని వర్తింపజేయొద్దు సర్కారును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు 123 జీవో కింద ఇక భూములు కొనొద్దు.. ఒప్పందాలు చేసుకోవద్దు ఇప్పటికే చేసిన భూ కొనుగోళ్లు చట్టవిరుద్ధమే వాటి చెల్లుబాటుపై తుది విచారణలో తేలుస్తాం 2013 భూ సేకరణ చట్టం కింద భూములు తీసుకోవచ్చు బాధితులకు పునరావాసం, పునర్నిర్మాణం కల్పించాలి 2013 చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేయరాదు మౌలిక సదుపాయాల వంటి బాధ్యతలు రాష్ట్రానివే రాష్ట్రం తెచ్చిన జీవో 190లో ఇవేవీ లేవు బాధితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం లేదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాధిత కుటుంబాలకు (భూ యజమానులు కాదు) 2013 భూ సేకరణ చట్టం పలు హక్కులు, ప్రయోజనాలు కల్పిస్తున l్నందున భూముల కొనుగోలు కోసం జీవో 123ను వర్తింపజేయడానికి వీల్లేదని కోర్టు తేల్చిచెప్పింది. ‘‘స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచి భూముల కొనుగోలు నిమిత్తం తెచ్చిన జీవో 123ను అమలు చేసుకునే అధికారం 298వ అధికరణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న వారి హక్కులను, ముఖ్యంగా 2013 భూ సేకరణ చట్టంలోని షెడ్యూల్ 2, 3 కింద ఉన్నవారి హక్కులను హరించేలా జీవో 123 ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ జీవో కింద సాగునీటి ప్రాజెక్టుల అవసరాల కోసం భూములను కొనడానికి వీల్లేదు’’ అని స్పష్టం చేసింది. అంతేకాక ఈ జీవో కింద ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోవడానికి వీల్లేదంది. అయితే 2013 భూ సేకరణ చట్టం కింద భూములను తీసుకోవడానికి ఈ ఉత్తర్వులు ఎంతమాత్రం అడ్డంకి కాబోవని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. జీవో 123 ద్వారా ఇప్పటికే భూములమ్మిన వారికి (భూ యజమానులకు) కాక, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునర్నిర్మాణం, పునరావాసం కోసం 2013 భూ సేకరణ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేగాక, జీవో 123 కింద ప్రభుత్వం కుదుర్చుకున్న భూముల కొనుగోలు ఒప్పందాలు కూడా చట్ట విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు సరైనవేనా అన్న ప్రశ్నకు తుది విచారణ సమయంలో స్పష్టతనిస్తామంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘2013 భూ సేకరణ చట్టం అమల్లో ఉండగా దాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 298వ అధికరణ కింద తనకున్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి జీవో 123 ద్వారా భూములు కొనుగోలు చేయవచ్చా? భూ సేకరణ చట్టంతో సంబంధం లేకుండా జీవో 123 స్వతంత్రమైనదా? 298వ అధికరణ కింద రాష్ట్రానికి ఉన్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించకుండా 2013 చట్టం అడ్డుకుంటోందా? ఈ ప్రశ్నలన్నింటినీ తుది విచారణ సమయంలో పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం తన 80 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ంలో పలు సాగునీటి ప్రాజెక్టుల కోసం 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని జీవో 123 ద్వారా భూములు కొనుగోలు చేస్తుండటాన్ని సవాలు చేస్తూ మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. వాటిని సుదీర్ఘంగా విచారించి గత నవంబర్ 24న నిర్ణయాన్ని వాయిదా వేసిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం వెలువరించింది. కేంద్ర చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేయడానికి వీల్లేదు పార్లమెంటు చేసిన చట్టం అమలులో ఉంటూ సదరు అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు, 254(1) అధికరణ ప్రకారం ఆ చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర శాసనవ్యవస్థ ఎలాంటి చట్టమూ చేయడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. ‘‘అలా చూస్తే పార్లమెంటు తెచ్చిన 2013 భూ సేకరణ చట్టం ప్రస్తుతం అమల్లో ఉంది. కాబట్టి దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో చట్టం తేవడానికి వీల్లేదు. ఏ అంశంలోనైనా 2013 చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు చేసుక ునేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడానికి ఆస్కారం అసలే లేదు. ఉమ్మడి జాబితాలోని చట్టాల విషయంలో పార్లమెంటు చేసిన చట్టానికే ఎక్కువ విలువ ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. అవేమీ జీవో 190లో లేవు స్వచ్ఛందంగా కొనుగోలు చేసిన భూములపై ఆధారపడి బతుకుతున్న వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తి కళాకారులు (భూ యజమానులు కాదు) తదితరుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ హరించజాలదని ఈ సం దర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘2013 చట్టం బాధిత కుటుంబాలకు ఆర్థిక పరిహార ప్రయోజనాలతో పాటు పునరావాసం, పునర్నిర్మాణ ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది. పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత ులకు నగదు పరిహార చెల్లింపులు చేస్తున్నా చట్ట ప్రకారం వారికి దక్కాల్సినవన్నీ దక్కడం లేదు. నిర్వాసితులై బతుకుదెరువు కోల్పోయిన బాధలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చేందుకు విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2013 చట్టంలో పలు ప్రయోజనాలను చేర్చారు. బాధిత కుటుంబాలకు 123 జీవో కింద ఇవి దక్కడం లేదు. ఇది వారి హక్కులను హరించడమే. పైగా బాధితుల కోసం పలు సంక్షేమ చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 190 కూడా సంతృప్తికరంగా లేదు. బాధిత కుటుంబాలకు ఉద్యోగ కల్పన, శిక్షణ, కనీస వేతనాల గురించి 2013 చట్టంలో చట్టంలో స్పష్టంగా ఉంది. జీవో 190లో మాత్రం వాటి గురించి లేదు. అంతేకాక 2013 చట్టంలోని షెడ్యూల్ 3లో పేర్కొన్న ప్రకారం బాధిత కుటుంబాలకు మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ ఆ బాధ్యత గురించి జీవో 190లో ఎక్కడా ప్రస్తావనే లేదు’’ అని ఆక్షేపించింది. 14వ అధికరణకు విరుద్ధమని చెప్పజాలం నిర్ధిష్ట ఆధారాలుంటే తప్ప వివాదాస్పద ప్రశ్నల జోలికి న్యాయస్థానాలు వెళ్లబోవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జీవో 123 కింద భూములమ్మాలని రైతులను ప్రభుత్వం బలవంతం చేస్తోందని పిటిషనర్లు చెబుతున్నారు. తామెవరినీ బలవంతం చేయడం లేదని, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారినుంచే భూములు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఈ విషయంలో న్యాయస్థానం పిటిషనర్ల వైపో, ప్రభుత్వం వైపో మొగ్గు చూపడం సమంజసం కాదు. స్వచ్ఛందంగా భూములిచ్చే వారి విషయంలో ఒకలా, భూ సేకరణ ద్వారా భూములిచ్చే వారి పట్ల ఒకలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న పిటిషనర్ల వాదనలో ఆమోదించాల్సినంత బలం లేదు. 2013 చట్టం కింద తీసుకుంటున్న భూములకు, జీవో 123 ద్వారా తీసుకుంటున్న భూవl¬లకు ఇస్తున్న పరిహార మొత్తాల్లో తేడాలున్నంత మాత్రాన దాన్ని వివక్షగా చెప్పజాలం. ఎందుకంటే స్వచ్ఛందంగా భూములు ఎవరిస్తున్నా వారికి ప్రభుత్వం అధిక పరిహారమే ఇస్తుంది. అలా ఇవ్వడం లేదని పిటిషనర్లు కూడా చెప్పడం లేదు. కాబట్టి 14వ అధికరణకు జీవో 123 విరుద్ధమని మేం చెప్పలేకున్నాం’’ అని పేర్కొంది. ఆస్తి హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదు 2013 చట్టం కింద భూ సేకరణకు ముందు సామాజిక ప్రభావ, ఆహార భద్రత అధ్యయనం తప్పనిసరని ధర్మాసనం గుర్తు చేసింది. జీవో 123 కింద ఇవేమీ చేయడం లేదంది. ‘‘రాజ్యాంగంలోని 154, 162, 298 అధికరణల కింద తనకున్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 జారీ చేసింది. వర్తక, వాణిజ్యాలు, ఆస్తి సేకరణ, దాన్ని కలిగి ఉండే, విక్రయించే విషయాల్లో కార్యనిర్వాహక అధికారాన్ని ఉయోగించే అధికారం అధికరణ 298 కింద ప్రతి రాష్ట్రానికీ ఉంది. అయితే ఈ అధికారాలను పరిమితంగానే ఉపయోగించాలే తప్ప, అపరిమితంగా వాడరాదని స్వయానా 162వ అధికరణే చెబుతోంది’’ అని పేర్కొంది. అలాగే, ‘‘ఆస్తుల కొనుగోలు విషయంలో ఏ వ్యక్తితోనైనా ఒప్పందం కుదుర్చుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచి భూములు తీసుకుని వారితో ఒప్పందం కుదుర్చుకోవడానికీ అధికారముంది. అయితే 162వ అధికరణ కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించి ఒక వ్యక్తి ఆస్తి హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాయడానికి వీల్లేదు. ఆ అధికారాన్ని ఓ చట్టం ద్వారా ఉపయోగించాలే తప్ప కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కాదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, ‘ప్రభ ుత్వం పొరుగున ఉన్న వారి భూములను కొనుగోలు చేస్తున్నంత మాత్రాన పిటిషనర్ల వంటివారి ఆస్తి హక్కును హరించినట్టు కాదని కూడా పేర్కొంది. రాజ్యాంగంలోని 154, 162, 298 అధికరణల కింద తనకున్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 జారీ చేసింది. వర్తక, వాణిజ్యాలు, ఆస్తి సేకరణ, దాన్ని కలిగి ఉండే, విక్రయించే విషయాల్లో కార్య నిర్వాహక అధికారాన్ని ఉపయోగించే అధికారం అధికరణ 298 కింద ప్రతి రాష్ట్రానికీ ఉంది. అయితే ఈ అధికారాలను పరిమితంగానే ఉపయోగించాలే తప్ప, అపరిమితంగా వాడరాదని 162వ అధికరణే చెబుతోంది. – హైకోర్టు -
తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
-
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
-
జీవో 123పై హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూములను జీవో 123 ద్వారా భూములు సేకరించరాదని న్యాయస్థానం గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మల్లన్నసాగర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదితర సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూములను 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద కాకుండా జీవో 123 ద్వారా భూ సేకరణ చేస్తుండటాన్ని సవాలు చేస్తూ మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన రైతులు, ఆ భూములపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు వేర్వేరుగా పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి, గత ఏడాది నవంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జీవో 123 పేరుతో అధికారులు తమ భూములను బలవంతంగా లాక్కుంటూ, తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారని రైతులు హైకోర్టుకు నివేదించారు. చట్టాన్ని కాదని, కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం భూములను తీసుకుంటోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు తెలిపారు. చట్టం ముందు జీవో ఎందుకు పనికి రాదని వివరించారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. బలవంతంగా భూములు తీసుకోవడం లేదని తెలిపింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతుల నుంచి వారికి మెరుగైన పరిహారం చెల్లించిన తరువాతనే భూములు తీసుకుంటున్నామని కోర్టుకు నివేదించింది. ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి భూములను కొనుగోలు చేసే అధికారం రాజ్యాంగం తమకు కల్పించిందని వివరించింది. స్వచ్ఛందంగా సేకరించిన భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, అందుకు సంబంధించి జీవోలు 190, 191లు జారీ చేసిందని తెలిపింది. అయితే జీవో 123 ద్వారా భూములు సేకరించరాదని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ సంక్లిష్టంగా ఉందని, ఎక్కువ జాప్యం అవుతుందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలైలో 123 జీవో తెచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రైతుల సమ్మతితో భూమిని కొనుగోలు చేసింది. ఇటీవల మల్లన్నసాగర్ పరిధిలోని పలు గ్రామాల్లో భూసేకరణ సందర్భంగా ఇదే వివాదం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నిర్వాసితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
'నయీం ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి'
హైదరాబాద్: రాజకీయ పెద్దలు, పోలీసుల సహకారంతో గ్యాంగ్‌స్టర్ నయీం చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టాడని, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల సహకారంతోనే నయూమ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడన్నారు. కరుడుగట్టిన ఈ నేరగాడిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం అభినందనీయమన్నారు. కరీంనగర్ జిల్లాలోనూ నయీం సెటిల్మెంట్లు, దందాలు చేశాడని, నగునూర్లోనూ వందల ఎకరాల భూములను సంపాదించాడని తెలిపారు. వీటన్నింటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, అతడికి సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతరుల పేర్లను బయటపెట్టాలని కోరారు. 2013 చట్టం అమలుతోనే న్యాయం ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించే భూములకు 2013 చట్టం అమలు చేస్తేనే భూనిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చాడ అన్నారు. జీవో 123పై కోర్టు స్టే ఇవ్వడం ప్రభుత్వ విజయం కాదన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేపై తాము అప్పీల్‌కు వెళ్తామన్నారు. 2013 చట్టం ప్రకారం భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడుతామన్నారు. -
జీవో 123పై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్ : జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ జరిగింది. భూ నిర్వాసితులు, రైతు కూలీల రక్షణ కోసం తీసుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పించింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆ అఫిడవిట్లో విన్నవించారు. మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది రేపటి వరకూ గడువు కోరడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా 123 జీవో రద్దును హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. -
బర్రెకు పుండైతే కాకులు పండుగ చేసుకున్నట్లు..
