తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూములను జీవో 123 ద్వారా భూములు సేకరించరాదని న్యాయస్థానం గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు మధ‍్యంతర ఉత‍్తర్వులు జారీ చేసింది.