
ప్రభుత్వంపై విషం కక్కుతున్న కాంగ్రెస్
ప్రభుత్వంపై పోరాడటానికి ఏ అంశమూ దొరక్క.. కాంగ్రెస్ నాయకులు సమస్యే కాని దాన్ని సమస్యగా
మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంపై పోరాడటానికి ఏ అంశమూ దొరక్క.. కాంగ్రెస్ నాయకులు సమస్యే కాని దాన్ని సమస్యగా చిత్రీకరించి ప్రభుత్వంపై, మంత్రి కేటీఆర్‌పై విషం కక్కు తున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.
మీరాకుమార్‌ను సిరిసిల్లకు రప్పించి కాంగ్రెస్ నేతలు డ్రామాకు తెరలేపారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్లలో దళితులు, గిరిజనులపైనే కాకుండా ఏ ఒక్క వర్గం వారిపైనా చిన్న దాడి జరగలేదని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు.