తెలంగాణ సర్కార్కు మరో ఎదురుదెబ్బ | Setback to telangana government as GO 123 | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 3 2016 4:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ 123 జీవోను కొట్టివేస్తూ.. హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం, చెల్లింపులపై గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లా రుద్రంగి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. 2013 భూ సేకరణ చట్టం ఉండగా జీవో నెంబర్ 123 ప్రకారం రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకుంటారని ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ను ప్రశ్నించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement