కోర్టు తీర్పు గౌరవించి 123 జీఓను రద్దు చేయాలి
Published Fri, Aug 5 2016 12:04 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
వరంగల్ : భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.123 రద్దు చేసిన హై కోర్టు తీర్పును గౌరవిస్తూ కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2013ను అమలు చేసి భూనిర్వాసితులకు న్యాయం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హన్మకొండలోని టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. కేంద్రం రూపొందిం చిన చట్టం ప్రకారమే భూసేకరణ చేయాల ని, ఇప్పటి వరకు 123జీఓతో సేకరించిన వారికి సైతం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో శోభకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం విస్మరించిన కేసీఆర్
సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని విస్మరిం చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. బాలసముద్రం లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకటవీరయ్య ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ఉల్లంఘించే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడుతోందన్నారు. కోర్టు తీర్పులతో కూడా సీఎంకు జ్ఞానోదయం కావడంలేదని మాజీ ఎమ్మెల్యే సీతక్క ఎద్దేవా చేశారు. ఎంసెట్–2 లీకేజీతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధముందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం ఆరోపించారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, మహబూబాబాద్, పరకాల ఇన్‌చార్జిలు బాలుచౌహాన్, గన్నో జు శ్రీనివాసచారి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పుల్లూ రు అశోక్‌కుమార్, గట్టు ప్రసాద్‌బాబు, జాటోతు ఇందిర, సంతోష్‌నాయక్, బీసీ, ఎస్టీ, ఎస్సీసెల్ విభాగాల అధ్యక్షులు గుర్రం బాలరాజు, అంగోతు కిషన్, సాంబయ్య, రఘునాథరెడ్డి, వెంటకృష్ణ, సారంగం, విజయ్, సురేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement