ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తలిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ)కి సంబంధించి జీవో నెంబర్ 25ను సవరించి తీరాల్సిందేనని శుక్రవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. 10 జిల్లాల ప్రకారమే టీఆర్‌టీ నోటిఫికేషన్ ఉండాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.