►ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళ పరుస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంసెట్ పరీక్ష నిర్వహించిన మాగ్నటిక్ సంస్థతో టీఆర్‌ఎస్ నేతలెవరికీ సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఉనికి చాటుకోవడానికి విమర్శలు చేస్తున్నారన్నారు.
లీకేజీ వ్యవహారం బహిర్గతం కాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టిందని, చట్టప్రకారం ముందుకు వెళ్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో మంత్రులకు సంబంధం లేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. మరో ఎమ్మెల్సీ బోడికుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పత్రికల్లో ఎంసెట్ లీకేజీ వార్తలు రాగానే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చారన్నారు.
మాగ్నటిక్ కు టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదు
Published Mon, Aug 1 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
Advertisement