TRT notification
-
టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రూపొందించినప్పటికీ గోప్యంగా ఉంచిన విద్యాశాఖ, గురువారం అర్థరాత్రి వెల్లడించింది. శాఖలో 22 వేల వరకూ ఖాళీలున్నప్పటికీ, కేవలం 5,089 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది. 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని గతంలో ప్రకటించినా నోటిఫికేషన్లో ఆ ఖాళీలను ప్రస్తావించలేదు. స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. తొలిసారిగా ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్)లో పరీక్షను నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు దశల వారీగా పరీక్ష ఉంటుందని తెలిపారు. గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లు.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం నల్లగొండ, సంగారెడ్డిలో పరీక్ష కేంద్రాలుంటాయని ప్రభుత్వం పేర్కొంది. అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళు, దివ్యాంగులకు పది సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఇస్తారు. అయితే ఈసారి టీఆర్టీ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కి పెంచారు. పరీక్ష ఆన్లైన్లో పెడుతున్న కారణంగా ఫీజు పెంచినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 20 మధ్య ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఉత్తీర్ణతకు ఓసీలు 90, బీసీలు 75, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు 60 మార్కులు తెచ్చుకోవాలి. టెట్ మార్కుల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టీఆర్టీలో వచి్చన మార్కుల ఆధారంగా ప్రతి పోస్టుకు ముగ్గుర్ని ఎంపిక చేస్తారు. వారి మార్కులు ఇతర మెరిట్స్ ఆధారంగా అందులో ఒకరిని ఎంపిక చేస్తారు. కాగా పూర్తి సమాచారం ఈ నెల 20వ తేదీ నుంచి www.schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. రెండు నెలల వ్యవధేనా? పాఠశాల విద్యాశాఖలో 22 వేల పోస్టులున్నాయని గత ఏడాది విద్యాశాఖ తెలిపింది. ఇందులో 13,086 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రస్తుతం టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపడుతున్నారు. దీనివల్ల కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. వీటిని కూడా కలిపి ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తారని నిరుద్యోగులు భావించారు. కానీ 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు కేవలం 2 నెలల వ్యవధిలోనే పరీక్ష నిర్వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పబ్లిక్ సరీ్వస్ కమిషన్ పరీక్షలకు కూడా ఆర్నెల్ల సమయం ఇస్తున్న సర్కార్, టీఆర్టీని ఇంత త్వరగా పెట్టడం ఏమిటని నిరుద్యోగులు అంటున్నారు. -
టీఆర్టీ నియామకాలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) అభ్యర్థులకు శుభవార్త. ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉపాధ్యాయ నియామకాలకు లైన్ క్లియరైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ–2017 నిర్వహించింది. టీఎస్పీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించినప్పటికీ కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో నియామకాల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అప్పట్నుంచి ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం చేశారు. ఈక్రమంలో టీఎస్పీఎస్సీ అర్హుల జాబితాను పాఠశాల విద్యాశాఖకు సమర్పించింది. దీంతో నియామకాల ప్రక్రియ టీఎస్పీఎస్సీ నుంచి విద్యాశాఖకు చేరింది. ఎట్టకేలకు ప్రభుత్వం శనివారం స్పష్టత ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను నిబంధనలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేస్తూ జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలకు కమిటీలు టీచర్ల నియామకాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తారు. సభ్యులుగా జెడ్పీ సీఈవో, కొత్త జిల్లాల డీఈవోలు, మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీ కమిషనర్లు, జిల్లా షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వస్తే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఉంటారు. ఇప్పటికే టీఆర్టీ ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ జిల్లా కమిటీలకు సమర్పించినట్లు సమాచారం. రోస్టర్, మెరిట్ ఆధారంగా త్వరగా నియామ కాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కమిటీలు తమ పరిధిలోని పాఠశాలల్లో సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించాల్సి ఉంది. కేటగిరీ 1,2,3,4 స్థానాలను సైతం నిర్ధారించాలి. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం నియామకాలు చేపట్టాలి. -
నియామకాలెప్పుడో..!
కరీంనగర్‌ఎడ్యుకేషన్: టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల్లో ఇది వరకు పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే తాజాగా కొనసాగించాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. బడులు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడిన కొద్దీ ఉపాధ్యాయుల నియామకంపై తర్జనభర్జన కొనసాగింది. ప్రభుత్వం టీఆర్టీ నియామకాలు చేపడుతుందా.. విద్యావాలంటీర్లను కొనసాగిస్తుందా అనే సందేహాలు ఉండగా తాజాగా తాత్కాలిక బోధకుల వైపే విద్యాశాఖ మొగ్గు చూపింది. ఈ నెల 11న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు వెల్లడించారు. దీంతో ఏడాదిన్నరగా నియామకాల కోసం ఎదురు చూస్తున్న టిఆర్టీ అభ్యర్థుల కథ మళ్లీ మొదటికొచ్చింది. నియామకాలను భర్తీ చేసి మిగతా ఖాళీలను విద్యావాలంటీర్ల ద్వారా భర్తీ చేయాల్సిన విద్యాశాఖ టీఆర్టీ అభ్యర్థులను పక్కనబెట్టి విద్యావాలంటీర్లను కొనసాగించడంతో సందిగ్ధత నెలకొంది. పాతవారే కొనసాగింపు.. సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి విద్యావాలంటీర్లను నియమిస్తోంది. రెండేళ్ల నుంచి నెలకు రూ.12 వేల వేతనం అందజేస్తూ వారితో వివిధ సబ్జెక్టుల వారీగా బోధన చేయిస్తోంది. కిందటేడాది వరకు కొత్తగా నియామకాలు చేపడుతూ అర్హత ప్రకారం నియమించేవారు. ఇలా ప్రతీ ఏడాది దరఖాస్తులు చేసుకోవడం, మెరిట్ తదితర కారణాల రీత్యా ఇబ్బందులు పడుతున్నామని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇదివరకు పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే ఈ ఏడాది నుంచి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో తాత్కాలిక బోధకులను బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బడులు పునః ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల విద్యాధికారులు సైతం ఉపాధ్యాయుల కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో వారు తాత్కాలిక బోధకులను కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు వారికి బడుల్లో చేరాలని సమాచారం అందించారు. ఇది వరకు ఉపాధ్యాయులు లేనిచోట, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి బోధకుల కొరత ఉన్నచోట, ప్రాధాన్యతక్రమంలో వీరిని నియమించారు. ఆయా పాఠశాలల్లో తాజా సంఖ్యను బట్టి మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కిందటేడాదిలో పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో కొత్తగా మరికొందరిని కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 134 మంది వరకు ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు విద్యావాలంటీర్లు రావడంతో కొంత ఉపశమనం కలిగినట్లవుతోంది. టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదా..! ప్రభుత్వం తాజాగా సర్కారు బడుల్లో విద్యావాలంటీర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇప్పటి కే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి ఫలితాల ను ప్రకటించింది. ఫలితాలు ప్రకటించి సుమారు నాలు గు నెలలు కావస్తున్నా... వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. బడులు తెరిచే నాటికి వీరిని బడుల్లో నియమించాలని అనేక డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. ఎంపికైన అభ్యర్థులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం నియామక ఉత్తర్వులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యావాలంటీర్లనే బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొంత కాలం టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వి ద్యావాలంటీర్లను కొనసాగిస్తున్నామని డీఈవో వెంకటేశ్వర్లు వివరించారు. పాఠశాలల్లో ప్రాధాన్య క్రమంలో వారిని నియమించినట్లు వివరించారు. -
టీఆర్టీ నియామకాలు చేపట్టాలి
ఖమ్మంసహకారనగర్: టీచర్స్ రిక్రూట్‌మెంట్‌మెం ట్టెస్ట్ (టీఆర్టీ) నియామకాలు వెంటనే చేపట్టా లని టీపీటీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని టీపీటీఎఫ్ తలపెట్టిన నిరసన ర్యాలీ సంఘం కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మనో హర్రాజు మాట్లాడుతూ నిరుద్యోగ విద్యావంతులైన యువకులు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయ ని ఆశించారని, అవి అమలుకు నోచుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి మా ట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో పోరాటం చేసిన యువత ప్రస్తుతం నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు. ఉద్యమాలు చేయకముం దే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులకు సంవత్సర నుంచి ఇవ్వాల్సిన కరవుభత్యం (డీఏ) ఈ నెలలో ప్రకటించారని, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన డీఏ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పీఆర్సీ వెంటనే కొత్త స్కేల్‌ను ప్రకటించాలన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, నర్సింహారావు, ప్రసాదరావు, నాగేశ్వరరావు, నాగిరెడ్డి, ఉమాదేవి పాల్గొన్నారు. -
టీఆర్టీ సవరణ జారీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాత పది జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడతామని ప్రకటిస్తూ.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 8,792 ఉపాధ్యాయ పోస్టుల్లో ఈ జిల్లాల వారీగా, కేటగిరీలవారీగా అందుబాటులో ఉండే వాటి వివరాలను వెల్లడించింది. దరఖాస్తుల గడువును ఈ నెల 30వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు పాత జిల్లాల ప్రకారం తమ స్థానిక జిల్లాను ఎంపిక చేసుకునేందుకు ‘డిస్ట్రిక్ట్ ఎడిట్’ఆప్షన్‌ను వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు తెలిపింది. ఇక ఫిబ్రవరి 24–28 తేదీల మధ్య వివిధ పోస్టుల భర్తీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. టీఎస్పీఎస్సీ రాష్ట్రంలో 31 కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ‘టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నోటిఫికేషన్’జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. 31 జిల్లాల వారీగా భర్తీ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని స్పష్టం చేసింది. పాత 10 జిల్లాల ప్రకారమే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పాత జిల్లాల ప్రకారమే పోస్టుల భర్తీకి వీలుగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ను సవరించింది. పాత జిల్లాలు, కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను అభ్యర్థులు tspsc.gov.in వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది. అభ్యర్థులు పోస్టుల వివరాలను సరిచూసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుల గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. వారు ఇప్పటికే ఇచ్చిన జిల్లాల వారీ ప్రాధాన్యాలను మార్చుకోవచ్చని.. ఇందుకోసం వెబ్సైట్లో ‘డిస్ట్రిక్ట్ ఎడిట్’ఆప్షన్ లింకును ప్రత్యేకంగా పొందుపరుస్తున్నట్లు తెలిపింది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు వెబ్‌సైట్‌లోని ఆ లింకు ద్వారా తమ జిల్లాల ఆప్షన్‌ను ఇచ్చుకోవాలని సూచించింది. అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు.. డీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చదివినవారు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు, బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన వారు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. నాలుగు జిల్లాల మైదాన ప్రాంతాల్లో తక్కువగా ఎస్జీటీ పోస్టులు పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను ఇచ్చినా... నాలుగు జిల్లాల్లోని మైదాన ప్రాంతాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఖమ్మంలో కేవలం 7 పోస్టులు మాత్రమే ఉండగా, వరంగల్‌లో 20, నల్లగొండలో 40, కరీంనగర్లో 74 పోస్టులు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మైదాన ప్రాంతంలో పీఈటీ పోస్టులు కేవలం 8 మాత్రమే ఉండగా, లాంగ్వేజ్ పండిట్ పోస్టులూ తక్కువగా ఉన్నాయి. ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులు నాలుగు జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి. -
వారంలో టీఆర్టీ సవరణ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత పది జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఆర్టీ నోటిఫికేషన్ సవరణ చేయాలని.. పాత జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను సిద్ధం చేయాలని విద్యా శాఖను ఆదేశించింది. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాల ఆప్షన్‌ను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించ నున్నారు. కొత్తగా దరఖాస్తు చేసేవారికి పాత పది జిల్లాల ఆప్షన్లే వచ్చేలా మార్పులు చేయనున్నారు. వారం రోజుల్లో సవరణ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. దరఖాస్తుల గడువును కూడా వచ్చే నెల 15వ తేదీ వరకు పొడిగించనున్నట్లు సమాచారం. 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత నెల 21న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే నెల 30వ తేదీ నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. అయితే ఈ నోటిఫికేషన్‌ను 31 కొత్త జిల్లాల ప్రాతిపదికన జారీ చేశారని, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 10 జిల్లాల వారీగా భర్తీ చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు పాత జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టాలని శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. పాత పది జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఆప్షన్లో ‘ఎడిట్’కు అవకాశం టీచర్ పోస్టుల దరఖాస్తుల్లో అభ్యర్థుల స్థానికతకు సంబంధించి 31 జిల్లాలను పొందుపరిచారు. అభ్యర్థులు తాము పుట్టిన ప్రదేశం ప్రకారం కొత్త జిల్లాను ఎంచుకున్నారు. తాజాగా పాత జిల్లాలే ప్రాతిపదిక అని హైకోర్టు స్పష్టం చేయడంతో దరఖాస్తుల్లో మార్పులు చేయాల్సి ఉంది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ‘ఎడిట్’ఆప్షన్ ఇచ్చి.. పాత జిల్లాల లెక్కన తమ జిల్లాను ఎంచుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా నోటిఫికేషన్లో మార్పు ఉండకపోవచ్చని.. సవరణ ద్వారా పాత పది జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ వివరాలను తెలియజేస్తే సరిపోతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం 31 జిల్లాల ఫార్మాట్ స్థానంలో పాత 10 జిల్లాలను అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో.. దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల 15 వరకు పొడగించే అవకాశముంది. మరోవైపు 31 జిల్లాలతో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కొత్త రోస్టర్‌ను ఒకటో పాయింట్ నుంచి ప్రారంభించారు. కానీ పాత జిల్లాల లెక్కన భర్తీతో పాత రోస్టర్, రిజర్వేషన్లనే కొనసాగించనున్నారు. పలు జిల్లాల వారికి ప్రయోజనం కొత్త జిల్లాల లెక్కన చూస్తే.. ఏడు జిల్లాల్లో ఎస్జీటీ వంటి కొన్ని కేటగిరీల పోస్టులే లేవు. మరో 8 జిల్లాల్లో ఏజెన్సీ పోస్టులను మినహాయిస్తే ఎస్జీటీ పోస్టులు 11లోపే ఉన్నాయి. అంటే సాధారణ అభ్యర్థుల విషయంలో 15 జిల్లాల్లో పోస్టులు దాదాపుగా లేనట్లే. మరో మూడు జిల్లాల్లోనూ 50లోపే పోస్టులు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా పాత జిల్లాల లెక్కన భర్తీ చేపట్టనుండడంతో.. ఆయా జిల్లాల ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రయోజనం కలుగనుంది. ముఖ్యంగా పోస్టులు లేని పట్టణ జిల్లాలకు చెందినవారికి ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. పాత జిల్లాల ప్రకారం వివిధ కేటగిరీల్లోనూ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండనుంది. -
హైకోర్టులో టీ సర్కార్‌కు ఎదురుదెబ్బ
-
హైకోర్టులో టీ సర్కార్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తలిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)కి సంబంధించి జీవో నెంబర్ 25ను సవరించి తీరాల్సిందేనని శుక్రవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. 10 జిల్లాల ప్రకారమే టీఆర్టీ నోటిఫికేషన్ ఉండాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. పదిజిల్లాల ప్రాతిపదికన కాకుండా 31 జిల్లాల ప్రాతిపదికన పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై పలుదఫాలుగా హైకోర్టులో విచారణ జరిగింది. బుధవారం తుది వాదనలు విన్న కోర్టు నేడు తీర్పు వెలువరించింది. పిటిషనర్ వాదన... పాఠశాల విద్యా శాఖ అక్టోబర్ 10న జీవో నెంబర్ 25, అందుకు అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్ మరో ముగ్గురు వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణలోని పూర్వపు పది జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదముందని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఆమోదం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి వాదించారు. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాలోని అభ్యర్థి పూర్వపు జిల్లాలో స్థానికేతరుడిగా నష్టపోతున్నారని చెప్పారు. 1976లోనే లోకల్ కేడర్ నిర్ధారణ జరిగిందని, కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాల్ని పరిగణనలోకి తీసుకోవడం చెల్లదన్నారు. పాలనా సౌలభ్యం కోసమే 31 జిల్లాల ఏర్పాటు జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు కూడా కొత్త జిల్లాల్ని ప్రామాణికంగా తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. అడ్వొకేట్ జనరల్ వాదన... 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నియామకాల్ని సవాల్ చేసిన వ్యాజ్యంలో అంతిమంగా పిటిషనర్లు విజయం సాధిస్తే.. పూర్వపు పది జిల్లాలకే టీఆర్టీని వర్తింపజేస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే జరిగితే దరఖాస్తుల స్వీకరణ గడువు 15 రోజులు పొడిగిస్తామని చెప్పారు. అభ్యర్థులు పది జిల్లాల్లో ఎక్కడి వారో తెలుసుకునేందుకు అధికారులకు ఇబ్బందేమీ లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే టీఆర్టీ నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేలా చూడాలని, పరీక్ష వాయిదా పడకుండా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పరీక్ష నిర్వహిస్తే స్థాని క అభ్యర్థులకు అన్యాయం జరగదని, రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్లు కాదని ఏజీ వాదించారు. -
బాబోయ్..డీఎస్సీ
