సాక్షి, హైదరాబాద్: కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీని గద్దెదింపే శక్తులతో తమపార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చర్చించి చేతులు కలుపుతారని స్పష్టం చేశారు.
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్ గుప్తాతో కలసి సోమ వారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్‌ఐసీ సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వరిసాగును ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
కేంద్రంపై పోరు సాగిస్తున్న కేసీఆర్ అవసరమైన సమయంలో కీలకనిర్ణ యం తీసుకుంటారని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, పీయూష్ గోయెల్ అబద్ధాలు చెప్తున్నారని, వచ్చే యాసంగి లోనూ వరిసాగు చేయకుండా అడ్డుకున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ బాగుందని గవర్నర్ తమిళిసై కూడా మెచ్చుకున్నారని పల్లా గుర్త చేశారు.
Comments
Please login to add a commentAdd a comment