మెదక్ : మల్లన్నసాగర్ విషయంలో విపక్షాల తీరు బర్రెకు పుండైతే కాకులు పండుగ చేసుకున్న తీరులా ఉందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు కోర్టుకెళ్లి స్వీట్లు పంచుకోవడం సరికాదన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ వస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, ఆ స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని సూచించారు. మిషన్ భగీరథ పాత పథకం కాదని హరీశ్ రావు అన్నారు. ఒక్క మెదక్ జిల్లాలో ఆ పథకం కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని సభకు వచ్చేవాళ్లు మధ్యాహ్నం ఒంటిగంటలోపే చేరుకోవాలన్నారు. ప్రధాని సభకు లక్షా 50వేలమంది కూర్చొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపినట్లు హరీశ్ తెలిపారు. -
అప్పీలుకు వెళ్తామనడం దారుణం
జీఓ 123పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: జీవో 123ను హైకోర్టు రద్దు చేస్తే దానిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడం దారుణమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు కోర్టు 16సార్లు మొట్టికాయలు వేసిందని, అయినా వారికి సిగ్గు రావడంలేదన్నారు. రమణ నేతృత్వంలో టీటీడీపీ బృందం శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యింది. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో నియంతృత్వంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌కు రమణ ఫిర్యాదు చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం-2013 అమలుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. ఎంసెట్-2 లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బృందంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులున్నారు. -
కేసులో ఇంప్లీడ్ అవుతాం: చాడ
సాక్షి, హైదరాబాద్: జీవో 123ని హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని శుక్రవారం సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన అప్పీలుకు సంబంధించిన కేసులో సీపీఐ కూడా ఇంప్లీడ్ అవుతుందని తెలిపారు. జీవో 123ని కోర్టు కొట్టేసినా దానిపై అప్పీలుకు వెళ్లడం ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి పట్టు విడుపులుండాలని సూచించారు. -
జీవో 123 రద్దుతో ప్రతిపక్షాల రాక్షసానందం
పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాక్షి,హైదరాబాద్: భూసేకరణకు ఉద్దేశించిన జీవో 123ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ రాక్షసానందం పొందుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... జీవో 123కు వ్యతిరేకంగా 70 పిటిషన్ల వరకు వేశారని, 2013 చట్టానికి లోబడే ప్రభుత్వం భూ సేకరణ జరుపుతోందని, ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు. వాటర్ గ్రిడ్ తమదే అంటున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేసవి కాలంలో తాగునీటి కష్టాలు ఎందుకొచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
హైకోర్టు తీర్పుపై అప్పీలుకు!
-
అప్పీల్ చేస్తే ఇంప్లీడ్ అవుతాం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: జీవో 123 రద్దుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూ సేకరణ జీవోను కొట్టివేసి హైకోర్టు వేసిన చెంపదెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. మంత్రి హరీశ్‌రావు అప్పీల్ ప్రకటనను పక్కనపెట్టి హైకోర్టు లేవనెత్తిన ఆయా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా గురువారం ఎంబీభవన్‌లో చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్యలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరిస్తోందని, పేదలకు కాకుండా పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని హైకోర్టు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని ఆరోపించారు. -
కేసీఆర్ వైదొలగాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: చట్ట వ్యతిరేకంగా జారీ చేసిన జీవో 123ని కోర్టు కొట్టివేసినందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ, హైకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో సీఎంకు అవగాహన లేదని మరోసారి రుజువైందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన భూ సేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాస చర్యలు తీసుకోవాలని పోరాడినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. జీవో 123 జారీ చేయడానికి బాధ్యులైన వారంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తీర్పు రాగానే భూ నిర్వాసితులు, ఆయా గ్రామాల ప్రజలు సంబురాలు జరుపుకున్నారని, ఇది నిర్వాసిత గ్రామాల వ్యతిరేకతకు నిదర్శనమని చెప్పారు. -
జీవో 123 కొట్టివేతపై నేడు అప్పీల్
సాక్షి, హైదరాబాద్: జీవో 123ని కొట్టేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ రూపంలో అప్పీల్‌ను దాఖలు చేయనుంది. ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఇందుకు సంబంధించి ప్రస్తావన చేయనున్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం స్వయంగా ఏజీతో మాట్లాడినట్లు సమాచారం. ఈ అప్పీల్లో హాజరై వాదనలు వినిపించే బాధ్యతలను ఏజీకి అప్పగించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఏజీ.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, ఈ విషయంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తర్వులు, వాటి తీరు తెన్నులు తదితర అంశాలపై అధ్యయనం మొదలుపెట్టారు. భూములను అమ్మే, కొనే అధికారం ప్రభుత్వానికి ఉందన్న కోణంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిశీలించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములను ఎలా సేకరిస్తోంది.. దానిపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు.. వాటిపై ధర్మాసనం ఇచ్చిన తీర్పులు.. తదితర అంశాలపైనా ఏజీ బృందం దృష్టి సారించింది. ఇప్పటికే జీవో 123పై అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా అప్పీల్లో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. గురువారం సాయంత్రం వరకు జీవో కొట్టివేత తాలుకు తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో స్వయంగా ఏజీనే రంగంలోకి దిగారు. సాయంత్రం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ కోర్టుకు వెళ్లి.. తీర్పు కాపీ కోసం న్యాయమూర్తిని అభ్యర్థించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశమని, అందువల్ల తీర్పు కాపీ వీలైనంత త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఏజీ స్వయంగా వచ్చి కోరడంతో సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. తన ఢిల్లీ విమాన ప్రయాణ సమయాన్ని కూడా మార్చుకున్నారు. బెంచ్ దిగిన తర్వాత న్యాయమూర్తి.. తన తీర్పు కాపీలో ఏవైనా అక్షర దోషాలు ఉన్నాయో పరిశీలించి వాటిని సరిచేసే పని పూర్తిచేశారు. అనంతరం రిజిస్ట్రీలో తీర్పు కాపీ బయటకు వచ్చేందుకు అన్ని ప్రక్రియలు పూర్తయి, ఏజీ చేతికి కాపీ వచ్చే సరికి రాత్రి 8.30 అయింది. అప్పటి వరకు రామకృష్ణారెడ్డి హైకోర్టులోనే ఉన్నారు. తీర్పు కాపీ తీసుకుని ఇంటికి వెళ్లారు. -
కోర్టు తీర్పు గౌరవించి 123 జీఓను రద్దు చేయాలి
వరంగల్ : భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.123 రద్దు చేసిన హై కోర్టు తీర్పును గౌరవిస్తూ కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2013ను అమలు చేసి భూనిర్వాసితులకు న్యాయం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హన్మకొండలోని టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. కేంద్రం రూపొందిం చిన చట్టం ప్రకారమే భూసేకరణ చేయాల ని, ఇప్పటి వరకు 123జీఓతో సేకరించిన వారికి సైతం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో శోభకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం విస్మరించిన కేసీఆర్ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని విస్మరిం చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. బాలసముద్రం లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకటవీరయ్య ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ఉల్లంఘించే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడుతోందన్నారు. కోర్టు తీర్పులతో కూడా సీఎంకు జ్ఞానోదయం కావడంలేదని మాజీ ఎమ్మెల్యే సీతక్క ఎద్దేవా చేశారు. ఎంసెట్–2 లీకేజీతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధముందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం ఆరోపించారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, మహబూబాబాద్, పరకాల ఇన్చార్జిలు బాలుచౌహాన్, గన్నో జు శ్రీనివాసచారి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పుల్లూ రు అశోక్‌కుమార్, గట్టు ప్రసాద్‌బాబు, జాటోతు ఇందిర, సంతోష్‌నాయక్, బీసీ, ఎస్టీ, ఎస్సీసెల్ విభాగాల అధ్యక్షులు గుర్రం బాలరాజు, అంగోతు కిషన్, సాంబయ్య, రఘునాథరెడ్డి, వెంటకృష్ణ, సారంగం, విజయ్, సురేష్ పాల్గొన్నారు. -
'26 నెలల్లో 16 జీవోలను హైకోర్టు రద్దు చేసింది'
హైదరాబాద్ : జీవో 123 రద్దు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో 16 జీవోలను హైకోర్టు రద్దు చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు అభిశంసించినట్లే అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 123 జీవోపై ప్రభుత్వానికి ఎందుకంత పట్టుదల అని ఆయన ప్రశ్నించారు. చట్టపరిధిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. 2013 భూ సేకరణ చట్టం కాదని టీఆర్ఎస్ సర్కార్ ముందుకు వెళితే ఉద్యమం తప్పదని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. 'మీ గురువు చంద్రబాబు బాటలో పయనిస్తే మీ పతనం కూడా ఖాయమని' కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. -
'26 నెలల్లో 16 జీవోలను హైకోర్టు రద్దు చేసింది'
-
తెలంగాణ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ..
-
హైకోర్టు తీర్పుపై అప్పీలుకు!
యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తీర్పు ప్రతిని పరిశీలించాక స్పందిస్తా: మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్: జీవో 123ని హైకోర్టు రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై అప్పీల్‌కు వెళ్లాలని యోచిస్తోంది. హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండటంతో ఆ దిశగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కోర్టును ఆశ్రయించిన వ్యవసాయ కూలీలకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా పాత జీవోకు సవరణలు చేసి కొత్త జీవోను తీసుకురావాలా..? అన్న అంశాన్ని సైతం పరిశీలిస్తోంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ సంక్లిష్టంగా ఉందని, ఎక్కువ జాప్యం అవుతుందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలైలో 123 జీవో తెచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రైతుల సమ్మతితో భూమిని కొనుగోలు చేసింది. ఇటీవల మల్లన్నసాగర్ పరిధిలోని పలు గ్రామాల్లో భూసేకరణ సందర్భంగా ఇదే వివాదం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. 2013 చట్టంలో ఉన్న వెసులుబాటు మేరకే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు, రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు ఈ జీవోను తెచ్చినట్లు గతంలో ప్రభుత్వం పలుమార్లు చెప్పుకుంది. కానీ తాజాగా హైకోర్టు ఈ జీవోను కొట్టివేయటంతో తదుపరి చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది. కాగా, తీర్పు ప్రతిని పూర్తిగా పరిశీలించాకే స్పందిస్తానని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామన్నారు. తీర్పు కాపీని చదివిన తర్వాతే స్పందిస్తానని అన్నారు. 2013 చట్టానికి లోబడి సాగునీటి ప్రాజెక్టులకు వేగంగా భూసేకరణ చేయాలనే సదుద్దేశంతోనే ఈ జీవోను తీసుకువచ్చామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పక్షాన వారి మేలు కోసమే పని చేస్తున్నట్లు చెప్పారు. 123 జీవో ద్వారా పేద ప్రజలకు, నిర్వాసితులకు మరింత మెరుగైన పరిహారం ఇవ్వాలని భావించామని, హైకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని కోరుతామని వివరించారు. సమీక్షలతో సీఎం బిజీబిజీ హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌తో భేటీ, ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్, సీఎంవో అధికారులతో చర్చలు, అనంతరం రాత్రి వరకు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షలతో బిజీబిజీగా ఉన్నారు. దీంతో హైకోర్టు తీర్పు విషయంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. కూలీలకు ప్రయోజనాలు దక్కడం లేదా? భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు వివిధ ప్రాంతాల్లోని నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిర్బంధంగా భూములు లాక్కోవద్దని సూచించిన హైకోర్టు.. ప్రస్తుతం వ్యవసాయ కూలీలు వేసిన పిటిషన్‌పై జీవోను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో వ్యవసాయ కూలీలకు 123 జీవోతో నష్టం జరిగిందా? 2013 చట్టంలో వారికి ఉన్న ప్రయోజనాలు ఇప్పుడు వర్తించడం లేదా..? అన్నది చర్చనీయాంశమైంది. భూములు కోల్పోయి ఉపాధికి దూరమయ్యే వ్యవసాయ కూలీలకు భూసేకరణ చట్టం ప్రకారం.. సంబంధిత ప్రాజెక్టులతో ఉద్యోగాలు కల్పిస్తే బాధిత కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వడం, లేదా ప్రతి బాధిత కుటుంబానికి ఒకే దఫా రూ.5 లక్షల చెల్లింపు, లేదా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.2 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వార్షిక చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ 123 జీవోలో వ్యవసాయ కూలీల ప్రస్తావన లేకపోవటం గమనార్హం. -
జీవో 123 ఔట్
► రాష్ట్ర సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ ► భూ సేకరణ చట్టం-2013కు ఈ జీవో విరుద్ధం ► బాధితుల హక్కులు, ప్రయోజనాలను హరిస్తోంది ► వ్యవసాయ కార్మికులకు చిల్లిగవ్వ కూడా దక్కడం లేదు.. ► మెరుగైన పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ► భూసేకరణ చట్టానికి విరుద్ధంగా నిబంధనలు తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు తదితరాల నిర్మాణం కోసం రైతుల నుంచి భూమి కొనుగోలు చేసేందుకు గత ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123ని కోర్టు కొట్టేసింది. బాధితులకు కొత్త భూసేకరణ చట్టం కల్పిస్తున్న హక్కులు, ప్రయోజనాలను ఈ జీవో హరిస్తోందని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ బుధవారం తీర్పు వెలువరించారు. మెదక్ జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయ్, చీలపల్లి, బర్దీపూర్ గ్రామాల పరిధిలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (ఎన్ఐఎంజెడ్) ఏర్పాటుకు అవసరమైన భూములను 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కాకుండా జీవో 123 ప్రకారం సేకరిస్తుండటాన్ని సవాలు చేస్తూ బర్దీపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికులు అల్గి తుక్కమ్మ, మరో 22 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ విచారించారు. వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారు పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఎన్ఐఎంజెడ్ కోసం ప్రభుత్వం జీవో 123 ద్వారా వేల ఎకరాల భూమిని సేకరిస్తోందన్నారు. వ్యవసాయ కార్మికులైన పిటిషనర్లు ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. జీవో 123 ద్వారా ఆ భూములను సేకరిస్తే వారు తమ జీవనోపాధిని కోల్పోతారని వివరించారు. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 3(సీ) ప్రకారం వ్యవసాయ కార్మికులు కూడా ‘ప్రభావిత కుటుంబం’ నిర్వచన పరిధిలోకి వస్తారని చెప్పారు. ఈ చట్టం ప్రకారం పిటిషనర్లకు దక్కాల్సిన పునరావాస ప్రయోజనాలను దక్కకుండా చేస్తూ ప్రభుత్వం జీవో 214 జారీ చేసిందన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కాదని ప్రభుత్వం జీవో 123 జారీ చేసిందని, దీనివల్ల బాధితులకు ఏమీ దక్కే పరిస్థితి లేదని వివరించారు. కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యతల నుంచి జీవో 123 ద్వారా ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు. నష్టపోయిన రైతు ఒక్కరూ లేరు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... జీవో 123 ద్వారా రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకోవడం లేదన్నారు. భూ సేకరణ చట్టం కింద రైతులకు దక్కుతున్న ప్రయోజనం కంటే జీవో 123 ద్వారానే అధిక ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. స్థానికంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ముందుకొచ్చిన రైతుల నుంచే భూములను కొనుగోలు చేస్తున్నామన్నారు. జీవో 123 వల్ల తమకు నష్టం జరిగింది ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా చెప్పలేదన్నారు. అసలు పిటిషనర్ల భూములను ప్రభుత్వం సేకరించలేదని, వారికి జీవో 123 వల్ల ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, అందువల్ల వారు ఈ వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదని వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ కైత్ ప్రభుత్వ వాదనలతో విబేధించారు. ప్రైవేటు ఆస్తుల డీలర్ కాదు పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ అన్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను సేకరించే డీలర్ కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. భూ సేకరణ చట్టం-2103లో వ్యవసాయ కార్మికులు ‘ప్రభావిత కుటుంబం’ నిర్వచనం పరిధిలోకి వస్తారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభావిత కుటుంబం పరిధిలోకి వచ్చే వారికి కొత్త భూ సేకరణ చట్టం అనేక రకాల ప్రయోజనాలను కల్పిస్తోందన్నారు. బాధితులకు జీవో 123 ద్వారా మొదట పునరావాస ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం.. ఆ తర్వాత వాటిని జీవో 214 ద్వారా హరించిందని తేల్చి చెప్పారు. జీవో 123 ద్వారా భూములు సేకరిస్తుండటంతో వ్యవసాయ కార్మికులకు చిల్లి గవ్వ కూడా దక్కడం లేదన్నారు. కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేశారు. ఒకవైపు కొత్త భూ సేకరణ చట్టాన్ని ఆమోదించి, మరోవైపు దాన్ని అమలు చేయకపోవడం ఎంత మాత్రం సరికాదన్నారు. భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా నిబంధనలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జీవో 123 కొట్టేస్తున్నట్లు తన తీర్పులో ప్రకటించారు. -
జీవోపై కోర్టుకెక్కింది వీరే
న్యాల్కల్: 123 జీవో కోర్టు తీర్పు మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్లో భూ బాధితులు, కూలీల్లో ఆనందాన్ని నింపింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌కు పెద్ద ఎత్తున భూమిని సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇక్కడ కూడా 123 జీవో ప్రకారం భూసేకరణకు దిగగా, రైతు కూలీ సంఘం నాయకులు మోహన్ , రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్ లో హైకోర్టును ఆశ్రరుుంచారు. నిమ్జ్ భూ బాధితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం అందించాలని తీర్పు వెలువరించడంతో రైతులు, కూలీలతోపాటు అఖిల పక్షం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. న్యాల్కల్ మండలంలోని 14 గ్రామాలతోపాటు ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 12,635 ఎకరాలు నిమ్జ్ పేరుతో భూములను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణరుుంచారుు. మొదటి విడతగా ఝరాసంగం మండలం బర్దీపూర్, ఎల్గోరుు, చీలపల్లి, చీలపల్లి తండాతో పాటు న్యాల్కల్ మండలం ముంగి, ముంగి తండా, రుక్మాపూర్, రుక్మాపూర్ తండాలను ఎంపిక చేశారు. అధికారులు ఆయా గ్రామాల పరిధిలోని పట్టా, అసైన్ ్డ భూముల వివరాలను సేకరించారు. పట్టా భూములకు ఎకరానికి రూ:5.80 లక్షలు, అసైన్ ్డ భూమికి ఎకరాకు రూ.3 లక్షల పైచిలుకు చెల్లించారు. అరుుతే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూములు సేకరిస్తుందని నిమ్జ్ భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. 123 జీఓను రద్దు చేసి 2013 చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ రైతు కూలీ సంఘం నాయకులు మోహన్ , రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్ లో హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. తీర్పు రైతులకు, కూలీలకు అనుకూలంగా రావడంతో బాధిత రైతులు, కూలీల్లో సంతోషం వ్యక్తమైంది. -
తెలంగాణ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ
-
తెలంగాణ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ 123,124 జీవోలను కొట్టివేస్తూ.. హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం, చెల్లింపులపై గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి శివారు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. 2013 భూ సేకరణ చట్టం ఉండగా జీవో నెంబర్ 123 ప్రకారం రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకుంటారని ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించింది. రైతుల నుంచి నేరుగా భూమిని సేకరించేందుకు ఏర్పాటు చేసిన జీవోలో అనేక లోపాలున్నట్లు రైతులు హైకోర్టుకు విన్నవించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం 123 జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలో కేవలం రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని.. వాస్తవానికి రైతులతో పాటు రైతు కూలీలకు కూడా నష్టం పరిహారం చెల్లించాలని హైకోర్టు సూచించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తాజా తీర్పుతో మల్లన్నసాగర్ సహా పలు ప్రాజెక్ట్‌ల భూసేకరణపై ప్రభావం పడనుంది. కాగా 123 జీవో కొట్టివేతపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లనున్నట్లు సమాచారం. -
ఊరుకు ఊరు నిర్మించి ఇస్తాం: హరీష్‌రావు
మెదక్ : ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులతో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం సదరు గ్రామాస్తులతో మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు. జీవో నం 123 ప్రకారం భూముల ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ... ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హరీష్‌రావు వెల్లడించారు. ఊరుకు ఊరు నిర్మించి ఇస్తామని ఆయన ఈ సందర్భంగా ఏటిగడ్డకిష్టాపూర్ వాసులకు హామీ ఇచ్చారు. అలాగే ముంపు గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హరీష్‌రావు భరోసా ఇచ్చారు. ఎకరాకు రూ. 6 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని హరీష్‌రావు తెలిపారు. కొన్ని రోజులుగా ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. .