
సాక్షి, హైదరాబాద్: 'ఈటల నీ కమ్యూనిజం ఇప్పుడు ఎక్కడ పోయింది.. బీజేపీ నేతల దగ్గర తాకట్టు పెట్టావా' అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. '' ఇవాళ ఈటలను అందరూ ఛీ కొడుతున్నారు. ఒక మంత్రిగా ఈటల చట్ట విరుద్ధమైన పనులు చేశారు? ప్రభుత్వ భూములు ఎలా తీసుకున్నావు? నీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది?.. 20 ఏళ్లల్లో సీఎం కేసీఆర్ ఎందరో నేతలను తయారు చేశారు. కానీ నిన్ను గౌరవించినట్లు కేసీఆర్ ఇంకెవరినీ గౌరవించలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ పదవులు మీరే అనుభవించారు. నాయకుడు, పార్టీపై నమ్మకం లేకుంటే చెప్పాలి. ఈటల క్షమించరాని నేరం చేశారు. సమయం చూసి ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాం'' అని ధ్వజమెత్తారు.
టీఆర్‌ఎస్‌లో ఉన్నవారికి ఆత్మగౌరవం లేదు: డీకే అరుణ
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో ఉన్నవారికి ఆత్మగౌరవం లేదని బీజేపీ మహిళా నేత డీకే అరుణ మండిపడ్డారు. ఈటలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఇతరుల ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత పల్లాకు లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నవారికి ఆత్మలు ఉంటే కదా గౌరవం ఉండేది అని అరుణ విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment