magnetic
-
షుగర్ పేషెంట్లకు భారీ ఊరట: మూడు రెట్ల సమర్ధతతో కొత్త మాగ్నటిక్ జెల్
Magnetic gel చర్మంపై ఏర్పడే తీవ్రమైన పుండ్ల చికిత్సలో కీలక అధ్యయనం ఒకటి భారీ ఊరటనిస్తోంది. కాలిన గాయాలు, చర్మంపై మానని గాయాలు, ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మధుమేహంతో బాధపడుతున్న వారిలో అల్సర్లు నెమ్మదిగా నయం అవుతాయి. ఒక్కోసారి శరీర భాగాలను తొలగించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి వాటికి పరిష్కారంగా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ మాగ్నటిక్ జెల్‌ను రూపొందించింది. ఇది మృత చర్మకణాల చికిత్సలో మూడు రెట్లు సమర్ధ వంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. కాలిన గాయాలు,డయాబెటిక్, నాన్-డయాబెటిక్, తదితర దీర్ఘకాలిక అల్సర్ల చికిత్సలో మూడు రెట్లుగా మెరుగ్గా పనిచేస్తుందని అధ్యయన వేత్తలు తేల్చారు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో జెల్ చికిత్స స్కిన్ ఫైబ్రోబ్లాస్ట్‌ల వృద్ధి రేటును సుమారు 240 శాతం పెంచింది అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి రేటును రెట్టింపు చేసింది. ఈ జెల్ కెరాటినోసైట్లు , ఇతర కణాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచిందని, తద్వారా గాయపడిన ప్రదేశంలో కొత్త రక్తనాళాల పెరుగుదలకు తోడ్పడిందని వెల్లడించింది. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సన్ యాట్-సేన్ యూనివర్శిటీ, వుహాన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. (గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!) "వైర్లెస్ మాగ్నెటిక్ -రెస్పాన్సివ్ హైడ్రోజెల్ చర్మపై గాయాల్ని నయం చేయడంలో ప్రాథమిక సవాళ్లను అధిగమించిదని పరిశోధన వేత్త డాక్టర్ షౌ యుఫెంగ్ తెలిపారు. ఈ మాగ్నటిక్ జెల్‌ను గాయానికి నేరుగా బ్యాండేజ్‌లో అమరుస్తారు. ఇందులో ఎఫ్‌డీఏ ఆమోదిత అతి చిన్న అయస్కాంత సెల్స్ కెరాటినోసైట్లు (చర్మాన్ని బాగు పర్చడంలో), ఫైబ్రోబ్లాస్ట్లు (చర్మంపై కణాల మధ్య సమన్వయం) కీలక పాత్ర పోషిస్తాయి. గాయంపై ఉంచిన మాగ్నటిక్ డివైస్ ద్వారా వెలువడిన అయస్కాంత కణాలు నెమ్మదిగా కదులుతూ, రోగి చర్మ కణాలతో మిళితమై కొత్త కణాల వృద్ధికి తోడ్పడతాయి. ఈ అయస్కాంత స్టిమ్యులేషన్ పరికరంపై సంబంధిత అవయవాన్ని రెండు నుండి మూడు గంటల పాటు ఉంచితే సరిపోతుందని అధ్యయన వేత్తలు తెలిపారు. (‘‘ఇక్కడ క్లిక్ చేయండి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) -
ఐఫోన్ ఫీచర్లతో తొలి ఆండ్రాయిడ్ ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీదారు రియల్మీ మరో సంచలనానికి తెర తీయనుంది. ఆపిల్ ఐఫోన్-12 ఫీచర్లు కల్గిన ఫోన్లను రియల్ మీ ఫ్లాష్ పేరిట టీజ్ చేసింది. మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా రియల్మీ ఫ్లాష్ అవతరిస్తుందని కంపెనీ ఇండియా సీఈఓ మాధవ్ శ్వేత్ పేర్కొన్నారు. రియల్మీ నుంచి వచ్చే కొత్త ఫోన్‌ను కంపెనీ సీఈఓ మాధవ్ శ్వేత్ ట్విటర్లో టీజ్ చేశాడు. బీబీకే బ్రాండ్ ఉత్పత్తుల్లో రియల్ మీ ఫ్లాష్ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో పవర్ఫుల్ ఫోన్‌గా నిలుస్తోందని పుకార్లు వస్తున్నాయి. త్వరలో రిలీజ్ కాబోయే రియల్మీ ఫ్లాష్ స్నాప్‌డ్రాగన్ 888ను అమర్చిన్నట్లు తెలుస్తోంది. రియల్మీ ఫ్లాష్ మొబైల్‌ను సపోర్ట్ చేసేందుకు వీలుగా రియల్ మాగ్‌డార్ట్ వైర్లెస్ ఛార్జర్‌ను కూగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపిల్ ఐఫోన్లకు మాగ్‌సేఫ్ పనిచేసినట్లుగానే ఈ రియల్ మీ మాగ్‌డార్ట్ పనిచేయనుంది. మాగ్‌డార్ట్ ఛార్జర్ కనీసం 15W ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా రియల్ మీ ఫ్లాష్ మార్కెట్ రిలీజ్ డేట్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రియల్ మీ ఫ్లాష్ ఫీచర్లు క్వాలకం స్నాప్‌డ్రాగన్ 888 12 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజీ 256 జీబీ కర్వ్డ్ స్క్రీన్ కార్నర్ పంచ్ హోల్ కెమెరా ట్రిపుల్ రియర్ కెమెరా Meet realme Flash, World's 1st Android Phone with Magnetic Wireless Charging⚡ RT & reply with #realmeFlash if you are ready to experience its magnificent attraction. #realmeTechCharging #DareToLeap pic.twitter.com/6rZhk42Hgg — Madhav Sheth (@MadhavSheth1) July 27, 2021 -
Fact check: వ్యాక్సిన్‌తో అయస్కాంత శక్తి ... అసలు నిజం ఇది
మంగళూరు: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే శరీరానికి అయస్కాంత లక్షణాలు వస్తున్నాయనే వార్తలు దేశమంతట నుంచి వినిపిస్తున్నాయి. దక్షిణ భారతం మొదలు ఈశాన్య భారతం వరకు చాలా మంది ఒంటికి కరెన్సీ బిళ్లలు, చెమ్చాలు, ప్లేట్లు అంటించుకుని సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ తరహా వీడియోలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌పై మరోసారి అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి. పీఐబీ ఖండన వ్యాక్సిన్ వేసుకుంటే ఆయస్కాంత శక్తి వస్తోందంటూ వైరల్ అవుతోన్న వీడియోలపై ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్పందించింది. కోవిడ్ వ్యాక్సిన్లలో కరోనా వైరస్‌తో పోరాడే ఔషధాలే తప్ప శరీరానికి అయస్కాంత లక్షణాలు ఇచ్చే మరేవీ లేవని స్పష్టం చేసింది. వ్యాక్సిన్లు వేసుకోవడానికి ముందుకు రావాలని కోరింది. Several posts/videos claiming that #COVID19 #vaccines can make people magnetic are doing the rounds on social media. #PIBFactCheck: ✅COVID-19 vaccines do NOT make people magnetic and are completely SAFE Register for #LargestVaccineDrive now and GET VACCINATED ‼️ pic.twitter.com/pqIFaq9Dyt — PIB Fact Check (@PIBFactCheck) June 10, 2021 కర్నాటకలో కలకలం తాజాగా కర్నాటకలో ఉడుపి, బెంగళూరులలో ఇద్దరు మహిళలు ఇలాంటి పోస్టులు పెట్టడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. వ్యాక్సిన్‌తో శరీరం అయస్కాంతంలా మారుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మంగళూరుకు చెందిన రేషనలిస్టు నరేంద్ర నాయక్. లోహపు వస్తువులు శరీరానికి అంటుకోవడానికి గల కారణాలను సైంటిఫిక్‌గా వివరించారు. కారణం ఇది కోవిడ్ వ్యాక్సిన్ అనంతరం అయస్కాంత శక్తి గురించి నరేంద్ర నాయక్ వివరిస్తూ ‘‘తలతన్యత (surface Tension) కారణంగానే శరీరానికి లోహపు వస్తువులు అంటుకుంటాయి, శరీర తత్వాలను బట్టి కొందరిలో ఈ తలతన్యత గుణం ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎవరైనా శరీరానికి లోహపు వస్తువులు అతుక్కుంటున్నాయని చెబితే... ఓసారి సబ్బుతో లేదా ఆల్కహాల్ శానిటైజర్‌తో ఎక్కడైతే లోహపు వస్తువులు ఆకర్షింపబడుతున్నాయని చెబుతున్నారో.... ఆ శరీర భాగాలను శుభ్రం చేయండి. ఆ తర్వాత ఆ శరీర భాగాన్ని టవల్‌తో తుడిచి పొడిగా మారేలా చూడాలి. అనంతరం ఆ శరీర భాగంపై లోహాపు వస్తువులు అంటివ్వమని కోరాలి...... ఇప్పుడు ఆ వస్తువులు వారి ఒంటికి అంటుకోవు. ఎందుకంటే సబ్బు, ఆల్కహాల్ శాటిటైజర్ కారణంగా తలతన్యత తగ్గిపోతుంది’ వివరించారు. నిజం కాదు లోహపు వస్తువులు శరీరారానికి అంటుకోవడానికి తలతన్యత తప్ప మరో కారణం లేదని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ మాగ్నటిజం గురించి చెబతున్న వాళ్ల ఒంటికి రాగి వస్తువులు కూడా ఒంటికి అంటుకుంటున్నాయని. ఇది అయస్కాంత ధర్మాలకు విరుద్ధమని కూడా ఆయన తెలిపారు. చదవండి : Black Fungus: బెంగళూరులో ప్రమాద ఘంటికలు -
ప్రయోగం చేశాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు
నేటి తరం పిల్లలు ఒక పట్టాన ఏదీ నమ్మరు. స్వయంగా తమంతట తాము స్వయంగా తెల్సుకుంటేగాని ఒక నిర్ణయానికి రారు. ఈ కోవకు చెందిన వాడే మనం చెప్పుకోబోయే చిచ్చరపిడుగు రిలేమోరిసన్. ఇంగ్లాండ్‌లోని గ్రేట్ మాంచెస్టర్‌కు చెందిన 12 ఏళ్ల మోరిసన్ 54 మ్యాగ్నటిక్ బాల్స్ మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఆయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని లె లుసుకున్న మోరిసన్ .. మాగ్నెట్‌తో తయారు చేసిన బాల్స్‌ను మింగితే.. తన పొట్ట అయస్కాంతంలా పనిచేస్తుందని అనుకున్నాడు. అసలు అది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకునేందుకు జనవరి 1న కొన్ని బాల్స్, నాలుగున... కొన్ని... మొత్తం 54 మ్యాగ్నటిక్ బాల్స్‌ను మింగేసాడు. మింగిన తరువాత ఒక ఐరన్ స్టిక్‌ను తన పొట్ట మీద ఉంచాడు. ఎంతకీ అది అయస్కాంతానికి ఆతుక్కోక పోవడంతో.. తాను మింగిన బాల్స్ టాయిలెట్లో పడిపోయాయేమోనని వాష్‌రూమ్‌కు వెళ్లి చూశాడు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో కంగారుపడిపోయాడు. వాటిని ఎలా బయటికి తీయాలో తెలియక నానా అవస్థలు పడిన మోరిసన్ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వాళ్ల అమ్మ పైజ్వార్డ్ను నిద్రలేపి పొరపాటున రెండు మ్యాగ్నటిక్ బాల్స్‌ను మింగానని చెప్పాడు. వెంటనే మోర్సిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన పైజ్‌కు విస్తుపోయే నిజం తెలిసింది. చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క! కూలో చేరిన కంగనా: ట్విటర్‌కు కౌంటర్ డాక్టర్లు ఎక్స్‌రే తీసి మొత్తం 54 బాల్స్ ఉన్నాయని చెప్పారు. ఇవి కడుపులో అలాగే ఉండిపోతే వేరే అవయవాలు పాడై ప్రాణం పోయే అవకాశం ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి సర్జరీని ప్రారంభించారు. ఆరుగంటల పాటు నిర్విరామంగా సర్జరీ చేసి మోరిసన్ మింగిన బాల్స్ అన్నింటినీ బయటకు తీశారు. అప్పటికీ మోరిసన్ పూర్తిగా కోలుకోలేదు. హాస్పిటల్లో 10 రోజుల పాటు ఉండిపోవలసి వచ్చింది. పేగుకు రంధ్రం పడడం వల్ల ఆకుపచ్చని ద్రవం ఒకటి విడుదలవ్వడంతో దానిని పూర్తిగా కక్కిన తరువాత గాని అతను కదల్లేకపోయాడు. ఈ సమయంలో అతనికి ట్యూబ్ ద్వారా ఆహారం అందించారు. రెండు వారాలు తరువాత పూర్తిగా కోలుకుని డిచార్జ్ అయ్యాడు మోరిసన్. మోరిసన్‌కు సైన్స్ అంటే ఎంతో ఆసక్తి. ప్రయోగాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అందుకే కడుపులో మ్యాగ్నెటిక్ బాల్స్ ఉంటే ఐరన్ స్టిక్ తన పొట్టకు అతుక్కుంటుందా లేదా అనే∙విషయం తెలుసుకోవడానికి ఇలా చేసానని మోరిసన్ చెప్పినట్లు తల్లి చెప్పారు. ఈ విషయం మనకు చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ మోరిసన్ చాలా చిన్నవాడు కావడంతో ఇలా చేసాడని ఆమె వివరించారు. -
అయస్కాంతాలతో కండరాలకు శక్తి...
వ్యాయామం చేస్తూ ఉంటే కండరాలు దృఢంగా మారతాయి. చాలాసార్లు విన్నమాటే ఇది. గాయాలై కదల్లేని వారి గతేమిటి? ఎంరెజెన్ వాడితే చాలంటున్నారు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అయస్కాంత శక్తితో పనిచేసే ఈ ఎంరెజెన్ను రోజూ ఉపయోగిస్తే ఎలాంటి వారికైనా వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుందని అల్ఫ్రెడో ఫ్రాంకో ఒబెర్గన్ అంటున్నారు. కండరాలపై నిర్దిష్ట తీవ్రతతో ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం ద్వారా ఎంరెజెన్ పనిచేస్తుందని ఫలితంగా ఖర్చయిపోతున్నట్లు భ్రమపడి కండరాలు మళ్లీ దృఢంగా తయారయ్యే ప్రయత్నం చేస్తాయని వివరించారు. వ్యాయామం అస్సలు చేయని లేదా చేయలేని వారి కండరాలు కాలక్రమంలో బలహీనపడుతూ ఉంటాయని.. తద్వారా వచ్చే దుష్ఫలితాలను ఎంరెజెన్ సాయంతో నివారించవచ్చునని చెప్పారు. 2015, 2017లలో తాము ఈ యంత్రాన్ని కొంతమందిపై ప్రయోగించి చూశామని వారానికి ఒక రోజు పది నిమిషాలపాటు.. ఐదు వారాలపాటు ఒక కాలి కండరంపై దీన్ని వాడినప్పుడు కండరాల శక్తిలో 30 నుంచి 40 శాతం వరకూ పెరుగుదల కనిపించినట్లు తెలిపారు. రెండో ప్రయోగంలో మోకాలి శస్త్రచికిత్స చేసిన వాళ్లు కొంతమందిని రెండు గుంపులుగా విడదీశామని.. కొందరికి ఎంరెజెన్.. మిగిలిన వాళ్లకు సాధారణ ఫిజియోథెరపీ ఇచ్చామని యంత్రాన్ని వాడిన వాళ్లు చాలా తొందరగా కోలుకున్నట్లు తెలిపారు. -
మాగ్నటిక్ కు టీఆర్ఎస్కు సంబంధం లేదు
►ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళ పరుస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంసెట్ పరీక్ష నిర్వహించిన మాగ్నటిక్ సంస్థతో టీఆర్ఎస్ నేతలెవరికీ సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఉనికి చాటుకోవడానికి విమర్శలు చేస్తున్నారన్నారు. లీకేజీ వ్యవహారం బహిర్గతం కాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టిందని, చట్టప్రకారం ముందుకు వెళ్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో మంత్రులకు సంబంధం లేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. మరో ఎమ్మెల్సీ బోడికుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పత్రికల్లో ఎంసెట్ లీకేజీ వార్తలు రాగానే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చారన్నారు. -
ఉత్తరం దక్షిణం.. ఉల్టా పల్టా!
భూమి ఓ పెద్ద బంతిలాంటి అయస్కాంతం. చుట్టూ రక్షణకవచంలా వేల మైళ్లకొద్దీ అయస్కాంత క్షేత్రం ఉంది. కానీ ఇప్పుడా క్షేత్రం బలహీనమవుతోంది. తలకిందులుగా తిరగబడేందుకు సిద్ధమవుతోంది! మరి ఉత్తర, దక్షిణాలు ఉల్టాపల్టా అయితే... ఏమవుతుంది? ఎందుకు? ఏమిటి? ఎలా!? మన సౌరకుటుంబంలో ఒక్క భూమిపై మాత్రమే జీవుల మనుగడకు తోడ్పడే వాతావరణం ఎందుకు ఉందో తెలుసా? భూమి అంతర్భాగం నుంచి చుట్టూ వేల మైళ్ల వరకూ బలమైన అయస్కాంత క్షేత్రం ఆవరించి ఉండటం వల్లే. ఆ అయస్కాంత క్షేత్రమే లేకపోతే అసలు భూమిపై ఓజోన్ పొర, ఇప్పుడున్న వాతావరణమే ఉండేవి కావు. సూర్యుడి నుంచి దూసుకొచ్చే సౌరగాలులు, ప్లాస్మాకణాలు, అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ రేడియేషన్ ఓజోన్ పొరను తూట్లు పొడిచేవి. వాతావరణాన్ని దాదాపుగా ఊడ్చుకుపోయేవి! ఫలితంగా అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్ తాకిడికి భూమి కూడా ఇతర గ్రహాల్లా వట్టి మట్టిముద్దగా మిగిలిపోయేది!! అయితే భూమికి ఇంత ముఖ్య రక్షణకవచమైన అయస్కాంత క్షేత్రం గత ఆరు నెలలుగా ఓ పక్క బలహీనం అవుతోంది. అదేసమయంలో మరోపక్క బలోపేతం అవుతోంది. భూ అయస్కాంత క్షేత్రానికి అసలు ఏం జరుగుతోంది? అది బలహీనం అయితే ముప్పు ఏర్పడుతుందా? మున్ముందు ఏం జరగబోతోంది? శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికర సంగతులు ఇవీ.. గుట్టువిప్పిన ఉపగ్రహాలు... భూమికి భౌగోళికంగా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉన్నట్టే.. అయస్కాంత క్షేత్రానికి కూడా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయి. ప్రస్తుతం అయస్కాంత ధ్రువాలు భౌగోళిక ధ్రువాలకు దగ్గరగానే ఉన్నాయి. అయితే.. పశ్చిమార్ధగోళంపై అయస్కాంత క్షేత్రం గత ఆరు నెలలుగా క్రమంగా బలహీనం అవుతోందని, అదేసమయంలో దక్షిణ హిందూ మహాసముద్రం వైపు బలోపేతం అవుతోందని ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన మూడు ‘స్వార్మ్’ ఉపగ్రహాల పరిశీలనలో తేలింది. స్వార్మ్ ఉపగ్రహాల సమాచారాన్ని నిశితంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఇది 2, 3 లక్షల ఏళ్లకు ఓసారి జరిగే సహజ ప్రక్రియలో భాగంగానే జరుగుతోందని గుర్తించారు. ఇప్పుడు మరోసారి భూమి అయస్కాంత క్షేత్రం తారుమారు అయ్యే సమయం వచ్చేసిందని, 2, 3 వందల ఏళ్లలో దాని ఉత్తర ధ్రువం దక్షిణానికు, దక్షిణ ధ్రువం ఉత్తరానికి మారిపోనున్నాయని, ఇప్పుడు కనిపిస్తున్నది ఆ ప్రక్రియకు ముందస్తు సంకేతమేనని వారు తేల్చారు. ఎందుకీ తకరారు? అయస్కాంత క్షేత్రం తలకిందులు ఎందుకవుతుందో తెలుసుకోవాలంటే ముందుగా అది ఎలా ఏర్పడుతోందో తెలుసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే... కడుపులో భారీ ఇనుప బంతి, దాని చుట్టూ ద్రవరూపంలో ఉన్న ఇనుము, నికెల్ లోహాల మిశ్రమం తిరగడం వ ల్ల భూమి అనేది ఒక ఎలక్ట్రిక్ డైనమో(విద్యుచ్చాలక యంత్రం)లా పనిచేస్తుంది. దాంతో భూమి చుట్టూ భారీ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం.. భూకేంద్రమైన ఇన్నర్ కోర్ భాగంలో ఘనరూపంలోని ఇనుము 10,300 డిగ్రీ ఫారిన్హీట్ల వరకూ ఉంటుందట. దాని చుట్టూ ఇనుము, నికెల్, ఇతర లోహాలు ద్రవరూపంలో ఉండే ఔటర్ కోర్ పొర ఉంటుంది. ఈ రెండు పొరల మధ్య ఉష్ణోగ్రతలు, పీడనం, సంఘటనం వంటివాటి ఆధారంగా ఉష్ణప్రసరణం జరుగుతుంది. అదేవిధంగా ఈ లోహాల ప్రవాహం ఎలక్ట్రిక్ కరెంట్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా అవి అయస్కాంత క్షేత్రాలుగా మారతాయి. ఈ లోపలి చిన్నచిన్న అయస్కాంత క్షేత్రాలన్నీ కలిసి భూమి చుట్టూ ఓ పెద్ద అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. అయితే కోర్ ఉష్ణోగ్రతల్లో మార్పులు, భూ భ్రమణాన్ని బట్టి ద్రవలోహాలు తిరుగుతాయి. ఈ ద్రవలోహాల ప్రవాహం, వేడి తగ్గినచోట అయస్కాంత క్షేత్రం ఉపరితలంలో బలహీనం అవుతుందన్నమాట. ఉదాహరణకు.. అమెరికాపై అయస్కాంత క్షేత్రం బలహీనం అవడం అంటే.. అమెరికా కింద ఔటర్ కోర్లో ప్రవాహం మందగించింద ని అర్థం చేసుకోవచ్చు. వేల ఏళ్ల నుంచి వందల ఏళ్లకు... భౌగోళిక ధ్రువాల మాదిరిగా అయస్కాంత ధ్రువాలు స్థిరంగా ఉండవు. నిరంతరం కదులుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉత్తర అయస్కాంత ధ్రువం సైబీరియా (రష్యా) వైపుగా సంవత్సరానికి 25 మైళ్ల చొప్పున కదులుతోందట. అయితే అయస్కాంత ధ్రువాలు 2, 3 లక్షల ఏళ్లకు ఓసారి తిరగబడతాయని, ఆ తిరగబడే ప్రక్రియ 2 వేల ఏళ్లపాటు జరుగుతుందని ఇంతవరకూ భావించేవారు. అయస్కాంత క్షేత్రం బలహీనం అయ్యే ప్రక్రియ వందేళ్లకు ఐదు శాతం జరుగుతుందనీ అనుకునేవారు. కానీ స్వార్మ్ ఉపగ్రహాల సమాచారంపై అధ్యయనం తర్వాత.. దశాబ్దానికే ఐదు శాతం ప్రక్రియ జరుగుతోందని అంచనా వేశారు. దీంతో రెండు, మూడు వందల ఏళ్లలోనే అయస్కాంత ధ్రువాలు మారతాయని భావిస్తున్నారు. అరుదైనదే కానీ.. హానికరం కాదు.. భూమి అయస్కాంత క్షేత్రం ఓ పక్క బలహీనం అయినా.. వాతావరణాన్ని సౌరగాలులు, రేడియేషన్ తూట్లు పొడిచేంతగా క్షీణించిపోదట. అయస్కాంత క్షేత్రం బలహీనమైనా.. లేదా తారుమారు అయినా.. కాస్మిక్ రేడియేషన్‌ను అది అడ్డుకోవడాన్ని ఆపదని, అదువల్ల భూగోళానికి ఏ హానీ ఉండదని, అన్నీ సక్రమంగానే జరుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి చుట్టూ అయస్కాంతక్షేత్రం పూర్తిగా మాయమవ్వదని, కాస్త బలహీనం మాత్ర మే అవుతుందని వారు భరోసా ఇస్తున్నారు. - హన్మిరెడ్డి యెద్దుల పుడమికి అసలైనరక్షణ కవచం అంతరిక్షంలో సెకనుకు 200 నుంచి 1000 కి.మీ. వేగంతో దూసుకొచ్చే సౌరగాలులు, విద్యుదావేశ ప్లాస్మా కణాల ధాటికి సాధారణంగా అయితే భూమి వాతావరణం తుడిచిపెట్టుకుపోవాలి. కానీ.. వాటిని అడ్డుకుని దారి మళ్లించడం ద్వారా భూగోళాన్ని అయస్కాంత క్షేత్రం నిరంతరం రక్షిస్తోంది. భూమి చుట్టూ అదృశ్యరూపంలో గాలిబుడగలా ఉన్న ఈ అయస్కాంత క్షేత్రం సూర్యుడి వైపుగా సుమారు 63 వేల కి.మీ.లు, వెనక వైపుగా 12 లక్షల కి.మీ. వరకూ భూమిని ఆవరించి ఉంటుంది. అయితే సౌరగాలుల ఒత్తిడిని బట్టి ఇది ఒక్కోచోట ఎక్కువ, ఒక్కోచోట తక్కువ సైజులోకి మారుతుంటుంది.