టెట్ కమ్ టీఆర్టీ (టీచర్ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి బాబు మార్కు కొర్రీలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో చేసిన మాటల గారడీలో భాగంగా రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలను వంచించిన విధంగానే నిరుద్యోగ యువతతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అభ్యర్థులు వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది.. నెల్లూరు(విద్య) : జిల్లాలో 416 పోస్టులను టెట్, టీఆర్టీ (టీచర్ అర్హత పరీక్ష) నోటిఫికేషన్లో చూపారు. ఆర్థిక శాఖ ఆమోదం సాకుతో 20 శాతం కుదించారు. ప్రస్తుతం ఉన్న 333 పోస్టుల కు 6వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ప్రతి అభ్యర్థి అర్హత పరీక్ష ఫీజుగా రూ.250 చెల్లించాలి. 6వేల మందికి సుమారు రూ.15 లక్షలు ఒక్క జి ల్లా నుంచే ఖజానాకు రాబడి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 9,061 పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 15 లక్షల మంది నిరుద్యోగులు రూ.250 చొప్పున ప్రభుత్వ ఖజానా నింపేం దుకు తమవంతు బాధ్యతను తమకు తెలియకుండానే భుజాలపైకి ఎత్తుకున్నారు. నిరుద్యోగులతో చెలగాటం పరీక్ష రుసుం రూ.250 బ్యాంక్‌లో చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్నెట్ సెం టర్లో రూ.30 నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. జెరాక్స్ కాపీలకు రూ.20 నుంచి రూ.50 ఖర్చవుతోంది. రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు జెరాక్స్ పత్రాలను విద్యాశాఖకు అందజేసేందుకు రూ.35 నుంచి రూ.50 వెచ్చించాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాల నుంచి నిరుద్యోగులు నెల్లూరుకు చేరుకునేందుకు రూ.100 నుంచి రూ.150 ఖర్చవుతోంది. ఒక్కో అభ్యర్థి సగటున రూ.400 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలను వారు తప్పుపడుతున్నారు. కాంపిటేటివ్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే ధ్రువపత్రాల జెరాక్స్‌లను అం దజేసే ప్రక్రియ ఎక్కడా లేదని వారు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. దరఖాస్తులను అందజేసేందుకు గర్భిణులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. స్పష్టతలేని నోటిఫికేషన్ అర్హత పరీక్షకు వెలువడిన నోటిఫికేషన్లో బీఎస్సీ, బీకాం, ఓపెన్ యూనివర్సిటీ, భాషాపండితులు, ఇంటర్ తత్సమాన అర్హత తదితర అం శాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ నెల 16న ముగిసే ఆన్లైన్ చెల్లింపుల గడువును బుధవారం వరకు పొడిగించారు. ధ్రువీకరణ పత్రాల స్వీకరణకు ఫిబ్రవరి 5 వరకు నిర్ణయించారు. సెలవులు రావడంతో గడువు తేదీలను పొడిగించామని ప్ర భుత్వం చెప్పుకుంటోంది. వాస్తవానికి నిరుద్యోగుల నుంచి మరింత సొమ్ము చేసుకునేందుకు ఈ గడువు పనికొస్తుందని అభ్యర్థులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉన్న పోస్టులకు రెండిం తలు, మూడింతలు అభ్యర్థులు దరఖాస్తులు చే సుకోవడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. విధులకు దూరంగా... ఆన్లైన్లో అప్లికేషన్లు అప్లోడ్ చేసిన తర్వాత వాటి ప్రతులను విద్యాశాఖకు అందజేసే క్రమం లో ఉపాధ్యాయ సిబ్బంది డిసెంబర్ నుంచి సా ధారణ విధులకు దూరమయ్యారు. కలెక్షన్ కమిటీలో డిప్యూటీ ఈఓ, ఏడీస్థాయి, గెజిటెడ్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సుమారు 50 మంది ఫిబ్రవరి 5 తేదీ వరకు సాధారణ విధులకు హా జరయ్యే పరిస్థితి లేదు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత జెరాక్స్ కాపీలను స్వీకరిం చడం అర్థంలేని పని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లు కూడా ఆన్లైన్లోనే వస్తాయనేది సాధారణ ప్రజలకు కూడా తెలిసిన విషయం. ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించి భారీ స్థాయిలో సి బ్బందిని దరఖాస్తుల స్వీకరణకు నియమించడం ఎంతవరకు సమంజసమని పలువురు చర్చించుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తుల స్వీకరణలో నిమగ్నమవడం విద్యార్థులకు తీరని నష్టమని వారి తల్లిదండ్రులు అంటున్నారు.ఇలా సాధ్యం కాని హామీల్లో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఇన్ని అవకతవకల మధ్య డీఎస్సీకి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నిర్వహణ, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తుందా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. డీఎస్సీ దరఖాస్తు పాట్లు నగరంలోని మూలాపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో టెట్ కమ్ టీఆర్టీ దరఖాస్తుల జెరాక్స్ పత్రాలను అందజేసేందుకు జిల్లావ్యాప్తంగా వచ్చే అభ్యర్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, దరఖాస్తులు ఇచ్చేందుకు చాలాసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వరకు 7,110 దరఖాస్తులు స్వీకరించారు.