
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ల భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... పవన్ కల్యాణే ...కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ గురించి పవన్ ప్రశంసించారని, ఇరవై నాలుగు గంటల కరెంట్... కేసీఆర్ ఘనతేనని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
కాగా పవన్ నిన్న సాయంత్రం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లోని సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తొలిసారిగా ప్రగతి భవన్‌కు రావటం, సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ టీఆర్‌ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment