తరిగొప్పులలో మాట్లాడుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: తనను గెలిపిస్తే జనగామ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరుగా పనిచేస్తాను.. సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకా న్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తరిగొప్పులలో కార్యకర్తల సమావేశం, బచ్చన్నపేటలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు.
తనను ఆశీర్వదించి గెలిపిస్తే బాధ్యతగా ప్రజాసమస్యలు పరిష్కరించడంతోపాటు అభివృద్ధి చేసి చూపించి ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తానని చెప్పారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు సేవ విషయంలో పోటీకి రావాలే తప్ప నాన్‌లోకల్ అని ప్రచారం చేయడం మానుకోవాల న్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 16న జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని, అద్భుతమైన మేనిఫెస్టో రాబోతోందని చెప్పారు.
కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జల్లి సిద్దయ్య, ఇర్రి రమణారెడ్డి, జెడ్పీటీసీ ముద్దసాని పద్మజావెంకట్‌రెడ్డి, ఎంపీపీలు నాగజ్యోతి, కల్లూరి అనిల్‌రెడ్డి, సర్పంచ్‌లు సతీష్‌రెడ్డి, మల్లారెడ్డి, అయిలుమల్లయ్య, దివ్య, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, పింగిళి జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
సీఎం సభ ఏర్పాట్లు పరిశీలన
సిద్దిపేటరోడ్డు మెడికల్ కళాశాల మైదానంలో ఈ నెల 16న నిర్వహించే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం పరిశీ లించారు. సభా ప్రాంగణంతో పాటు సీఎం వచ్చే హెలికాప్టర్ కోసం వికాస్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను సందర్శించారు. గ్రామాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్‌కు సంబంధించి, ఎవరు ఎక్కడ అనే దానిపై అన్ని గ్రామాల బాధ్యులకు ముందస్తు సమాచారం చేరవేయాలని పేర్కొన్నారు.
పల్లా వెంట పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు నీల యాదగిరి, జూకంటి శ్రీశైలం, దేవరాయ నాగరాజు, బండ వెంకటేష్, బండ హరీష్ సంకటి రాజు, బోల మహేష్, బోల వెంకటేష్, జిట్ట శ్రీశైలం యాదవ్, బక్క రవి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment