మెదక్ : ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులతో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం సదరు గ్రామాస్తులతో మంత్రి హరీష్రావు భేటీ అయ్యారు. జీవో నం 123 ప్రకారం భూముల ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. అనంతరం హరీష్రావు మాట్లాడుతూ... ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హరీష్రావు వెల్లడించారు.
ఊరుకు ఊరు నిర్మించి ఇస్తామని ఆయన ఈ సందర్భంగా ఏటిగడ్డకిష్టాపూర్ వాసులకు హామీ ఇచ్చారు. అలాగే ముంపు గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హరీష్రావు భరోసా ఇచ్చారు. ఎకరాకు రూ. 6 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని హరీష్రావు తెలిపారు. కొన్ని రోజులుగా ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
.